presents
-
జీఆర్టీ జ్యువెలర్స్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్
హైదరాబాద్: వివాహ వేడుకల కోసం జీఆర్టీ జ్యువెలర్స్ సాటిలేని హస్తకళతో ఆభరణాల డిజైన్లను విడుదల చేసింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం, వెండి, విలువైన రత్నాలతో రూపొందిచిన ఉంగరాలు, గాజులు, చెవిదిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు, వంకీలు వంటివి ఈ విస్తృత శ్రేణి కలక్షన్లో ఉన్నాయి. సంప్రదాయ ఆభరణాలకు బంగారు స్పర్శ, ట్రెండ్ జోడించిన ఈ ప్రత్యేక డిజైన్లు వివాహ వేడుకలను మరుపురాని క్షణాలుగా చిరస్మరణీయం చేస్తాయని కంపెనీ ఎండీ జీఆర్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
చిరంజీవి సమర్పణలో హిందీ చిత్రం.. తెలుగులో..
పాత్రకు తగిన ఆహార్యం, నటనతో మెప్పిస్తాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. 57 ఏళ్ల వయసులో ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'లాల్‌సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు ఈ మూవీ హిందీలో మాత్రమే వస్తున్నట్లు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా రాబోతుంది. ఈ తెలుగు వెర్షన్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయనున్నారు. చిరంజీవి సమర్పణలో 'లాల్ సింగ్ చద్దా' తెలుగులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా చిరంజీవి తెలిపుతూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్‌తో కలిసి తన నివాసంలో చిరంజీవి స్పెషల్‌గా వీక్షించిన విషయం తెలిసిందే. ఈ సినిమా చిరుకి నచ్చి తెలుగులో విడుదల చేస్తానని అమీర్ ఖాన్ కోరారు. అందుకు అమీర్ ఖాన్ కూడా అంగీకారం తెలపడంతో తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు చిరు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. నా ప్రియమిత్రుడు అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెలుగు వెర్షన్లో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది' అని చిరంజీవి ట్వీట్ చేశారు. చదవండి: చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో Feel very privileged to present the Telugu version of my dear friend #AamirKhan ‘s wonderful emotional roller coaster #LaalSinghChaddha Our Telugu audiences are surely going to love him ! pic.twitter.com/Tb2apAaJrz — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 Fascinating how a chance meeting & a little chat with my dear friend #AamirKhan @Kyoto airport - Japan, few years ago led to me becoming a part of his dream project #LaalSinghChaddha Thank You #AamirKhan for the exclusive preview at my home.Heartened by your warm warm gesture! pic.twitter.com/hQYVZ1UQ5m — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2022 -
కొత్త పాత్రలో పీవీ సింధు
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్, భారత ప్లేయర్ పీవీ సింధు కొత్త పాత్రలో అలరించనుంది. ప్రముఖ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ నిర్మిస్తోన్న క్రీడలకు సంబంధించిన ‘ది ఎ–గేమ్’ వెబ్ సిరీస్‌కు సింధు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. మేటి విజయాలతో భారత్‌కు పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టిన క్రీడాకారులు తమ అనుభవాలను ఈ కార్యక్రమంలో పంచుకోనున్నారు. ఐదు ఎపిసోడ్ల పాటు సాగే ఈ కార్యక్రమంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, రెజ్లర్ సాక్షి మలిక్... షూటర్ గగన్ నారంగ్... లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్... ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా... స్నూకర్–బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీలతో సింధు ముచ్చటించనుంది. దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఒత్తిడి సమయంలో దిగ్గజ అథ్లెట్ల ఆలోచనా విధానాన్ని వారి శక్తి సామర్థ్యాల్ని ఈ షో ద్వారా తెలుసుకోవచ్చు’ అని వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల్లో ప్రసారం కానుంది. బేస్‌లైన్ వెంచర్స్ ఇప్పటికే ‘డబుల్ ట్రబుల్’, ‘ఫినిష్ లైన్’ పేరిట నిర్మించిన రెండు వెబ్ సిరీస్‌లు విజయవంతమయ్యాయి. -
బడ్జెట్ తెలుగులోనే ప్రవేశ పెట్టాలి
-
రతన్ టాటాకు ఐసీఎఫ్ఏ అవార్డు
ముంబై: టాటా గ్రూపు అధినేత రతన్ టాటాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) 'గ్లోబల్ వ్యవసాయ లీడర్షిప్ అవార్డు 2016 " అవార్డు వరించింది. సెప్టెంబరు 18 న న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల వేడుకకు రతన్ టాటా హాజరు కాలేదు. దీంతో ముంబైలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును టాటా సన్స్ తాత్కాలిక ఛైర్మన్ కు ప్రదానం చేశారు. హరిత విప్లవం మార్గదర్శకుడు ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటైన "లీడర్షిప్ అవార్డులు జ్యూరీ, భారత దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ అభివృద్ధికి ఐదు దశాబ్దాలకు పైగా అందించిన రతన్ టాటా సేవలకుగాను లైఫ్ టైం ఎఛీవ్మెంట్ అవార్డు 2016 కు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆయన కృషి దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు జీవితాలపై ఆయన సానుకూల ప్రభావాన్ని చూపించిందని ఐసీఎఫ్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. -
ధర్మాసనం ముందు ప్రత్యూష ఏం మాట్లాడింది?
