Prevented
-
భారత్‌లో వ్యాక్సిన్లతో... 42 లక్షల ప్రాణాలు నిలిచాయి
లండన్: కరోనా మహమ్మారిని వ్యాక్సిన్లు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని, వాటివల్ల 2021లో భారత్ 42 లక్షల మరణాలను నివారించిందని ప్రఖ్యాత లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. యూకేలోని లండన్‌లో ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్–19 వాస్తవ మరణాలను, డిసెంబర్ 8, 2020, డిసెంబర్ 8, 2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్‌ను సరిపోల్చి చూస్తూ ఈ లెక్కలు వేశారు. భారత్‌లో 42 లక్షలకు పైగా మరణాలను నివారించినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ‘‘భారత్‌కు సంబంధించినంత వరకు ఈ ఏడాది కాలంలో 42,10,000 మరణాలను నివారించగలిగిందని మాకు అంచనాలున్నాయి’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ ఒలివర్ వాట్సన్ చెప్పారు. 2 కోట్ల ప్రాణాలు పోయేవి కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకి, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ తేడా ఉన్నట్టు విమర్శలున్నాయి. కరోనాతో 189 దేశాల్లో 3.14 కోట్ల మంది మరణిస్తారని అనుకుంటే వ్యాక్సిన్లు రావడం వల్ల వారిలో 1.98 కోట్ల మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. ప్రతీ దేశంలో 40శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని ఉండి ఉంటే 5.99 లక్షల మరణాలు తప్పేవని అధ్యయనం పేర్కొంది. 17 వేలకు పైగా కేసులు న్యూఢిల్లీ : దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే 30శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 17,336 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. కరోనాతో ఒక్క రోజులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. -
ఇదేనా సాధికారత
-
అప్రజాస్వామికం
ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ యంత్రాంగంలో నెలకొన్న అయోమయం ఇంకా సర్దుకున్నట్టులేదని ఢిల్లీ విమానాశ్రయంలో స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్ పీస్’ కార్యకర్త ప్రియా పిళ్లై విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు వెల్లడిస్తున్నది. ఆదివారం ఉదయం లండన్ వెళ్లే విమానం ఎక్కబోతున్న ప్రియా పిళై్లను అధికారులు నిలువరించి ‘లుకౌట్ నోటీసు’ ఉందని చెబుతూ వెనక్కు పంపారు. ఆమెను కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకే ఆపవలసివచ్చిందని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారులు చెబుతుంటే...హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మాత్రం తమకేమీ తెలియదంటున్నారు. తీవ్ర నేరాలు చేసి, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొని చట్టానికి దొరక్కుండా తప్పించుకు తిరిగే వ్యక్తులు దేశం విడిచివెళ్లకుండా చూడటం భద్రతాసంస్థలు చేయాల్సిన పని. ప్రియా పిళై్ల కూడా ఆ తరహా వ్యక్తే అయితే అలాంటి చర్య తీసుకోవడంలో ఆక్షేపించవలసింది ఏమీ లేదు. కానీ, గ్రీన్‌పీస్ సంస్థకుగానీ, వ్యక్తిగతంగా ప్రియాపిళై్లకుగానీ ఇలాంటి చరిత్ర లేదు. ఆ సంస్థ గత కొన్నేళ్లుగా దేశంలో పర్యావరణ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. అడవులు నరికేయడం, కొండలను పిండిచేయడం, గనులను తొలిచేయటం, నదీజలాల్లోకి ప్రమాదకరమైన వ్యర్థాలనూ, రసాయనాలను వదలటం, అణు విద్యుత్ ప్రాజెక్టులను అనుమతించటంవంటివి భూతాపోన్నతికి కారణమవుతాయని... ఇలాంటి చర్యలవల్ల ప్రమాదకరమైన పర్యవసానాలు ఏర్పడతాయని ఆ సంస్థ వాదిస్తున్నది. అభివృద్ధి పేరుచెప్పి, ఉపాధి అవకాశాల సాకు చూపి ఫ్యాక్టరీలకు చిత్తం వచ్చినట్టు అనుమతులు మంజూరుచేయడం సరికాదంటున్నది. మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల అక్కడున్న అడవులు ధ్వంసమవుతాయని, ఆదివాసుల జీవిక దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ భావించి మహాన్ సంఘర్ష సమితి(ఎంఎస్ఎస్) ఏర్పాటుచేసి ఉద్యమం నడుపుతున్నది. తమ అవగాహనను బ్రిటన్ ఎంపీలకు తెలియజెప్పేందుకు ప్రియా పిళై్ల లండన్ వెళ్తున్న సందర్భంలో ఆమెను అధికారులు అడ్డగించారు. ఎస్సార్ బ్రిటన్‌కు చెందిన సంస్థ గనుక దాన్ని గురించి అక్కడివారికి చెప్పడం అవసరమని ఆమె అంటున్నారు. బొగ్గు క్షేత్రాలు కేటాయించిన ప్రాంతంలో అడవులున్నాయని, ఈ అడవులపై ఆ చుట్టుపక్కల ఉన్న 54 గ్రామాల ఆదివాసీలు ఆధారపడి ఉన్నారని గ్రీన్‌పీస్ చెబుతున్నది. ప్రాజెక్టుకిచ్చిన అనుమతులన్నీ తప్పుడు పత్రాల ఆధారంగా ఇచ్చినవని సంస్థ ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామసభ నిర్వహించి, గ్రామస్తుల సంతకాలు ఫోర్జరీ చేశారని ఫిర్యాదుచేసింది. ఆఖరికి చనిపోయినవారి సంతకాలు కూడా గ్రామ సభ తీర్మానంలో ఉన్నాయని ఎత్తిచూపింది. నిజానికి ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఆదివాసీలకు మద్దతుగా నిలబడాలి. వారికి అన్యాయం జరగకుండా కృషిచేయాలి. ఏ రాజకీయ పక్షమూ అలాంటి పనిచేసిన దాఖలా లేదు. మహాన్ బొగ్గు గనుల వ్యవహారంలో గ్రీన్‌పీస్ చేస్తున్న వాదన సరైనదేనని యూపీఏ ప్రభుత్వంలోని గిరిజనాభివృద్ధి మంత్రి కిషోర్‌చంద్ర దేవ్ అప్పట్లో అంగీకరించారు. పర్యావరణానికి హాని కలిగిస్తూ, అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్సార్, హిండాల్కో సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ విషయంలో ఇంతవరకూ ఎలాంటి చర్యలూ లేకపోగా ఒక ధర్నాలో పాల్గొన్న కేసులో నిందితురాలుగా ఉన్నందుకు ప్రియా పిళై్లపై ఆంక్షలు విధించే పనికి పూనుకున్నారు. నిజానికి గ్రీన్‌పీస్ వంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు లేనట్టయితే ఆదివాసీల గొంతు ఇంత బిగ్గరగా వినబడేది కాదు. గ్రీన్‌పీస్, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు విదేశాల ప్రోద్బలంతో, వారిచ్చే విరాళాల సాయంతో దేశంలో సాగుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆమధ్య ఐబీ నివేదిక తెలిపింది. ఇలాంటి సంస్థల వైఖరివల్ల మన జీడీపీ 2 నుంచి 3 శాతం తగ్గే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించింది. వీటి కట్టడికి చర్యలు తీసుకోనిదే ప్రాజెక్టుల పని ముందుకు సాగదని వివరించింది. పర్యావరణం, భూతాపోన్నతి, అభివృద్ధి వంటి అంశాలు సవివరంగా, పారదర్శకంగా చర్చించవలసినవి. వీటిపై పరస్పర విరుద్ధమైన వాదనలు ఉన్నాయి. ఏదో ఒక పక్షం వాదనే సరైనదని నమ్మనవసరం లేదు. ఆయా రంగాల్లో నిపుణులైనవారు ప్రామాణికమైన, హేతుబద్ధమైన వాదనలతో అవతలిపక్షం చేస్తున్న వాదనలో పసలేదని చెప్పడంలో తప్పులేదు. అలాగే ప్రభుత్వాలు తీసుకునే చర్యల కారణంగా జీవికను కోల్పోతున్నవారికి, నిరాశ్రయులవుతున్నవారికి ఇప్పుడు చూపుతున్న ప్రత్యామ్నాయాలేమిటో...అందులోని లోపాలేమిటో చెప్పడానికి పర్యావరణ ఉద్యమకారులకు హక్కుంటుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండానే సుస్థిర అభివృద్ధి ఎలా సాధ్యమో కూడా వారిని చెప్పమనవచ్చు. అయితే, ఇలాంటి మంచి వాతావరణం కల్పించడానికి బదులు ప్రశ్నించినవారిని భయపెట్టడం, వారిపై ఆంక్షలు విధించాలని చూడటం అప్రజాస్వామికమవుతుంది. బ్రిటన్‌కు చెందిన సంస్థ మన దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆ దేశానికి చెందిన ఎంపీలకు వివరించడం, వారి జోక్యాన్ని కోరడం మన కేంద్ర ప్రభుత్వానికి లేదా మన దేశ ప్రయోజనాలకు ఎలా విరుద్ధమవుతుందో ఊహకందని విషయం. ఇలా ప్రవర్తించడం మన అధికారులకు ఇది తొలిసారేమీ కాదు. నిరుడు సెప్టెంబర్‌లో మన దేశానికి వచ్చిన గ్రీన్‌పీస్ సంస్థకు చెందిన బ్రిటన్ ఉద్యమకారిణి బెన్ హర్‌గ్రీవ్స్‌ను విమానాశ్రయంనుంచే వెనక్కు పంపారు. హైదరాబాద్‌లో నిరుడు జూన్‌లో వృద్ధాప్యంపై నిర్వహించిన ప్రపంచ సదస్సుకొస్తున్న మరో బ్రిటిష్ జాతీయురాలు పెన్నీ వెరా సాన్సోను కారణం చూపకుండానే తిప్పిపంపారు. ఇలాంటి చర్యలు మన అపరిపక్వతను పట్టిచూపుతాయి. పాలకులకు రాజ్యాంగ విలువలపట్ల విశ్వాసంలేదన్న సంగతిని వెల్లడిస్తాయి. తమ నిర్ణయాల కారణంగా పౌరులు ఇబ్బందిపడుతున్నారని తెలిసినప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి కృషిచే యడం ప్రభుత్వాల కర్తవ్యం. అందుకు బదులు ఉద్యమిస్తున్నవారిని నేరస్తులుగా చూడటం, వారి ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించడం తగని పని. -
మోక్షం కలిగేనా..?
