President polls
-
President Election 2022: ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి,న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మోదీతోపాటు ముర్ము నివాసానికి వెళ్లారు. కాసేపు ఆమెతో ముచ్చటించారు. Delhi | Prime Minister Narendra Modi greets and congratulates #DroupadiMurmu on being elected as the new President of the country. BJP national president JP Nadda is also present. Visuals from her residence. pic.twitter.com/5wrcpCXElC — ANI (@ANI) July 21, 2022 మోదీ, నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీల రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా ముర్ముకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయిన యశ్వంత్ సిన్హా కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచి ఆ బాధ్యతలు చేపడుతున్న తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించారు ద్రౌపది ముర్ము. ఎన్డీఏ బలపరిచిన ఈమెకు బీజేడీ, వైఎస్ఆర్సీపీ, జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఆమె ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ముర్ము విజయంతో ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. చదవండి: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము -
రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు పంచారు: యశ్వంత్ సిన్హా
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తన పోటీని.. ఒక పోరాటంగా అభివర్ణించుకున్నారు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను కేవలం రాజకీయ పోరాటం మాత్రమే చేయడం లేదు.. ప్రభుత్వ సంస్థలపై కూడా చేస్తున్నాను. వాళ్లు(అవతలి పక్షాలను ఉద్దేశించి..) చాలా శక్తివంతంగా మారారు. తమకే ఓట్లు వేయాలని ఒత్తిడి తెస్తూ పార్టీలను చీల్చారు. ఒకానొక దశలో డబ్బుతో ప్రలోభ పెట్టారు కూడా. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. దేశ ప్రజాస్వామ్యానికి మార్గాన్ని నిర్దేశిస్తాయి, అది నిలుస్తుందా లేదంటే ముగుస్తుందా అనేది చూడాలి. ఓటర్లందరూ తమ ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రహస్య బ్యాలెట్ ఓటింగ్. వారు తమ విచక్షణను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నన్ను ఎన్నుకుంటారని ఆశిస్తున్నా అని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. I am not just fighting a political fight but a fight against govt agencies too. They have become too powerful. They are breaking up parties, forcing people to vote for them. There is also a game of money involved: Opposition Presidential candidate Yashwant Sinha pic.twitter.com/l5BydMLWAD — ANI (@ANI) July 18, 2022 -
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. మోదీతో క్లోజ్‌గా సీఎం.. షాక్‌లో కాంగ్రెస్!
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అని సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించడంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షం కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా జేఎంఎం వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆ సమయంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రం మద్దతు ఉంటే ఐదేళ్లతో జార్ఖండ్ పురోగతి సాధిస్తుంది. ఇది జార్ఖండ్ చరిత్రలో చారిత్రక రోజు. కేంద్రం, రాష్ట్రం మధ్య సహకారం ఉంటే అభివృద్ధి వేగంగా జరగడం సాధ్యమవుతుంది.' అని మోదీ వేదికపై ఉన్నప్పుడు సోరెన్ అన్నారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్‌ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్‌లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు. ముర్ముకు ఘన స్వాగతం రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 4న జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా జులై 16న జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఆ రోజు జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. జార్ఖండ్‌లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది. 2019లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 26 స్థానాలు కైవసం చేసుకుంది. మరో ఐదు చోట్ల ఇతరులు గెలుపొందారు. చదవండి: జాతీయ పార్టీలపై కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విరాళాలు -
