pregnant dies
-
మరో దారుణం: నిండు గర్భిణి బలి
సాక్షి,న్యూఢిల్లీ: నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరి కొద్ది రోజుల్లో పండంటి పాపాయిని ఎత్తుకోవాల్సిన ఓనిండు గర్భిణి (28)తీరని లోకాలకు తరలిపోయింది. కార్ పార్కింగ్ సందర్భంగా అదుపు తప్పిన కారు దంపతులమీదికి దూసుకు వచ్చింది. దీంతో ఎనిమిదినెలల గర్భవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా , ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని సెక్టార్ 18లో ఈ దారుణం చోటు చేసుకుంది. నోయిడా పోలీస్ సర్కిల్ ఆఫీసర్ శ్వేతాంబర్ పాండే అందించిన సమాచారం ప్రకారం ఓ మైనర్ పార్కింగ్ అటెండెంట్ నిర్వాకానికి నిండు గర్భిణీ అర్థాంతరంగా అసువులు పాసింది. నోయిడాలో నివసిస్తున్న బాధిత భారాభర్తలు మార్కెట్‌కు వచ్చారు. అక్కడ పార్కింగ్ డ్యూటీలో ఉన్న మైనర్ బాలుడు(14) హోండా కారును పార్కింగ్ నుంచి బయటకు తీస్తూ.. రివర్స్ చేసే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోయాడు. దీంతో హోండా సిటీ కారు దంపతుల బైక్‌ను ఢీకొట్టి అనంతరం మరో రెండు కార్లపై దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన సమీపంలోని కైలాష్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. పార్కింగ్ అటెండెంట్‌ను అదుపులోకి తీసుకున్నామని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి వెల్లడించారు. -
రాయలచెరువులో గర్భిణి మృతి
యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మంజుల (60) అనే తొమ్మిది నెలల గర్భిణికి మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మంజులకు వెక్కిళ్లు ఎక్కువగా రావడంతో శ్వాస తీసువడానికి ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. -
ఏడు నెలల గర్భిణి మృతి
అనంతపురం సిటీ : ఏడు నెలల గర్భంతో చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రిలో చేరిన ఓ మహిళ మృతి చెందింది. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి నుంచి చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని, చికిత్స ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారన్నారు. ఈవిషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం.. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చి పరిస్థితి విషమించి మృతి చెందిన గర్భిణి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. రెడ్డిపల్లికి చెందిన మహిళగా తెలిసిందన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, ఇతర విషయాలపై విచారణ జరుపుతామన్నారు. స్థానికంగా ఆమె ఏఎన్ఎంల సలహాలు తీసుకొంటోందా? లేదా? .. క్రమం తప్పకుండా వైద్యుల ఆరోగ్య సలహాలు, సూచనలు పాటిస్తోందా? లేదా అన్న విషయంపై శనివారం విచారణ జరుపుతామన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
కాన్పుకొచ్చి .. కానరాని లోకాలకు..
• సిజేరియన్ అనంతరం పరిస్థితి విషమం • చికిత్స పొందుతూ బాలింత మృతి అనంతపురం సిటీ : కాన్పు కోసం వచ్చిన ఓ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చి కానరానికి లోకాలకు వెళ్లింది. భూమ్మీద అడుగు పెట్టిన కొద్ది గంటల్లోనే తల్లిని కోల్పోయిన ఆ శిశువును చూసి ప్రతి ఒక్కరూ అయ్యో..పాపం అంటూ సానుభూతి తెలిపారు. ఈ సంఘటన అనంతపురం సర్వజనాస్పత్రిలో జరిగింది. ఎలా జరిగిందంటే... గుత్తి మండలం బేతపల్లికి చెందిన మాధవి(21) వివాహం పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన రామాంజినేయులుతో జరిగింది. మొదటి కాన్పులో మగ బిడ్డకు మాధవి జన్మనిచ్చింది. రెండో కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల 14(ఆదివారం)న ఉదయం చేర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు సిజెరీయన్ చేసి ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. అదే రాత్రి 9 గంటలకు మాధవికి మూర్ఛ లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. వెనువెంటనే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. రాత్రంతా మూర్చ రావడంతో కుట్లు తెగిపోయాయని వైద్యులు తమకు చెప్పినట్లు మాధవి బంధువులు అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మాధవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా మృతికి దారి తీసిన కారణాలపై కుటుంబ సభ్యులకు సరైన సమాచారం లేదు. కాన్పు వరకు బాగున్న మాధవి రాత్రికి రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. శిశువును తీసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు అనంతపురం రూరల్ పరిధిలోని చంద్రబాబు కొట్టాలకు చెందిన ఓ మహిళ కాన్పు అనంతరం మృతి చెందింది. ఈ విషయంలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ నేతలు ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా గడవకనే మరో తల్లి చికిత్స పొందుతూ మృతి చెందడం వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడ వైద్య సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, అయినా ఉన్నతాధికారులు పట్టించకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.