president Pratani Ramakrishna Goud
-
చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది
‘‘రాజకీయాలా? సినిమాలా? అనే సందర్భంలో నేను సినిమానే ఎంచుకున్నాను. సినిమాపై నాకున్న ప్రేమ అలాంటిది. చిత్ర పరిశ్రమలో కొందరి ఆధిపత్యం సాగుతోంది. చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది’’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన ప్రతాని రామకృష్ణ గౌడ్‌ని ఆగ్రోస్ చైర్మన్ లింగపల్లి కిషన్ రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి చేతులమీ దుగా సన్మానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘టాలీవుడ్లో వెయ్యికిపైగా చిత్రాలు విడుదలకు నోచుకోకుండా ఉన్నాయి. సినిమాల విడుదల సమయంలో చిన్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో ఒక యాప్‌ను విడుదల చేయబోతున్నాం. దీని ద్వారా సినిమాలు ప్రద ర్శించి నిర్మాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తాం. ఇకపై విడులకు నోచుకోని సినిమా అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండకూడదు. భవిష్యత్తులో సినిమాల విడుదలకు థియేటర్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు వస్తాయి. ఇకపై మరింత ఉత్సాహంతో పరిశ్రమకు సేవ చేస్తా’’ అన్నారు. -
‘తెలంగాణ’లో షూటింగులకు వెసులుబాటు
‘‘అవుడ్డోర్ షూటింగుల కోసం పోలీసుల నుంచి అనుమతులు తీసుకునే విషయంలో కొన్నేళ్లుగా నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మకు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అవసరమైతేనే పోలీసుల అనుమతిని తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలుగు సినీ నిర్మాతలందరికీ శుభవార్తే’’ అని తెలంగాణ ఫిల్మ్ అండ్ టి.వి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణగౌడ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘సాధారణంగా సినిమాల షూటింగులు ఎఫ్డీసీ అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతుంటాయి. ఆ అనుమతినే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వర్తింపజేయాలని కోరాం. దానికీ ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ అందరికీ ఆదేశాలు జారీ చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎం.శ్రీనివాస్, రేష్మీ పాల్గొన్నారు.