Preventive Detention Act
-
పీడీ.. వ్యక్తిగత స్వేచ్ఛపై దండయాత్రే: సుప్రీం
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధం(పీడీ) అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన దండయాత్రేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు చేపట్టే విషయంలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021 నవంబర్ 12న త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన పీడీ ఉత్తర్వును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. పీఐటీఎన్‌డీపీఎస్ చట్టం–1988 కింద అరెస్టు చేసిన నిందితుడిని వెంటనే విడుదల చేయాలని çఆదేశించింది. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తే నిందితులు ఏడాదిపాటు జైల్లోనే ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తమపై నమోదైన కేసుల్లో నిరపరాధినని నిరూపించుకొనే అవకాశం లేకుండా పోతోందంది. ప్రచారం కోసం ఇక్కడికి రావొద్దు కేవలం ప్రచారం కోసం న్యాయస్థానానికి రావొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల)ను ఎన్నికల సంఘం (ఈసీ) కాకుండా కొన్ని కంపెనీలు నియంత్రిస్తున్నాయంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్ వికాస్ పార్టీ వేసిన పిటిషన్‌పై Ôజస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు వాడకంలో ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఇది. ఓటర్ల ఆదరణ పెద్దగా పొందలేని ఓ రాజకీయ పార్టీ ఇటువంటి పిటిషన్ల ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు గ్రూప్–సి ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రూ.50 వేలు జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
‘సీఎంఆర్’ ఎగవేతదారులపై పీడీ కేసులు
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు చెల్లించని మిల్లర్లపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. 2015–16కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇప్పటికీ వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 21 మంది మిల్లర్ల నుంచి రూ.17 కోట్ల విలువైన 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందని పేర్కొన్నారు. బుధవారం ఈ మేరకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ల (డీఎం)తో సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. 2015–16 సీఎంఆర్ బకాయిల చెల్లింపు గడువు గతేడాది అక్టోబరు 31వ తేదీతో ముగిసిందని, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిందని, ఆ గడువు కూడా డిసెంబరు 30వ తేదీతో ముగిసిందని వివరించారు. గతేడాదికి రాష్ట్రంలో రూ.482 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉండగా, రూ.465 కోట్లు (99 శాతం) రాబట్టామని, ఇంకా రూ.17 కోట్ల వసూలుకు చర్యలు తీసుకోవాలని డీఎంలను ఆదేశించారు. -
డీడీ పెరిగితే పీడీ!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మొన్న... అక్కడికక్కడ కేసులు నమోదు చేసి జరిమానా వసూలు చేయడం. నిన్న... వాహనం స్వాధీనం చేసుకుని... న్యాయస్థానంలో హాజరుపరచడం. నేడు... పరిమితికి మించి మద్యం తాగినట్లు తేలితే జైలు. రేపు... పదే పదే డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ (డీడీ) చిక్కిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగం. ...ఇదీ హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారుల యోచన. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో అత్యంత ప్రమాదకరంగా పరిగణించే వాటిలో డ్రంకన్ డ్రైవ్ ప్రధానమైనది. దీని వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు అమాయకులైన ఎదుటి వారికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే దీనిపై ట్రాఫిక్ కాప్స్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో పదేపదే మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఫైన్ నుంచి జైలు వరకు... ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్ (ఎంవీ) యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. ఈ చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో గతంలో ట్రాఫిక్ పోలీసులు ‘నిషా’చరులను ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 184 బి) కిందే నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ ఇన్ టెన్ కంట్రీస్ (ఆర్ఎస్-10) కింద 2011 నవంబర్‌లో ట్రాఫిక్ పోలీసులకు అందిన ఉపకరణాలను వినియోగించి ‘నిషా’చరులకు పక్కాగా చెక్ చెబుతున్నారు. ఆర్ఎస్-10తో వచ్చిన బ్రీత్ ఎనలైజర్లు ఆల్కహాల్ క్వాంటిటీని నిర్థారించడంతో పాటు ప్రింట్ అవుట్ రూపంలో ఇస్తాయి. ఇది కోర్టులో ఆధారంగా పని చేస్తోంది. డ్రైవ్‌లో మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కిన వారి వాహనాన్ని అప్పటికప్పుడే సీజ్ చేస్తున్నారు. చోదకుడిని మాత్రం మరుసటి రోజు కోర్టుకు రమ్మని చెప్పి పంపిస్తున్నారు. ఎనలైజర్ నుంచి వచ్చిన ప్రింట్ అవుట్‌ను ఆధారంగా చూపి కోర్టులో ప్రవేశపెట్టగా... రూ.2 వేల జరిమానా కట్టి వీరు బయటకు వచ్చేవారు. ఆపై ట్రాఫిక్ పోలీసులు ‘నిషా’చరులను జైలుకు పంపేలా ఎంవీ యాక్ట్‌లో ఉన్న నిబంధనలను వినియోగించుకున్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 185 (1) (బి) ప్రకారం వాహన చోదకుడు మద్యం తాగినట్టు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో తేలితే... జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు నిషాచరులను కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ద్వారా జైలుకు పంపిస్తున్నారు. ఇకపై ‘పీడీ’... ‘నిషా’చరులను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నగర పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీని కోసం సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. వారాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌ను ట్రాఫిక్ విభాగం అధికారులు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా నిర్వహిస్తున్నారు. వీటి పరిధుల్లో చిక్కిన వారి పూర్తి వివరాలను సెంట్రలైజ్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో ఓ వ్యక్తి ఎన్నిసార్లు, ఏ మోతాదులో మద్యం తాగి వాహనం నడుపుతూ ఎక్కడెక్కడ చిక్కాడు అనేది తేలిగ్గా గుర్తించే అవకాశం ఏర్పడింది. దీనికోసం పట్టుబడిన వ్యక్తి పేరు, చిరునామా, వాహనం, డ్రైవింగ్ లెసైన్స్ నెంబర్ వంటి పూర్తి వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ డేటాబేస్‌ను విశ్లేషిస్తున్న అధికారులు పదేపదే చిక్కుతున్న వారిపైన, మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి గరిష్టంగా 12 నెలల పాటు జైల్లో ఉంచాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.