బోగీలు లేకుండానే గూడ్స్‌ రైలు ఇంజిన్‌ ముందుకు.. | Goods Trrain Engine Move Forward Without Bogies In khammam | Sakshi
Sakshi News home page

బోగీలు లేకుండానే గూడ్స్‌ రైలు ఇంజిన్‌ ముందుకు..

Published Tue, Feb 8 2022 7:28 PM | Last Updated on Tue, Feb 8 2022 7:46 PM

Goods Trrain Engine Move Forward Without Bogies In khammam - Sakshi

పట్టాలపై నిలిచిన గూడ్స్‌ బోగీలు

సాక్షి, బోనకల్‌(ఖమ్మం): సరుకు రవాణా గూడ్స్‌ రైలు బోగీల లింకు తెగిపోవడంతో గోవిందాపురం(ఏ) రైల్వే గేటు సమీపంలో సోమవారం ఓ గూడ్స్‌ రైలు బోగీలు పట్టాలపై నిలిచిపోయాయి. విజయవాడ వైపు ఈ గూడ్సురైలు వెళ్తుండగా సాయంత్రం 4గంటల సమయంలో ఒక్కసారిగా లింక్‌ తెగింది. అయితే ఈ విషయాన్ని రైలు డ్రైవర్‌ గుర్తించకుండా ఇంజిన్‌ను ముందుకు తీసుకెళ్లారు. గార్డు సమాచారాన్ని అందించాక తిరిగి ఇంజిన్‌ను వెనుకకు తెచ్చి మరమ్మతులు చేశారు. గంట పాటు పట్టాలపై నిలవడంతో పలు ట్రెయిన్ల రాకపోకలు నిలిచిపోయాయి. గేటు వద్ద ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement