litre
-
అమూల్ పాల ధర పెంపు: ఏకంగా లీటరుకు 3 రూపాయలు బాదుడు
న్యూఢిల్లీ: అమూల్ కంపెనీ తన వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. ఫిబ్రవరి 3 నుండి అమూల్ పాల ధరలు లీటరుకు రూ. 3 పెంచేసింది. పెరిగిన ధరలు అన్ని వేరియంట్లపై వర్తిస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ తాజా ప్రకటన ప్రకారం, లీటరు అముల్ తాజా పాలు లీటరు ధర రూ. 54 గాను, అమూల్ ఆవు పాలు లీటరు ధర రూ.56గా ఉంది. గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 2022లో దీపావళికి ముందు ఫుల్ క్రీమ్ మిల్క్, తాజా, గోల్డ్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే.గత 10 నెలల్లో పాల ధరలు రూ.12 పెరిగాయి. అంతకు ముందు ఏడేళ్ల పాటు పాల ధర పెరగలేదు. ఏప్రిల్ 2013 , మే 2014 మధ్య పాల ధరలు లీటరుకు రూ.8 చొప్పున పెరిగాయి. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి. దీనివల్ల పాల కంపెనీలు పశువుల కాపరులకు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తోంది. అందుకే రానున్న రోజుల్లో పాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
గాడిద పాలకు డిమాండ్.. లీటరెంతో తెలుసా?
సాక్షి, కోహీర్(జహీరాబాద్): అవును మీరు విన్నది నిజ మే. ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైనను నేమి ఖరము పాలు’ అనే వేమన పద్యంలో మార్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అనిపిస్తుంది. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన బాలాజీ ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంలో గాడిద పాలు అమ్ముతూ కనిపించాడు. ఒక చిన్న అమృతాంజనం సీసా పాలు (సుమారు 10ఎంఎల్) రూ.100కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. ధర వింటే మీకు మూర్ఛ వచ్చినట్టయ్యిందా! కానీ గాడిద పాలలో దగ్గు, దమ్ము, మూర్ఛ వంటి వ్యాధులను తగ్గించే శక్తి ఉందని ప్రచారం ఉంది. అందుకే.. లీటరు రూ.10 వేలకు అమ్ముతున్నాడు. ఒకప్పుడు గాడిదను కొనాలంటే రూ.10 నుంచి 15 వేలు పెట్టాల్సి వస్తే, పాలకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం రూ.45 నుంచి రూ.50 వేల ధర పలుకుతోందని కూడా తెలిపాడు. -
పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
ముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) పెట్రోల్ ధర లీటరుకు ఒక పైస, డీజిల్ ధర 44 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సోమవారం నుంచి ఈ ధరలు అమలు కానున్నాయి. తాజా పెంపు ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.68.09లుగాను, కోల్‌కతాలో రూ. 70.68గాను, ముంబై రూ. 77.46గాను, చెన్నైలో రూ.71.17గాను ఉండనున్నాయి. మరోవైపు ఇంధన ధరలు ప్రతి అర్ధరాత్రి ఐదు నగరాల్లో మారనున్నాయి. దక్షిణ భారతదేశంలో పుదుచ్చేరి, వైజాగ్, పశ్చిమాన ఉదయపూర్, తూర్పున జంషెడ్పూర్, ఉత్తరాన చండీగఢ్ ఈ అయిదు నగరాల్లో మే1 వ తేదీనుంచి రోజుకో ధర అమలు కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ధరలు ఐవోసీ ప్రకటించింది. దీని ప్రకారం పెట్రోలు, చండీగడ్లొ రూ.67.65, జంషెడ్‌పూర్‌లో రూ .69.33, పుదుచ్చేరిలో రూ. 66.02, ఉదయపూర్‌లో రూ. 70.57, వైజాగ్‌లో రూ.72.68 లుగా ఉండనున్నాయి అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో నెలకొంటున్న తీవ్ర అనిశ్చితి కారణంగా రోజుకు ఒకసారి ధరలను సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు ఇటీవల నిర్ణయించాయి. కాగా ఏప్రిల్ 16న లీటర్లు 1.39పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటరకు 1.04పైసలు పెరిగింది. -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గ్లోబల్ ముడి చమురు ధరలు దేశీయ పెట్రో ధరలు షాకివ్వనున్నాయి. దేశీయ ఆయిల్ కంపెనీల గురువారం నాటి సమావేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుమారు లీటరుకు రూ.7 పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు బారెల్ 55 డాలర్లు చేరువకావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ మేరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 15 రోజులకు ఒకసారి జరిగే ఆయిల్ కంపెనీల సమావేశంలో పెట్రో ధరల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు, డాలర్ల మార్పిడి రేటు ఆధారంగా భారతదేశంలోనిఇంధన ధరలు తగ్గించేందుకు, పెంచేందుకుగానీ ఈ సమావేశాలు కీలకం. ఈ నేపథ్యంలో పెట్రో ధరల పెంపుపై నిర్ణయం ఈరోజు తీసుకోనున్నాయి. అలాగే డాలర్ మారకపు రేటులో దేశీయ కరెన్సీ రూపాయి రూ. 67 స్థాయికి పడిపోవడం కూడా పెట్రో ధరలపై ప్రభావం చూపనున్నాయి.మరోవైపు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు అంగీకరించడంతో గ్లోబల్ చమురు పుంజుకుంటున్నాయి. రో్జుకు దాదాపు1.2 మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు అంగీకరించాయి. దీంతో రాబోయే రెండు మూడు నెలల్లో పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పెట్రోల్ ధర మరో 3-4 నెలల్లో 6-8 శాతం, డీజిల్ 5-8 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రీసెర్చ్ సంస్థ నివేదించిన సంగతి తెలిసిందే. -
మళ్ళీ పెట్రో మోత!
