పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ లీటర్కు 60 పైసలు, డీజిల్ లీటర్‌కు 50 పైసలు చొప్పున పెంచారు.
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ లీటర్కు 60 పైసలు, డీజిల్ లీటర్‌కు 50 పైసలు చొప్పున పెంచారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
డీజిల్ అమ్మకాలపై నష్టాలను పూడ్చుకోవడానికి ప్రతి నెలా లీటరుపై 50 పైసల వరకు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించడంతో చమురు కంపెనీలు ధర పెంచుతుండడం విదితమే. ఈ నెల మొదట్లో డీజిల్ ధరను లీటర్కు 50 పైసలు చొప్పున పెంచారు. అప్పట్లో పెట్రోల్ ధరలు పెంచలేదు. కాగా గత ఏడాది జనవరి నుంచి డీజిల్ ధర పెరడగడం ఇది 14వ సారి.