డీజిల్ ధరలు మరోసారి పాక్షికంగా పెరిగాయి. లీటర్కు 50 పైసలు చొప్పున పెంచారు.
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు మరోసారి పాక్షికంగా పెరిగాయి. లీటర్కు 50 పైసలు చొప్పున పెంచారు. శనివారం అర్ధరాత్రి నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు పెంచడమిది రెండోసారి. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. పెట్రో సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.