రాష్ట్రాలకు చేరిన.. మిస్టర్ బ్యాలెట్ బాక్స్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించనున్న బ్యాలెట్ బాక్సులు విమానాల్లో రాష్ట్రాలకు చేరుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలకు చెందిన అధికారులతోపాటు విమానాల్లో వారి పక్క సీట్లను బ్యాలెట్ బాక్స్‌ల కోసం కేటాయించారు. ఈ మేరకు బాక్సుల కోసం ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం విమాన టికెట్లు కొనుగోలు చేసింది. మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకొనేలా చర్యలు తీసుకుంది. ఆయా వివరాలను మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘మంగళవారం 14 ప్రాంతాలకు బుధవారం 16 ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులు విమానాల్లో చేరుకుంటాయి. రాష్ట్రాల నుంచి వచ్చి అధికారుల తిరిగి అదే రోజు ఢిల్లీకి బ్యాలెట్ బాక్సులను వెంట తీసుకొస్తారు. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరింత పటిష్టత, పారదర్శకత కనబరచాలని రాష్ట్రాల రిటర్నింగ్ అధికారులకు సూచించాం. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సహా ఎన్నికల సామగ్రి రవాణా, నిల్వల సంబంధ ప్రోటోకాల్ మార్గదర్శకాలను రిటర్నింగ్ అధికారులు ఖచ్చితంగా పాటించాలి’ అని రాజీవ్ చెప్పారు. బ్యాలెట్ బాక్సులు రాష్ట్రాలకు చేరిన తర్వాత శానిటైజ్ చేసి సీలు వేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తదుపరి విమానంలో రాష్ట్రాల అధికారులు బ్యాలెట్ బాక్సులను విమానాల్లో ఢిల్లీకి తీసుకురానున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా బాక్స్‌లను హిమాచల్ ప్రదేశ్‌కు రోడ్డు మార్గంలో పంపిస్తారు. చదవండి: ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు -
విపక్షాలకు దెబ్బ మీద దెబ్బ.. గోపాలకృష్ణ గాంధీ కూడా నో
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. ఎవరిని సంప్రదించినా మాకొద్దు బాబోయ్ అంటూ సైలెంట్‌గా సైడ్ అవుతున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రతిపక్ష నేతల అభ్యర్థనను మహత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షాల తరుపున పోటీ చేయనని చెప్పినవారి జాబితాలో గాంధీ వరసగా మూడో వ్యక్తి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవర్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా పోటీకి దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు గాంధీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది ప్రతిపక్ష నాయకులు నన్ను అడిగారు. దీనిని నేను గౌరవంగా భావిస్తున్నాను. వారి అందరి ఆలోచనలకు నేను కృతజ్ఞుడను. కానీ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించిన తరువాత ప్రతిపక్షాల అభ్యర్థి.. జాతీయ ఏకాభిప్రాయాన్ని, ప్రతిపక్షాల ఐక్యతను సాధించే వ్యక్తి అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇందుకు నాకంటే మెరుగైన వారు ఉన్నారని భావిస్తున్నాను. కాబట్టి అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలని నాయకులను అభ్యర్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా నో చెప్పడంతో ఎవరినీ బరిలోకి దింపాలా? అని విపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఈ నెల 21న విపక్ష పార్టీలు మరోసారి సమావేశం కానున్నాయి. ఈ భేటీలో రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్ధి ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చదవండి: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత.. -
బీజేపీకి షాకిచ్చిన శివసేన
న్యూఢిల్లీ: ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడల్లా పేచీలు పెడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బాహాటంగా విమర్శించే శివసేన మరోసారి బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రపతి పదవికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును శివసేన ప్రతిపాదించింది. అంతేగాక బీజేపీ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరింది. అన్ని అర్హతలు ఉన్న బలమైన అభ్యర్థి రాష్ట్రపతి కావాలని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. ఇటీవల ఎన్డీయే నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన విందులో పాల్గొన్న శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇంతలోనే ఆ పార్టీ మాట మార్చి శరద్ పవార్ పేరును తెరపైకి తీసుకురావడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన గతంలోనూ బీజేపీని వ్యతిరేకించింది. గత రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థికి శివసేన మద్దతు పలికింది. ఇటీవల బీజేపీ, శివసేనల మధ్య అంతగా సత్బంధాలు లేవు. మహారాష్ట్రలో ఈ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఒకేతాటిపైకి రావాలన్న ప్రతిపాదనలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నాయి. పవార్ అభ్యర్థిత్వం పట్ల కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, జేడీ(యూ) సుముఖంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన శివసేన కొత్త ప్రతిపాదన తీసుకురావడం బీజేపీకి ఇబ్బందికర పరిణామం. ఉద్దవ్ ఠాక్రే, పవార్ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. కాగా శివసేన ప్రతిపాదనపై ఎన్సీపీ ఇంకా స్పందించలేదు. శివసేన ఇంతకుముందు రాష్ట్రపతి పదవికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరును ప్రతిపాదించింది. అయితే ఈ పదవికి తాను రేసులో లేనని భగవత్ ప్రకటించారు. శివసేన వైఖరితో విసిగిన బీజేపీ మహారాష్ట్రలో శరద్ పవార్‌కు దగ్గర కావాలని భావిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పవార్‌ను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవికి శివసేన పవార్ పేరు ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే జూలైలో ముగియనుంది.