న్యూఢిల్లీః పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు 5 పైసలు చొప్పున పెరుగగా... డీజిల్ పై లీటర్ కు రూ.1.26 పైసలు పెరిగింది. ప్రస్తుతం సవరించిన ధరలు బుధవారం అర్థరాత్రినుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన ధరల తర్వాత రాజధాని నగరంలో పెట్రోల్ లీటరుకు రూ.65.65 పైసలు కాగా, డీజిల్ లీటర్ ధర రూ.55.19 పైసలకు చేరినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రతినెలా ఒకటి, 16 తేదీల్లో ధరలను సవరించడంలో భాగంగా ప్రస్తుతం మరోసారి ధరలు పెరిగాయి. ఏప్రిల్ 16 నుంచి ఇప్పటివరకూ పెరిగిన ధరలను బట్టి చూస్తే, పెట్రోల్ పై లీటరుకు రూ.9.04 పైసలు పెరుగగా, మార్చి నెలనుంచి డీజిల్ లీటరుకు రూ.11.05 పైసలు పెరిగింది. -
మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: వాహన దారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రెండు రూపాయల చొప్పున తగ్గించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నవంబర్ చివర్లో కూడా ధరలు తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పలుమార్లు తగ్గించారు. -
డీజిల్ ధర లీటర్‌కు 50 పైసలు పెంపు
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు మరోసారి పాక్షికంగా పెరిగాయి. లీటర్‌కు 50 పైసలు చొప్పున పెంచారు. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు పెంచడమిది రెండోసారి. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. పెట్రో సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. -
డిజిల్ ధర పెరిగే అవకాశం
-
పెట్రోల్ ధర లీటర్‌కు 70 పైసలు తగ్గింపు
-
పెట్రోల్ ధర లీటర్‌కు 70 పైసలు తగ్గింపు
న్యూఢిల్లీ: వాహన వినియోగ దారులకు కాస్త ఊరట కలిగించే విషయం. పెట్రోల్ ధరలు పాక్షికంగా తగ్గాయి. లీటర్‌కు 70 పైసలు చొప్పున తగ్గించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గినా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగినట్టువుతుంది. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ లీటర్‌కు 60 పైసలు, డీజిల్ లీటర్‌కు 50 పైసలు చొప్పున పెంచారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. డీజిల్ అమ్మకాలపై నష్టాలను పూడ్చుకోవడానికి ప్రతి నెలా లీటరుపై 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో చమురు కంపెనీలు ధర పెంచుతుండడం విదితమే. ఈ నెల మొదట్లో డీజిల్ ధరను లీటర్‌కు 50 పైసలు చొప్పున పెంచారు. అప్పట్లో పెట్రోల్ ధరలు పెంచలేదు. కాగా గత ఏడాది జనవరి నుంచి డీజిల్ ధర పెరడగడం ఇది 14వ సారి. -
విజయ పాల వడ్డింపు.. రూ. 2 పెంపు
మార్చి 1 నుంచి లీటర్ ధర రూ. 38.. నెలలో రెండుసార్లు పెరుగుదల సాక్షి, హైదరాబాద్: విజయ పాల విక్రయ ధర నెలరోజుల్లోనే మరోసారి పెరిగింది. లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య బుధవారం ప్రకటించింది. దీంతో లీటర్ పాల ధర రూ. 38కి చేరనుంది. పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నెలసరి కార్డులను తీసుకున్న వారికి పాత ధరపై మార్చి 10 వరకే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 2న కూడా లీటర్‌పై రూ.2 పెంచిన విషయం తెలిసిందే. -
లీటర్ డీజిల్ పై 50 పైసలు పెంపు
-
లీటర్ డీజిల్ పై 50 పైసలు పెంపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: డీ జిల్ ధర మళ్లీ ఎగబాకింది. లీటరుకు 50 పైసలు పెరిగింది. స్థానిక పన్నులు, విలువ ఆధారిత పన్ను(వ్యాట్) దీనికి జతకానుండడంతో ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులుంటాయి. పెరిగిన ధర శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీలో పన్నులతో కలిపి లీటరు ధర 57 పైసలు పెరిగి 54.91కు చేరింది. హైదరాబాద్‌లో ధర 59.21 నుంచి రూ.59.82కు పెరిగింది. పెట్రోల్ ధర మాత్రం పెరగలేదు. డీజిల్ ఖరీదు గత నెల 4న 50 పైసలు పెరగడం తెలిసిందే. డీజిల్ అమ్మకాలపై నష్టాలను పూడ్చుకోవడానికి ప్రతి నెలా లీటరుపై 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో చమురు కంపెనీలు ధర పెంచుతుండడం విదితమే. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో కంపెనీలు సబ్సిడీయేతర వంటగ్యాస్(ఎల్పీజీ) సిలిండర్ ధరను రూ.107 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,241 నుంచి రూ.1,134కు తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 112.50 తగ్గి రూ. 1,215కు చేరింది. గృహేతర వినియోగ సిలిండర్ ధరలు కూడా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తగ్గాయి. గత ఏడాది జనవరి నుంచి డీజిల్ ధర పెరడగడం ఇది 13వ సారి.