Presiding officers
-
ఒకే దేశం ఒకే వేదిక
ముంబై/న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల ప్రొసీడింగ్స్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతు న్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ముంబైలో శనివారం 84వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభల కార్యకలాపాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం త్వరలో సఫలమవనుంది. వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ ప్లాట్‌ఫామ్‌కు ఇది బాటలు వేస్తోంది’’ అని చెప్పారు. శాసనసభ్యుల ప్రవర్తన బట్టే ఆ శాసనసభ ప్రతిష్ట ఇనుమడిస్తుందని మోదీ అన్నారు. ‘‘గతంలో సభాహక్కులను ఉల్లంఘించే సభ్యులను సీనియర్ సభ్యులు మందలించేవారు. ఇప్పుడా పరిస్థితే లేదు. తమ సభ్యులు ఎంతటి ఉల్లంఘనలకు పాల్పడినా పార్టీలు వెనకేసుకొస్తున్నాయి. ఈ సంస్కృతి మంచిది కాదు’’ అన్నారు. ‘‘ గతంలో సభ్యునిపై అవినీతి ఆరోపణలు వస్తే సమా జంలో ఆ సభ్యుడు బహిష్కరణకు గురైనట్లే. ఆ సంస్కృతిని ఇప్పుడు గాలికొదిలేశారు. అవినీతి సభ్యులకు పాపులారిటీ పెరుగుతోంది’’ అన్నారు. యువత చేతుల్లోనే అభివృద్ధి చెందిన భారత్ రూపుదిద్దుకోనుందని మోదీ అన్నారు. శనివారం ఢిల్లీలో ఎన్సీసీ–పీఎం ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘అమ్మాయిలను సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేసేవారు. వారికి అన్ని మేం రంగాల్లో ద్వారాలు తెరవడంతో తమదైన ముద్ర వేస్తున్నారు. గణతంత్ర వేడుకల్లో నారీశక్తి ప్రస్ఫుటంగా కనిపించింది’’ అన్నారు. -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
సభాపతులు అమ్ముడుపోయారు!
శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌పై ఉందని, కానీ సభాపతులు అమ్ముడుపోయారని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ... ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకు న్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నా రని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు. ఏపీలో ఉండే చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్ అధికారులు వినీవిననట్లు ఉంటున్నారని, ఇది తప్పని ప్రతిపక్ష నాయకునిగా తాను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్టెన్షన్లు వస్తాయని దిగజారుడుతనంతో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలను ఎన్నికల కమిషన్ కాని, పార్లమెంటరీ కమిటీ కాని రివ్యూ చేసే అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్ స్పీకర్‌కు, రాష్ట్రపతికి లేఖ రాస్తున్నామన్నారు. -
ఓటర్లకు అన్ని వసతులు
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 7802 పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు కనీస మౌలికసదుపాయాల కోసం ప్రత్యేకచర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, టెంట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, టాయ్లెట్లు తదితర సదుపాయాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికి దాదాపు 2వేల పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, మిగతా కేంద్రాల్లోనూ మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. 27న బ్యాలెట్ పేపర్ల తనిఖీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితాతో కూడిన బ్యాలెట్‌పత్రాల ముద్రణ పూర్తయిందని కమిషనర్ తెలిపారు. ఈనెల 27న వాటిని తనిఖీ చేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు/ వారు ప్రతిపాదించే ఏజెంట్ల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. ఈనెల 28వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు, నిర్వహణపై కూడా తనిఖీ నిర్వహించాల్సిందిగా సూచించారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న 70 వేల మంది ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఇప్పటి వరకు 70 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఈ యాప్‌ద్వారా 69 వేలమంది తమ ఓటరుస్లిప్‌లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా 3.12 లక్షల మంది ఓటరుస్లిప్లో డౌన్లోడ్ చేసుకున్నారని, తమ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగతంగా 40 శాతం మంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారన్నారు. ఎన్నికల సిబ్బంది ఫిబ్రవరి 1నే చేరుకోవాలి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 7 గంటలకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్,కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమించామన్నారు.