భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గ్లోబల్ ముడి చమురు ధరలు దేశీయ పెట్రో ధరలు షాకివ్వనున్నాయి. దేశీయ ఆయిల్ కంపెనీల గురువారం నాటి సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుమారు లీటరుకు రూ.7 పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు బారెల్ 55 డాలర్లు చేరువకావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ మేరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
15 రోజులకు ఒకసారి జరిగే ఆయిల్ కంపెనీల సమావేశంలో పెట్రో ధరల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డాలర్ల మార్పిడి రేటు ఆధారంగా భారతదేశంలోనిఇంధన ధరలు తగ్గించేందుకు, పెంచేందుకుగానీ ఈ సమావేశాలు కీలకం. ఈ నేపథ్యంలో పెట్రో ధరల పెంపుపై నిర్ణయం ఈరోజు తీసుకోనున్నాయి. అలాగే డాలర్ మారకపు రేటులో దేశీయ కరెన్సీ రూపాయి రూ. 67 స్థాయికి పడిపోవడం కూడా పెట్రో ధరలపై ప్రభావం చూపనున్నాయి.మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు అంగీకరించడంతో గ్లోబల్ చమురు పుంజుకుంటున్నాయి. రో్జుకు దాదాపు1.2 మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు అంగీకరించాయి. దీంతో రాబోయే రెండు మూడు నెలల్లో పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పెట్రోల్ ధర మరో 3-4 నెలల్లో 6-8 శాతం, డీజిల్ 5-8 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రీసెర్చ్ సంస్థ నివేదించిన సంగతి తెలిసిందే.