మోదీ అధ్యక్ష తరహా పాలన చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నీ తానై అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ
బహిషృత నేత అరుణ్ శౌరీ ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నగదు లేకున్నా చెక్కు జారీ చేసే విధానాలను అవలంభింస్తుందని ఎద్దేవా చేశారు.
మోదీ నాయకత్వంలో రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం ఎలా ఉండబోతోంది అన్నప్రశ్నకు సమాధానంగా శౌరీ స్పందిస్తూ... పకడ్బందీగా పౌరులపై దాడులు చేయడానికి, పరిపాలనను వికేంద్రీకరించి భయపెట్టడానికి,అసమ్మతి వర్గాల గొంతులు నులిమేయనున్నారని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మోదీని నియంతృత్వంలోఇందిరాగాంధీ, జయలలితలతో పోల్చారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం
లేదని వారిని 'టిష్యు పేరర్' లాగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పశ్చాత్తాపం చెందే రోజు ఎంతో దూరంలో
లేదన్నారు.