
పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
ముంబై: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) పెట్రోల్ ధర లీటరుకు ఒక పైస, డీజిల్ ధర 44 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో సోమవారం నుంచి ఈ ధరలు అమలు కానున్నాయి.
తాజా పెంపు ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.68.09లుగాను, కోల్‌కతాలో రూ. 70.68గాను, ముంబై రూ. 77.46గాను, చెన్నైలో రూ.71.17గాను ఉండనున్నాయి.
మరోవైపు ఇంధన ధరలు ప్రతి అర్ధరాత్రి ఐదు నగరాల్లో మారనున్నాయి. దక్షిణ భారతదేశంలో పుదుచ్చేరి, వైజాగ్, పశ్చిమాన ఉదయపూర్, తూర్పున జంషెడ్పూర్, ఉత్తరాన చండీగఢ్ ఈ అయిదు నగరాల్లో మే1 వ తేదీనుంచి రోజుకో ధర అమలు కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ధరలు ఐవోసీ ప్రకటించింది. దీని ప్రకారం పెట్రోలు, చండీగడ్‌లొ రూ.67.65, జంషెడ్‌పూర్‌లో రూ .69.33, పుదుచ్చేరిలో రూ. 66.02, ఉదయపూర్‌లో రూ. 70.57, వైజాగ్‌లో రూ.72.68 లుగా ఉండనున్నాయి
అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో నెలకొంటున్న తీవ్ర అనిశ్చితి కారణంగా రోజుకు ఒకసారి ధరలను సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు ఇటీవల నిర్ణయించాయి.
కాగా ఏప్రిల్ 16న లీటర్లు 1.39పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటరకు 1.04పైసలు పెరిగింది.