prices soar
-
Lemon Prices: జనాల జేబుల్ని పిండేస్తున్న నిమ్మ!
దేశంలో నిమ్మకాయ జనాల జేబుల్నిపిండేస్తోంది. ఎండకాలం కావడంతో ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటిదాకా 50-60 రూపాయలకు కేజీ పలికిన నిమ్మ.. ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పలుకుతోంది. పట్టణాల్లో, నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్లో నిమ్మకాయల రేట్లు వాయించేస్తున్నాయి. ప్రధానంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 కనిష్టంగా పలుకుతుండడం విశేషం. ఖుల్లా విషయానికొస్తే.. కాయకో రేటు, పండుకో రేటు లాగా అమ్ముతున్నారు. విడిగా ఒక్కో కాయను ఏడు నుంచి పది రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల.. కిందటి ఏడాది ఇదే సీజన్ (మార్చి) పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. ఇప్పుడు ఇలా ఉంటే.. ఏప్రిల్-మే నెలలో పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సామాన్యుడి ‘కిచెన్ బడ్జెట్’లో నిమ్మ చిచ్చు పెడుతోంది. ఎండకాలం కావడంతో డైట్ తప్పనిసరి లిస్ట్‌లో కనిపించే నిమ్మ.. బడ్జెట్ పరిధిని దాటించేస్తోంది. ధరలు ఎప్పుడు దిగుతాయో అని ఎదురు చూడడం వినియోగదారుల వంతు అవుతోంది. మార్కెట్లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే నిమ్మ ధరలు Lemon Prices ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటోంది. ఇంతకు ముందులా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నారు కొందరు. నాణ్యతను కూడా పట్టించుకోకుండా కొనేస్తున్నారు ఇంకొందరు. నిమ్మను గుత్తగా అమ్మేవ్యాపారులే కాదు.. రోడ్ల మీద తోపుడు బండ్లపై రసాలు, నిమ్మసోడా అమ్మేవాళ్ల మీదా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఖరికి టీ పాయింట్లలో లెమన్ టీ కొరత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే.. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నారు. అయినా కూడా ధరలను లెక్కచేయకుండా జనాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. బల్క్ మార్కెట్లో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల కారణంగా తక్కువ పరిమాణంలో నిమ్మకాయల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగితేనే.. ధరలు దిగొచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ పెరిగిన టమాట ధరలు
మదనపల్లె సిటీ: టమటా ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తుండడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్లో శుక్రవారం టమాటా ధర గరిష్టంగా కేజీ రూ.104 పలికింది. కేవలం 92 మెట్రిక్ టన్నుల సరుకు మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో టమాటాకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గ్లోబల్ ముడి చమురు ధరలు దేశీయ పెట్రో ధరలు షాకివ్వనున్నాయి. దేశీయ ఆయిల్ కంపెనీల గురువారం నాటి సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుమారు లీటరుకు రూ.7 పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు బారెల్ 55 డాలర్లు చేరువకావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ మేరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 15 రోజులకు ఒకసారి జరిగే ఆయిల్ కంపెనీల సమావేశంలో పెట్రో ధరల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డాలర్ల మార్పిడి రేటు ఆధారంగా భారతదేశంలోనిఇంధన ధరలు తగ్గించేందుకు, పెంచేందుకుగానీ ఈ సమావేశాలు కీలకం. ఈ నేపథ్యంలో పెట్రో ధరల పెంపుపై నిర్ణయం ఈరోజు తీసుకోనున్నాయి. అలాగే డాలర్ మారకపు రేటులో దేశీయ కరెన్సీ రూపాయి రూ. 67 స్థాయికి పడిపోవడం కూడా పెట్రో ధరలపై ప్రభావం చూపనున్నాయి.మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు అంగీకరించడంతో గ్లోబల్ చమురు పుంజుకుంటున్నాయి. రో్జుకు దాదాపు1.2 మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు అంగీకరించాయి. దీంతో రాబోయే రెండు మూడు నెలల్లో పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పెట్రోల్ ధర మరో 3-4 నెలల్లో 6-8 శాతం, డీజిల్ 5-8 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రీసెర్చ్ సంస్థ నివేదించిన సంగతి తెలిసిందే.