మోక్షం కలిగేనా..?
చౌటుప్పల్ : కాలంచెల్లిన వాహనాలు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతుండడంతో, వీటిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం జపాన్, ఇంగ్లండ్ దేశాల సాంకేతిక పరిజ్ఞానంతో దేశవ్యాప్తంగా 6రాష్ట్రాల్లో మానవ రహిత కంప్యూటరీకరణ ద్వారా వాహనాల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో సర్వేనంబర్486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి 10 ఎకరాల భూమిని కేటాయించారు. 2012, ఆగసులో భూమిని చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. గుట్టను ఇటాచీల సాయంతో తవ్వి, కొంతవరకు చదును చేశారు. ఇదే సర్వేనంబరులో క్రషర్ మిల్లులకు భూమిని కేటాయించారు. క్రషర్ మిల్లులకు సమీపంలోనే వాహనాల సామర్థ్య కేంద్రానికి భూమిని కేటాయించడంతో, క్రషర్ మిల్లుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. రెండింటికి మధ్య కనీసంగా 500గజాల దూరం లేకపోవడంతో, కోర్టు స్టేతో ఏడాదిన్నర క్రితం వాహనాల సామర్థ్య కేంద్రం పనులు నిలిచిపోయాయి.
నిధులు వెనక్కివెళ్లే ప్రమాదం..
ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లతోపాటు మన రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆటోమోటివ్ వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్లను మంజూ రు చేసింది. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.15కోట్ల చొప్పున మంజూరు చేసింది. మిగతా రాష్ట్రాల్లో ఫిట్‌నెస్ సెంటర్ల పనులు పూర్తి కావస్తున్నా, మన రాష్ట్రానికి మంజూరైన ఫిట్‌నెస్ సెంటర్ పనులకు కోర్టు స్టే రూపంలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రూ.1.50కోట్లు విడుదల కావడంతో, భూమి చదు ను చేసే పనులతోపాటు భవనాల నిర్మాణాన్ని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు భూమిని చదును చేసే పనులను కొంతవరకు చేశారు. ఈ కేంద్రం పనులు త్వరగా ప్రారంభించి, నిధులను ఖర్చు చేయకపోతే, కేంద్రం విడుదల చేసిన మిగిలిన నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.
కేంద్రం నిర్మాణం పూర్తయితే..
ఆటోమోటివ్ వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్‌ను 65వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వాహనాలన్నింటినీ ఇక్కడ తనిఖీ చేస్తారు. ఇంగ్లండ్, జపాన్ దేశాల నుంచి వచ్చే యంత్రాల సాయంతో మానవ ప్రమేయం లేకుండానే వాహనాల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ప్రతి వాహనం కొనుగోలు చేసిన రెండేళ్ల తర్వాత ఇక్కడ కచ్చితంగా పరీక్షించాలి. సామర్థ్యం బాగుందనుకుంటేనే, ఆ వాహనం తిరిగేందుకు అవకాశమిస్తారు. ఒకవేళ ఆ వాహనాలకు కాలంచెల్లితే రోడ్డెక్కకుండా, తగిన చర్య తీసుకుంటారు.
భూ కేటాయింపునకు తాజా ప్రతిపాదనలు
సర్వేనంబరు 486లో వాహనాల సామర్థ్య కేంద్రానికి 10, జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి మొదట 5ఎకరాల చొప్పున పక్కపక్కనే భూమిని కేటాయించారు. కానీ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి 10 ఎకరాలు కావాలని జాతీయ పోషకాహార సంస్థ అధికారులు పేచీ పెట్టడంతో, గత నెల 21న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ పాండురంగారావులు రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. వారం రోజుల్లో పనులను పునఃప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించి పక్షం రోజులు దాటినా అతీగతీ లేదు. కాగా, వాహనాల సామర్థ్య కేంద్రానికి 8.12 ఎకరాలు, ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రానికి 8ఎకరాలు కేటాయించేలా తాజాగా మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. భూమి కేటాయింపు జరిగేందుకు మరికొంత కాలం పట్టనుంది. ఈ ప్రక్రియ ముగిసే