మా మద్దతు టీఆర్ఎస్కే..
అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి
ఆర్మూర్, ఈ ఎన్నికలలో తమ మద్దతు టీఆర్ఎస్కే ఉంటుందని అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి అన్నారు. ఈ నెల 16న మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రారంభమైన అమరవీరుల ఆశయసాధన బస్సుయాత్ర శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చేరుకోగా, టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్‌రెడ్డి స్వాగతం పలికారు. రఘుమారెడ్డితోపాటు తెలంగాణ అమరుల కుటుంబాల సంరక్షణ స్మారక సేవా సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, 70 కుటుంబాల సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లోక బీజేపి టీడీపీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.