అనంతపురం సిటీ : ఏడు నెలల గర్భంతో చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రిలో చేరిన ఓ మహిళ మృతి చెందింది. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి నుంచి చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని, చికిత్స ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారన్నారు. ఈవిషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తాం..
ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చి పరిస్థితి విషమించి మృతి చెందిన గర్భిణి జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. రెడ్డిపల్లికి చెందిన మహిళగా తెలిసిందన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, ఇతర విషయాలపై విచారణ జరుపుతామన్నారు. స్థానికంగా ఆమె ఏఎన్‌ఎంల సలహాలు తీసుకొంటోందా? లేదా? .. క్రమం తప్పకుండా వైద్యుల ఆరోగ్య సలహాలు, సూచనలు పాటిస్తోందా? లేదా అన్న విషయంపై శనివారం విచారణ జరుపుతామన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఏడు నెలల గర్భిణి మృతి
Published Sat, Aug 20 2016 1:27 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement