previlege motion
-
సీఎం రేవంత్‌పై ప్రివిలేజ్ మోషన్: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. సోమవారం(జులై 29) అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘గవర్నమెంట్ డిఫెన్స్‌లో పడినప్పుడు సీఎం ఏదో పేపర్ పట్టుకొని సభలోకి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు. సభా నాయకుడు మిస్ లీడ్ చేస్తున్నారు. మోటార్లకు మీటర్ల అంశంలో మెటీరియల్‌లో అదర్ దేన్ అగ్రికల్చర్ మీటర్స్ అనే పదాలను కావాలని ఎగరగొట్టి చదివారు. అప్పులు 7 లక్షల కోట్లు అని తప్పుగా చెబుతున్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయలేదని చెప్పే ప్రయత్నం నేను చేస్తుండగా... మోటర్లకు మీటర్లు పెట్టడానికి సంతకం చేశారని రేవంత్ లేచి సభను మిస్ లీడ్ చేశారు.దబాయింపు చర్యలకు సీఎం పాల్పడుతున్నారు. ఇండియా కూటమి 28 పార్టీల కలయికతో కాంగ్రెస్‌కు ఆ మాత్రం ఎంపీ సీట్లు వచ్చాయి. 28 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు 21 శాతం ఓట్లు వచ్చాయి. రేవంత్ పనితీరు బాగోలేకపోవడంతోనే మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆయన ఎంపీగా గెలిచిన మల్కాజిగిరి పార్లమెంట్లో కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. రేవంత్ సొంత జిల్లాలో లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం కూడా ఓడిపోయారు.గతంలో 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాలేదా ? చీమలు పెట్టిన పుట్టలో పాము దురినట్లు రేవంత్ కాంగ్రెస్‌లతో చేరి సీఎం అయ్యారు. అసలు కాంగ్రెస్‌లో హనుమంత్ రావు లాంటి నేతలు ఏమయ్యారు ? జైపాల్ రెడ్డి కనీసం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వలేదు’అని హరీశ్‌రావు అన్నారు. -
స్పీకర్‌ను అగౌరవ పరచలేదు: చెవిరెడ్డి
-
ఏనాడూ స్పీకర్‌ను అగౌరవపరచలేదు
తాను ఏనాడూ స్పీకర్‌ను అగౌరవ పరచలేదని, అలాంటి తనపై తెలుగుదేశం పార్టీ నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ నెల 22వ తేదీన విలేకరులతో మాట్లాడినప్పుడు కూడా తమకు సమాన అవకాశం కల్పించాలని మాత్రమే కోరినట్లు ఆయన చెప్పారు. స్పీకర్‌ను అగౌరవపర్చాలని తనకు ఏనాడు లేదని తెలిపారు. అధికార పక్షం ఎన్నిసార్లు అసభ్య పదజాలం వాడినా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే అన్నానని గుర్తు చేశారు. కొంతమంది మంత్రులు కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులను 'పందికొక్కులు' అంటూ తీవ్ర అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని, వాళ్లమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెవిరెడ్డి అన్నారు. తాను మాత్రం ఏరోజూ స్పీకర్‌ను అగౌరవపరచలేదని చెప్పారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మాత్రం స్పీకర్‌ను ఉద్దేశించి వాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారని, అలాంటివాళ్లు ఇప్పుడు తనమీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు.