the prices of essential commodities
-
ధరదడలు
- వంట నూనెలకు డాలర్ సెగ - పప్పులకు పన్నుల పొగ తాడేపల్లిగూడెం : నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వంట నూనెలకు డాలర్ సెగ తగిలింది. పన్ను విధింపుతో పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల సన్‌ఫ్లవర్ నూనె ధర రూ.660 ఉండగా, డాలర్ దెబ్బతో రూ.745కు చేరుకుంది. పామాయిల్ ధర 10 కిలోలు రూ.510 నుంచి రూ.525కు చేరుకుంది. కాటన్ సీడ్ ఆయిల్ ధర పరుగు పెడుతోంది. కొత్త పంట దెబ్బతినడంతో మార్కెట్లో వేరుశనగ నూనె ధరలకు రెక్కలు వచ్చాయి. 10 కిలోల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.590నుంచి రూ.630కి పెరిగింది. పచ్చళ్ల సీజన్ మొదలు కాగా, కర్నూలు, తాడిపత్రి, ఆదోని ప్రాంతాల నుంచి అవసరమైన స్థాయిలో వేరుశనగ నూనె రావడం లేదు. వచ్చిన నూనెలో నాణ్యత పడిపోయింది. ఈ నూనె ధర 10 కిలోలు రూ.970కి చేరుకుంది. రైస్‌బ్రాన్ ఆయిల్ మాత్రం 10 కిలోలు రూ.610 వద్ద స్థిరంగా ఉంది. హోల్‌సేల్ మార్కెట్లో ఈ ధరలు పలుకుతుండగా, వీటికి రవాణా ఖర్చులు, వ్యాపారుల లాభం శాతాన్ని కలుపుకుని స్థానిక పరిస్థితుల ఆధారంగా రిటైల్ మార్కెట్లో ఈ ధరలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కసారిగా నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పన్నుల పొగ పప్పుల ధరలకు పన్నులు పొగ పెడుతున్నాయి. నిత్యం సామాన్యులు ఉపయోగించే కందిపప్పు ధర చుక్కలను చూపిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలోకు రూ.15 పెరిగింది. కందిపప్పు ఇక్కడి మార్కెట్లకు ఎక్కువగా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తోంది. ఇప్పటివరకూ జీరో శాతం ట్యాక్స్‌తో పప్పులు ఇక్కడకు మార్కెట్లకు వచ్చేవి. ఇప్పుడు పన్నులు విధించడంతో ఆ భారం ధరలపై పడింది. దీంతో రిటైల్ మార్కెట్లలో కందిపప్పు ధర ఒక్కసారిగా పెరిగింది. గతంలో గుత్త మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.90 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.105కు చేరుకుంది. రిటైల్‌గా మార్కెట్లో కిలో రూ.120కు విక్రయిస్తున్నారు. మినపప్పు కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో రూ.70 నుంచి రూ.75 రూపాయలకు గుత్త మార్కెట్లో దొరికే మినపప్పు రూ.92కు చేరుకుంది. శనగపప్పు మాత్రం గుత్త మార్కెట్లో కిలో రూ.65 వద్ద స్థిరంగా ఉంది. -
నిత్యావసరాలకు ధరాఘాతం
నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ఒక్క పూట పస్తులుంటున్న పేదజనం బచ్చన్నపేట : నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నారుు. ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. సామాన్య కుటుంబాలు పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారుు. గత నెల బడ్జెట్‌కు వచ్చే నెల రెట్టింపవుతుండడంతో ఒక్కపూటతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. మార్కెట్లో ఈ రోజు ఉన్న ధరలు, రేపు ఉండడం లేదు. పప్పుల ధరలు చుక్కలనంటుతుండగా వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. తెల్ల నువ్వులు కిలో రూ.160, విడి పల్లీ నూనె రూ.85, కాటన్ నూనె