మళ్ళీ పెట్రో మోత!
న్యూఢిల్లీః పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 5 పైసలు చొప్పున పెరుగగా... డీజిల్ పై లీటర్ కు రూ.1.26 పైసలు పెరిగింది. ప్రస్తుతం సవరించిన ధరలు బుధవారం అర్థరాత్రినుంచి అమల్లోకి రానున్నాయి.
సవరించిన ధరల తర్వాత రాజధాని నగరంలో పెట్రోల్ లీటరుకు రూ.65.65 పైసలు కాగా, డీజిల్ లీటర్ ధర రూ.55.19 పైసలకు చేరినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రతినెలా ఒకటి, 16 తేదీల్లో ధరలను సవరించడంలో భాగంగా ప్రస్తుతం మరోసారి ధరలు పెరిగాయి. ఏప్రిల్ 16 నుంచి ఇప్పటివరకూ పెరిగిన ధరలను బట్టి చూస్తే, పెట్రోల్ పై లీటరుకు రూ.9.04 పైసలు పెరుగగా, మార్చి నెలనుంచి డీజిల్ లీటరుకు రూ.11.05 పైసలు పెరిగింది.