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేష్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయిన ప్రత్యూషను తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే తన ఛాంబర్లో మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి ప్రత్యూషతో మాట్లాడింది. ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ధర్మాసనం తమ ఛాంబర్లో రహస్య విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్‌ను మాత్రమే విచారణకు అనుమతించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సవతి తల్లి, తండ్రి చేతుల్లో తను ఏ విధంగా చిత్రహింసలకు గురైందీ ఆమె కోర్టుకు వివరించింది. సవతి తల్లి, తండ్రికి శిక్ష పడాలని కోరుకుంటున్నానని ఆమె గట్టిగా చెప్పింది. ఈ విషయాన్ని న్యాయస్థానాలు చూసుకుంటాయని, చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ధర్మాసనం ఆమెకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తదుపరి ఏం చేయాలన్న విషయంపై కూడా ధర్మాసనం ఆరా తీసింది. నర్సింగ్ కోర్స్ పూర్తి సేవ చేస్తానని ప్రత్యూష చెప్పింది. భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆందోళన చెందొద్దని, ముందు ఇంటర్ పూర్తి చేసి, ఆ తరువాత ఇష్టమైన నర్సింగ్ కోర్సును పూర్తి చేసి జీవితంలో స్థిరపడాలని ధర్మాసనం ఆకాంక్షించింది. ప్రత్యూషను హింసించిన వ్యవహారంలో ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె తండ్రి రమేష్‌కు వస్తున్న జీతం నుంచి కొంత మొత్తాన్ని ప్రత్యూషకు అందేలా చూడాలని స్పెషల్ జీపీ శరత్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఆమె పేరుపై ఉన్న డబుల్ బెడ్రూం ద్వారా వచ్చే అద్దె మొత్తాన్ని కూడా ఆమెకు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో ఆమె పేరు మీద ఓ బ్యాంకు ఖాతాను తెరచి, ఆ మొత్తాలు అందులో జమయ్యేలా చూడాలంది. సీఎం కేసీఆర్ కు అభినందన ప్రత్యూష విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించిన తీరును ధర్మాసనం అభినందించింది. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండి కూడా కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లి మరీ ప్రత్యూషను పరామర్శించి, భవిష్యత్తు గురించి ఆమెకు భరోసా ఇచ్చిన తీరును ఎంతో గొప్పగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇలా చేయడం ద్వారా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటున్న యువతులకే కాక మొత్తం ప్రజలకు సమస్య వస్తే తాను ఉన్నానన్న సందేశాన్ని ఇచ్చినట్లయిందని వ్యాఖ్యానించింది. ఈ ఘటన ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంచి మానవతావాదన్న విషయం రుజువైందని కూడా ధర్మాసనం చెప్పినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళతారని తాము అసలు ఊహించలేదంది. ఏదేమైనా అంతిమంగా ప్రత్యూషకు మంచి జరగాలనే అందరూ ఆశించారని, అదే ఇప్పుడు జరుగుతోన్నందుకు తమకు ఆనందంగా ఉందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. -
డిప్ ద్వారా రోజుకో లక్షాధికారి ఎంపిక