చౌటుప్పల్ : కాలంచెల్లిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతుండడంతో, వీటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం జపాన్, ఇంగ్లండ్ దేశాల సాంకేతిక పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా 6రాష్ట్రాల్లో మానవ రహిత కంప్యూటరీకరణ ద్వారా వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో సర్వేనంబర్486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి 10 ఎకరాల భూమిని కేటాయించారు. 2012, ఆగసులో భూమిని చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. గుట్టను ఇటాచీల సాయంతో తవ్వి, కొంతవరకు చదును చేశారు. ఇదే సర్వేనంబరులో క్రషర్ మిల్లులకు భూమిని కేటాయించారు. క్రషర్ మిల్లులకు సమీపంలోనే వాహనాల సామర్థ్య కేంద్రానికి భూమిని కేటాయించడంతో, క్రషర్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. రెండింటికి మధ్య కనీసంగా 500గజాల దూరం లేకపోవడంతో, కోర్టు స్టేతో ఏడాదిన్నర క్రితం వాహనాల సామర్థ్య కేంద్రం పనులు నిలిచిపోయాయి. నిధులు వెనక్కివెళ్లే ప్రమాదం.. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లతోపాటు మన రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆటోమోటివ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్లను మంజూ రు చేసింది. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.15కోట్ల చొప్పున మంజూరు చేసింది. మిగతా రాష్ట్రాల్లో ఫిట్నెస్ సెంటర్ల పనులు పూర్తి కావస్తున్నా, మన రాష్ట్రానికి మంజూరైన ఫిట్నెస్ సెంటర్ పనులకు కోర్టు స్టే రూపంలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రూ.1.50కోట్లు విడుదల కావడంతో, భూమి చదు ను చేసే పనులతోపాటు భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ శాఖకు అప్పగించారు. ఆర్అండ్బీ అధికారులు భూమిని చదును చేసే పనులను కొంతవరకు చేశారు. ఈ కేంద్రం పనులు త్వరగా ప్రారంభించి, నిధులను ఖర్చు చేయకపోతే, కేంద్రం విడుదల చేసిన మిగిలిన నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. కేంద్రం నిర్మాణం పూర్తయితే.. ఆటోమోటివ్ వెహికిల్ ఫిట్నెస్ సెంటర్‌ను 65వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలన్నింటినీ ఇక్కడ తనిఖీ చేస్తారు. ఇంగ్లండ్, జపాన్ దేశాల నుంచి వచ్చే యంత్రాల సాయంతో మానవ ప్రమేయం లేకుండానే వాహనాల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ప్రతి వాహనం కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత ఇక్కడ కచ్చితంగా పరీక్షించాలి. సామర్థ్యం బాగుందనుకుంటేనే, ఆ వాహనం తిరిగేందుకు అవకాశమిస్తారు. ఒకవేళ ఆ వాహనాలకు కాలంచెల్లితే రోడ్డెక్కకుండా, తగిన చర్య తీసుకుంటారు. భూ కేటాయింపునకు తాజా ప్రతిపాదనలు సర్వేనంబరు 486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి 10, జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి మొదట 5ఎకరాల చొప్పున పక్కపక్కనే భూమిని కేటాయించారు. కానీ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి 10 ఎకరాలు కావాలని జాతీయ పోషకాహార సంస్థ అధికారులు పేచీ పెట్టడంతో, గత నెల 21న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ పాండురంగారావులు రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. వారం రోజుల్లో పనులను పునఃప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించి పక్షం రోజులు దాటినా అతీగతీ లేదు. కాగా, వాహనాల సామర్థ్య కేంద్రానికి 8.12 ఎకరాలు, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి 8ఎకరాలు కేటాయించేలా తాజాగా మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. భూమి కేటాయింపు జరిగేందుకు మరికొంత కాలం పట్టనుంది. ఈ ప్రక్రియ ముగిసే -
తెలంగాణను అడ్డుకున్నది ముఖ్యమంత్రే
దేవునిపల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటుంది సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన పట్టణంలోని టీడీపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన నాయకులు చరిత్రలో మిగలరన్నారు. అదే గతి కిరణ్‌కుమార్‌రెడ్డికి పడుతుందని ఆయన హెచ్చరించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారని అన్నారు. కాని కేంద్రం వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ఇస్తారో లేదో ఆని అనుమానంగా ఉందన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు నూకలు చెల్లడం ఖాయమన్నారు. సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.