prime accused arrested
-
ఆ దుర్మార్గుడు దొరికాడు
సాక్షి, లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్, బదౌన్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గత ఐదురోజులుగా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు గాలింపు తరువాత ఆలయ పూజారి సత్యనారాయణ్ (50) గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించారు. ఉఘైతీ గ్రామ సమీపంలోని ఆడవిలో అతని అనుచరుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిందితుడు సత్య నారాయణ్‌ను ప్రశ్నిస్తున్నామని, వైద్య పరీక్షల అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరుస్తామని సీనియర్ ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. (ఎన్సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్) కాగా ఈ నెల 3వ తేదీ ఆదివారం సాయంత్రం స్థానిక ఆలయానికి వెళ్లిన బదౌన్కుచెందిన 50 ఏళ్ల మహిళపై ముగ్గురి వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం దారుణంగా హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తంకావడంతో యూపీ సర్కార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ( కామాంధుల క్రూరత్వానికి పరాకాష్ట.. మహిళ మృతి ) -
సంచలన రేప్ కేసులో నిందితుడి అరెస్టు
దేశమంతా విస్తుపోయేలా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని పార్క్స్ట్రీట్లో జరిగిన దారుణ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని నాలుగేళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఖాదర్ ఖాన్ అనే ఈ నిందితుడు అరెస్టయ్యాడు. అతడితో పాటు అతడి అనుచరుడు అలీఖాన్‌ను కూడా కోల్‌కతా పోలీసుల ప్రత్యేక బృందం ఢిల్లీ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టుచేసింది. ఘజియాబాద్‌లోని ఒక అపార్టుమెంటులో దాక్కుని ఉండగా వారిని పట్టుకున్నట్లు బృందంలోని ఒక అధికారి తెలిపారు. వాళ్లిద్దరినీ ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చి శనివారం నాడు కోల్‌కతా కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన బాధితురాలిపై 2012 ఫిబ్రవరి 6వ తేదీన కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను ఇంటివద్ద దింపుతామన్న ఐదుగురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కాదర్ ఖాన్ నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడిపై విశ్వసనీయ సమాచారం అందడంతో.. అతడి మొబైల్ సిగ్నళ్లను ట్రాక్ చేసి పట్టుకున్నారు. తొలుత అతడు ఢిల్లీ సమీపంలో ఉన్నట్లు సెల్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ సూచనల మేరకు ప్రత్యేక బృందం అతడి వెంట పడింది. కొన్నాళ్ల పాటు బంగ్లాదేశ్‌లో తలదాచుకున్న కాదర్.. తర్వాత నేపాల్ మీదుగా ఢిల్లీకి వచ్చాడు. అతడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడటంతో అతడి ఆనుపానులు తెలిశాయి.