ఏనాడూ స్పీకర్ను అగౌరవపరచలేదు | i did not insult speaker at anytime, says chevireddy bhaskar reddy | Sakshi
Sakshi News home page

ఏనాడూ స్పీకర్ను అగౌరవపరచలేదు

Published Tue, Aug 26 2014 12:01 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

ఏనాడూ స్పీకర్ను అగౌరవపరచలేదు - Sakshi

ఏనాడూ స్పీకర్ను అగౌరవపరచలేదు

తాను ఏనాడూ స్పీకర్ను అగౌరవ పరచలేదని, అలాంటి తనపై తెలుగుదేశం పార్టీ నేతలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ నెల 22వ తేదీన విలేకరులతో మాట్లాడినప్పుడు కూడా తమకు సమాన అవకాశం కల్పించాలని మాత్రమే కోరినట్లు ఆయన చెప్పారు. స్పీకర్‌ను అగౌరవపర్చాలని తనకు ఏనాడు లేదని తెలిపారు. అధికార పక్షం ఎన్నిసార్లు అసభ్య పదజాలం వాడినా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే అన్నానని గుర్తు చేశారు.

కొంతమంది మంత్రులు కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులను 'పందికొక్కులు' అంటూ తీవ్ర అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని, వాళ్లమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెవిరెడ్డి అన్నారు. తాను మాత్రం ఏరోజూ స్పీకర్ను అగౌరవపరచలేదని చెప్పారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా మాత్రం స్పీకర్ను ఉద్దేశించి వాళ్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారని, అలాంటివాళ్లు ఇప్పుడు తనమీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడమేంటని ఆయన నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement