డీమోనిటైజేషన్‌పై ఆడియో క్లిప్ నకిలీది: ఐసీఏఐ
హైదరాబాద్: డీమోనిటైజేషన్, పన్ను సంస్కరణలు తదితర అంశాలపై వ్యాఖ్యలతో సంస్థ ప్రెసిడెంట్ ఎం దేవరాజ రెడ్డి పేరిట వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఆడియో క్లిప్‌పై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) వివరణ ఇచ్చింది.
ఇది నకిలి క్లిప్పింగ్ అని తెలియజేసింది. దీని గురించి ఇప్పటికే (డిసెంబర్ 9న) ఐసీఏఐ వెబ్సైట్లో కూడా వివరణ పొందుపర్చినట్లు ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ పురోభివృద్ధికి తీసుకునే చర్యలు, ఆర్థిక సంస్కరణలకు తమ పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది.