Pre-2005 notes
-
ఆ నోట్లు ఇక చెల్లవు
ముంబై : పాత కరెన్సీ నోట్లను మార్చుకునే గడువు నేటితో ముగిసింది. ఇవాళ్టి నుంచి(శుక్రవారం) నుంచి 2005 ముందు ముద్రించిన నోట్లను మార్చుకునే అవకాశం లేదని ఆర్ బీఐ ప్రకటించింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్ బీఐ గతంలోనే తెలిపింది. ఆ నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి అంతే విలువ చేసే కొత్త నోట్లను పొందేందుకు గతేడాది చివరి వరకున్న గడువును మరో ఆరు నెలలు (జూన్ 30 వరకు) పొడిగించిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ప్రీ-2005 నోట్లను ఉపసంహరించుకునే ప్రక్రియను ఆర్ బీఐ చేపట్టింది. చాలా శాతం వరకూ ఈ నోట్లను వెనక్కి తీసుకున్నామని, ఇంకా కొంత శాతం మాత్రమే చెలామణిలో ఉందని ఆర్ బీఐ గురువారం పేర్కొంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా ప్రీ-2005 నోట్లను మార్చుకోవాలంటే ఆర్ బీఐకు సంబంధించిన 20 ఆఫీసులను ఆశ్రయించాల్సి ఉందని తెలిపింది. ఆర్ బీఐ ఆఫీసులు.. అహ్మదాబాద్, బెంగళూరు, బెల్లాపూర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీఘర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల్లోనే ఇక ఇప్పటినుంచి 2005 ముందటి నోట్లను మార్చుకునే అవకాశముంటుందని ఆర్ బీఐ ఓ ప్రకటన వెల్లడించింది. ఈ ప్రక్రియతో నేటి నుంచి 2005కు ముందటి నోట్లు మార్కెట్లో చెల్లుబాటు కావు. ఈ నోట్లను గుర్తించడం చాలా సులువు. 2005కు తర్వాత ప్రింట్ చేసిన కరెన్సీకి వెనుకవైపు కింది భాగంలో ముద్రించిన ఏడాది వివరాలు ఉంటాయి. అదే 2005కు ముందు నోట్లలో ఈ వివరాలుండవు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, నకిలీ నోట్లను ఏరివేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 2005కు తర్వాత ముద్రించిన కరెన్సీతో పోలిస్తే పాత నోట్లలో భద్రత ఫీచర్లు తక్కువని పేర్కొంది. -
ఆ నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు
న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల మార్పిడిపై ఎలాంటి అనుమానాలకూ తావులేకుండా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మరోసారి బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. 2005కు ముందునాటి రూ. 500, 1000 సహా అన్ని కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది జనవరి 1 వరకూ ఏ బ్యాంకు బ్రాంచీల్లోనైనా మార్పిడి చేసుకోవచ్చని, ఇందుకు ప్రజలను సహకరించాల్సిందిగా బ్యాంకులకు సూచించింది. మార్పిడి విషయంలో నోట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితీ లేదని, ఎన్ని నోట్లనైనా మార్చుకోవచ్చని పేర్కొంది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో కూడిన కరెన్సీ నోట్లను చలామణీలో ఉంచేందుకు వీలుగా 2005కు ముందు నోట్లను ఉపసంహరించాలని ఆర్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ మార్పిడికి ఈ ఏడాది జూన్ 30 వరకూ గడువు ఇవ్వగా.. దీన్ని తర్వాత 2015, జనవరి 1వరకూ పొడిగించింది. కాగా, ఈ తేదీ తర్వాత మాత్రం పదికి మించి రూ.500/1,000 నోట్లను మార్చుకోవాలంటే ప్రజలు తమ గుర్తింపు(ఐడెంటిటీ)ను సమర్పిం చాల్సి ఉంటుంది. అయితే, ఈ మార్గదర్శకాలపై ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించేందుకు ఆర్బీఐ తాజాగా కొన్ని వివరణలను ఇచ్చింది. దీనిలో భాగంగానే తమ బ్యాంక్ కస్టమర్ అయినా, కాకపోయినా ప్రజలందరి నుంచీ బ్యాంకులన్నీ నోట్ల మార్పిడికి వీలుకల్పించాలని పేర్కొంది. అంతేకాకుండా క్యాష్ కౌంటర్లు లేదా ఏటీఎంలలో కూడా 2005కు ముందునాటి నోట్లు జారీకాకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆర్బీఐ బ్యాంకులకు నిర్దేశించింది. బ్యాంకుల వద్దనున్న ఈ 2005కు ముందు నోట్లను తమకు పంపించేయాలని సూచించింది. మరో ముఖ్యవిషయం... ప్రజలు ఈ నోట్లను అన్నిరకాల లావాదేవీలకూ ఉపయోగించుకోవచ్చని, చట్టబద్ధంగా వీటి చెల్లుబాటు కొనసాగుతుందని కూడా ఆర్బీఐ తేల్చిచెప్పింది. నోట్ల మార్పిడి ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొంది. 2005 ముందునాటి నోట్లను సులువుగా గుర్తించవచ్చు. ఈ నోట్ల వెనుకవైపు కింది బాగంలో ఎలాంటి ముద్రణ సంవత్సరం ఉండదు. 2005 తర్వాత నోట్లపై మాత్రం అది ముద్రించిన సంవత్సరం ఉంటుంది. ప్రధానంగా నకిలీ కరెన్సీకి అడ్డుకట్టవేయడం కోసం అదనపు భద్రతా ప్రమాణాలను వీటికి జతచేశారు. -
మార్చి 31 తర్వాత ఆ నోట్లు చెల్లువు