నిత్యావసరాలకు ధరాఘాతం
నెల రోజుల్లో భారీగా పెరిగిన ధరలు ఒక్క పూట పస్తులుంటున్న పేదజనం
బచ్చన్నపేట : నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్నారుు. ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. సామాన్య కుటుంబాలు పెరుగుతున్న ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారుు. గత నెల బడ్జెట్‌కు వచ్చే నెల రెట్టింపవుతుండడంతో ఒక్కపూటతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. చిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారింది. మార్కెట్‌లో ఈ రోజు ఉన్న ధరలు, రేపు ఉండడం లేదు. పప్పుల ధరలు చుక్కలనంటుతుండగా వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. తెల్ల నువ్వులు కిలో రూ.160, విడి పల్లీ నూనె రూ.85, కాటన్ నూనె కిలో రూ.75, 5 లీటర్ల పల్లి నూనె క్యాన్ రూ.350, సన్‌ఫ్లవర్ క్యాన్ రూ.440, తెల్ల ఉల్లిగడ్డ కిలో రూ.30, ఎర్ర ఉల్లిగడ్డ కిలో రూ.25కు పెరిగిపోయాయి.
సన్నరకాలకు చెందిన లోకల్ కొత్త బియ్యం క్వింటాల్‌కు రూ.3వేలు, కోదాడకు చెందిన కొత్త బియ్యం క్వింటాల్‌కు రూ.3150, సన్నరకం బియ్యం పాతవి మొదటి రకం క్వింటాల్‌కు రూ.3800, రెండో రకం రూ.3400 పలుకుతున్నాయి. హెచ్‌ఎంటీ రకం రైస్‌కు క్వింటాల్‌కు రూ.4500పైగా వరకు ధర పుంది. కిరాణ, బియ్యం ధరలకు తోడు కూరగాయల ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తున్నాయి. కిలో రూ.40 కావడంతో వారిపై అదనపు భారం పడుతోంది.
ధరలు గిట్ల పెరిగితే ఎట్లా
నెల రోజులు గడవక ముందే పప్పుల ధరలు పెరిగాయి. నెలనెలా గిట్ల ధరలు పెరగితే బతికేదెట్లా. నెలకు రూ.3 వేలు అయ్యే ఖర్చు. ఇప్పుడు రూ.8 వేలకు వచ్చింది. సామాను తేవాలంటేనే భయమైతాంది. పని చేసుకుంటేనే బతికేటోళ్లం. ధరల భారం మాపై మోపితే ఎట్లా. పెరిగిన ధరలను తగ్గించాలి.
- బైరి మంజుల, మహిళ, బచ్చన్నపేట
ధరలు తగ్గించాలి
నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి. కిలో పప్పు కొనాలంటే కళ్లపొంటి నీళ్లు కారుతున్నయి. రూ.వంద నోటు తీసుకుపోతే ఒక్కపూట తినేందుకు కూడా సరుకులు వచ్చే పరిస్థితి లేదు. దుకాణంలోకి వెళ్లినప్పుడాళ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బైక్‌లు బాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. రూ.2500 నుంచి రూ.3వేల వరకు ఇంటి అవసరాలకు ఖర్చు వచ్చేది. ధరలు పెరగడంతో రూ.5 వేలకు పెరిగిపోయింది. దీంతో ఒక్కపైసా కూడా వెనకేసుకోలేకపోతున్నం.
- కర్ణాల వేణు, మెకానిక్, బచ్చన్నపేట