కిలో రూ.75, 5 లీటర్ల పల్లి నూనె క్యాన్ రూ.350, సన్‌ఫ్లవర్ క్యాన్ రూ.440, తెల్ల ఉల్లిగడ్డ కిలో రూ.30, ఎర్ర ఉల్లిగడ్డ కిలో రూ.25కు పెరిగిపోయాయి. సన్నరకాలకు చెందిన లోకల్ కొత్త బియ్యం క్వింటాల్‌కు రూ.3వేలు, కోదాడకు చెందిన కొత్త బియ్యం క్వింటాల్‌కు రూ.3150, సన్నరకం బియ్యం పాతవి మొదటి రకం క్వింటాల్‌కు రూ.3800, రెండో రకం రూ.3400 పలుకుతున్నాయి. హెచ్ఎంటీ రకం రైస్‌కు క్వింటాల్‌కు రూ.4500పైగా వరకు ధర పుంది. కిరాణ, బియ్యం ధరలకు తోడు కూరగాయల ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కిలో రూ.40 కావడంతో వారిపై అదనపు భారం పడుతోంది. ధరలు గిట్ల పెరిగితే ఎట్లా నెల రోజులు గడవక ముందే పప్పుల ధరలు పెరిగాయి. నెలనెలా గిట్ల ధరలు పెరగితే బతికేదెట్లా. నెలకు రూ.3 వేలు అయ్యే ఖర్చు. ఇప్పుడు రూ.8 వేలకు వచ్చింది. సామాను తేవాలంటేనే భయమైతాంది. పని చేసుకుంటేనే బతికేటోళ్లం. ధరల భారం మాపై మోపితే ఎట్లా. పెరిగిన ధరలను తగ్గించాలి. - బైరి మంజుల, మహిళ, బచ్చన్నపేట ధరలు తగ్గించాలి నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి. కిలో పప్పు కొనాలంటే కళ్లపొంటి నీళ్లు కారుతున్నయి. రూ.వంద నోటు తీసుకుపోతే ఒక్కపూట తినేందుకు కూడా సరుకులు వచ్చే పరిస్థితి లేదు. దుకాణంలోకి వెళ్లినప్పుడాళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బైక్‌లు బాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. రూ.2500 నుంచి రూ.3వేల వరకు ఇంటి అవసరాలకు ఖర్చు వచ్చేది. ధరలు పెరగడంతో రూ.5 వేలకు పెరిగిపోయింది. దీంతో ఒక్కపైసా కూడా వెనకేసుకోలేకపోతున్నం. - కర్ణాల వేణు, మెకానిక్, బచ్చన్నపేట -
ధరల మంట
చంద్రశేఖర్‌కాలనీ, న్యూస్‌లైన్: నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. సగటు మనిషి జీవితం ఆగమవుతోంది. ఏమి కొనేట్టు లేదు.. ఏమి తినేట్టు లేదు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు గగ్గోలు పెట్టే రాజకీయ పార్టీల నాయకులు స రుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, వాటి ఊ సే ఎత్తడం లేదు. దీనిపై ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు పేద, సా మాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండుపూటలా పప్పుచారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుం డాపోతున్నాయని పేదలు వాపోతున్నారు. మొన్నటి వరకు సన్నరకం (బీపీటీ) బియ్యం ధరలు కొద్దిగా తగ్గినట్టు కనిపించినా, మళ్లీ వాటికి రెక్కలు వచ్చాయి. పప్పుల విషయానికి వస్తే ఆరు మాసాల క్రితం కిలో రూ. 50 నుంచి రూ. 60 రూపాయలు ఉన్న పెసర, కంది పప్పుల ధరలుఏకంగా కిలో రూ. 90 నుంచి రూ. 120 వరకు ఎగబాకాయి. పేద లు పెసర, కంది పప్పులను వారంలో ఐదు రోజు లైనా ఉపయోగిస్తారు. ఎండిన కుడుకలు మొన్నటి వరకు కిలో రూ. 80 నుంచి 90 ఉండగా, వారం రోజుల నుంచి ఏకంగా కిలో రూ. 150కి పెరిగిపోయాయి. ఇక సన్న బియ్యం ధరలు క్వింటాలుకు రూ. 3600 నుంచి రూ. 4000, హెచ్ఎంటీ బియ్యం రూ. 4200 నుంచి రూ. 4600 చొప్పన అమ్మకాలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నాయకులు ధరల తగ్గింపుపై పెదవి విప్పకపోవడం గమనార్హం.