breaking news
presbyopia
-
కళ్లజోడుకు గుడ్‌బై?: సర్జరీ లేకుండా.. రెండేళ్లు!
వయసు పెరిగే కొద్దీ.. దాదాపు అందరికీ ప్రెస్బయోపియా (కంటిచూపు లోపం) వస్తుంది. అప్పుడు చదవడం లేదా ఫోన్‌ను ఉపయోగించడం వంటి క్లోజప్ విషయాలపై దృష్టి పెట్టడం కొంత కష్టతరమవుతుంది. దీనికోసం రీడింగ్ గ్లాసెస్‌పై ఆధారపడతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పరిశోధకులు ప్రత్యేక కంటి చుక్కలను తయారు చేశారు. ఇది కొంతకాలం పాటు గ్లాసెస్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిరెండు సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనంలో.. కంటి చుక్కలను తయారు చేశారు. వీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల, కళ్లజోడుతో పనిలేకుండానే చిన్న అక్షరాలను చదివే సామర్థ్యం మెరుగుపడిందని తేలింది. అధ్యయనంలో.. చాలా మంది వ్యక్తులు చుక్కలను ఉపయోగించిన తర్వాత ప్రామాణిక కంటి చార్టులో (జేగర్ చార్ట్) రెండు లేదా అంతకంటే ఎక్కువ అదనపు పంక్తులను చదవగలిగారు. ఈ చుక్కలను ఉపయోగించడం వల్ల.. రెండేళ్ల పాటు మెరుగైన దృష్టిని పొందవచ్చని చెబుతున్నారు.ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు యూరోపియన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్స్ (ESCRS)లో ప్రచురించారు. కంటి చూపు పెరగడానికి ఉపయోగించే.. చుక్కల మందులో పైలోకార్పైన్ (కన్ను దగ్గరగా ఉన్న వస్తువులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది), డైక్లోఫెనాక్ (కొంతమందికి కలిగే చికాకును నివారించడంలో సహాయపడుతుంది) ఉపయోగించినట్లు వెల్లడించారు.రోజుకు రెండుసార్లుసాధారణంగా ప్రజలు.. రోజుకు రెండుసార్లు చుక్కలను ఉపయోగిస్తారు. అవసరమైతే మూడవ మోతాదును కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రెస్బయోపియా (Presbyopia) ప్రభావాన్ని బట్టి.. రోజుకు ఎన్నిసార్లు ఉపయోగించాలనేది నిర్దారించడం జరుగుతుంది. ప్రెస్బయోపియా తీవ్రత తక్కువగా ఉంటే తక్కువసార్లు, ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ కోసం ఎక్కువసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికకంటి చూపు మందగించడం వల్ల.. కొంతమంది ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ వద్దనుకుని, సరళమైన పద్దతిలో సమస్య పరిష్కరించుకోవడానికి ఈ చుక్కల మందు ఉపయోగపడుతుంది. అయితే ప్రెస్బయోపియా ప్రభావం తగ్గించడానికి ఉపయోగించే చుక్కల మందు వల్ల.. స్వల్ప చికాకు లేదా తేలికపాటి తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలను నిర్మూలించడానికి మరింత అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు. -
చేప కన్నుతో చికిత్స!
-
చేప కన్నుతో చికిత్స!
వాషింగ్టన్: రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయిన వారు తిరిగి చూడగలిగేలా చేయగలమని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. జీబ్రా ఫిష్ మెదడులోని రసాయనిక చర్యల కారణంగా అది తన రెటీనాను కేవలం 28 రోజుల్లో పునరుత్పత్తి చేసుకోగలదని వండర్బిల్ట్ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. చేపలోని న్యూరోట్రాన్స్మీటర్ ‘గాబా’ వల్ల ఇది సాధ్యమవుతుందని వారు తేల్చారు. చేపతో పాటు క్షీరదాల్లో రెటీనాను పునరుత్పత్తి చేయగల శక్తి గాబాకు ఉందని, దీనివల్ల దెబ్బతిన్న రెటీనాను కన్ను తనంతట తానుగా పునరుత్పత్తి చేసుకునే అవకాశం ఉందని ప్రొఫెసర్ జేమ్స్ ప్యాటన్ తెలిపారు. రెటీనాకు గాయమైనప్పుడు అందులోని ముల్లర్గ్లియా అనే మూలకణాలు పూర్తిగా వ్యాప్తి చెంది దెబ్బతిన్న నాడీకణాలను పునరుద్ధరిస్తాయి. ఈ మూలకణాలు క్షీరదాల్లోనూ ఉన్నప్పటికీ వాటికి పునరుత్పత్తి శక్తి ఉండదని జేమ్స్ తెలిపారు. ఈ పరిశోధనా వివరాలు ‘స్టెమ్ సెల్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.