breaking news
Prince Yadav
-
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్‌లో రషీద్‌కు క్యాచ్ ఇచ్చి అర్ష్‌దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్‌లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్‌మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్‌ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో శుబ్‌మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్‌లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్‌గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్‌కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్‌లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్‌ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్‌ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్‌తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్‌లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్‌కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం?
వన్డే ప్రపంచకప్-2027 సన్నాహాలను ప్రారంభించేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ ప్రిపరేషన్స్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలడపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల శనివారం ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్-అఫ్గాన్ జట్లు ధర్మశాలకు చేరుకుని తీవ్రంగా శ్రమించాయి. ఈ మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరయ్యారు. విరాట్ స్ధానంలో యశస్వి జైశ్వాల్‌ను జట్టులోకి తీసుకోగా, ఇంకా హార్దిక్ రిప్లేస్మెంట్ను ప్రకటించలేదు. అయితే తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో అంచనా వేద్దాం.భారత ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రారంభించనున్నారు. అయితే కోహ్లి లేనుందన మూడో స్ధానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. కిషన్ చివరగా అక్టోబర్ 2023లో ఇదే అఫ్గాన్‌పై భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు.కోహ్లి ప్రత్యామ్నయంగా వచ్చిన జైశ్వాల్ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జైస్వాల్ చివరిగా డిసెంబర్ 2025లో సౌతాఫ్రికాతో వన్డే ఆడాడు. జైశ్వాల్ కేవలం ఓపెనర్‌గా మాత్రమే ఆడగలడు. కాబట్టి రోహిత్‌కు విశ్రాంతి ఇస్తే తప్ప జైశూకు తుది జట్టులో చోటు దక్కదు. నాలుగో స్ధానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్ధానంలో కేఎల్ రాహుల్(వికెట్ కీపర్) బ్యాటింగ్‌కు రానున్నారు.ఆల్రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, సుందర్హార్దిక్ పాండ్యా తొడ కండరాల గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో, తెలుగు కుర్రాడు ఆల్‌రౌండర్ల కోటాలో చోటు దక్కనుంది. అతడు తన 10 ఓవర్ల కోటాను పూర్తిగా వేయాల్సి ఉంటుంది. మరో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు.ప్రిన్స్ యాదవ్ వన్డే అరంగేట్రం?ఇక ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేసర్ ప్రిన్స్ యాదవ్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ప్రిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 12 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి సెలెక్టర్లను ఆకర్షించాడు. ఈ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లు లేకపోవడంతో ప్రిన్స్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనే చెప్పాలి. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి యువ బౌలర్లతో ప్రిన్స్ బంతిని పంచుకోనున్నాడు. అతడు యార్కర్లు వేయడంలో దిట్ట.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్ -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.వన్డేల్లో మాత్రం బుమ్రా ఆడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.భారత జట్టులోకి ఆకిబ్ నబీ!ఇక దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.భారత్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలమైన దేవ్‌దత్త్ పడిక్కల్‌కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్‌ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.ప్రిన్స్‌కు పిలుపు!మరోవైపు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఢిల్లీ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ సత్తాచాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్ధానంలో ప్రిన్స్ పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట.చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు -
నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ కుర్రాడు!
అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం... క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయే తత్వం... బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలయించే సత్తా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓ అనామక బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు! అదేదో కోహ్లి తప్పిదం వల్ల వికెట్ కోల్పోయాడా అంటే ముమ్మాటికి కాదు. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతి అనూహ్యంగా దూసుకొచ్చి కోహ్లి వికెట్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే విరాట్ వికెట్ నేలకూలింది. ‘కింగ్’ కోహ్లిని బోల్తా కొట్టించిన బౌలర్ పేరే ‘ప్రిన్స్’!పట్టుమని పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా లేని ఈ ఢిల్లీ కుర్రాడు... ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. బ్యాటర్ల జోరు సాగుతున్న లీగ్‌లో పేస్ బౌలింగ్ తడాఖా చూపుతున్నాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగం... ప్రతి బంతిని అనుకున్న చోట వేయగల కచ్చితత్వం... అవసరమైతే స్లో బంతులతో బురిడీ కొట్టించగల నైపుణ్యం... వెరసి 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్లో 16 వికెట్లు తీసిన ప్రిన్స్ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ (Prince Yadav) ఐపీఎల్లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లాడిన ప్రిన్స్ 16 వికెట్లతో విజృంభించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో లక్నో జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... వారి బౌలింగ్ బృందంపై అందరి దృష్టి పడటం వెనక ప్రిన్స్ యాదవ్ ప్రతిభ దాగి ఉంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడు... గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఇతర బౌలర్లు సత్తా చాటడంతో అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ ఈ ఏడాది మాత్రం మొహమ్మద్ షమీతో కలిసి ప్రిన్స్ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు పడగొడుతూ... నిలకడ కనబరుస్తున్నాడు.మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ (Mayank Yadav) గాయాలతో సతమతమవుతున్న సమయంలో ప్రిన్స్ యాదవ్ టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సాంకేతికంగా ‘ప్లే ఆఫ్స్’ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ప్రిన్స్ తన పవర్ చూపాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి విరాట్‌ను అవుట్ చేసిన అతడు... ఆ తర్వాత మరో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. చక్కటి భాగస్వామ్యం సాగుతున్న సమయంలో పడిక్కల్‌ను రిటర్న్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన ప్రిన్స్... జితేశ్ శర్మను ఓ చక్కటి బంతితో బుట్టలో వేసుకొని బెంగళూరుకు పరాజయం రుచి చూపాడు.ఈ ఒక్క మ్యాచ్ అనే కాకుండా... తాజా సీజన్లో అతడి బౌలింగ్ ప్రభావవంతంగా సాగింది. కోహ్లిని అవుట్ చేసిన అనంతరం అతడు గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరగగా... అంత పెద్ద స్టార్ వికెట్ తీసినప్పుడు ఆ మాత్రం ఆనందం కలగడంలో తప్పేముందనే అభిప్రాయాలే ఎక్కువ వినిపించాయి. తాజా సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ప్రిన్స్... ఇదే జోరు, నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో స్టార్‌గా ఎదిగే అవకాశాలున్నాయి. అన్షుల్ అదుర్స్ టీమిండియా తరఫున ఒక టెస్టు మ్యాచ్ ఆడిన అన్షుల్ కంబోజ్ ఈ ఏడాది ఐపీఎల్లో రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టడం ద్వారా వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్ను తొలుత ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసుకుంది. అక్కడ అతడికి పెద్దగా అవకాశాలు రాకపోగా... గతేడాది వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు మూడున్నర కోట్లకు అన్షుల్‌ను సొంతం చేసుకుంది. 2025 సీజన్లో చెన్నై తరఫున 8 మ్యాచ్‌లాడిన కంబోజ్ 8 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. అయితే నిరుడు చెన్నై ప్రదర్శన నాసిరకం కావడంతో అన్షుల్‌కు కూడా ఏదీ కలిసి రాలేదు. కానీ దేశవాళీల్లో నిలకడ కొనసాగించిన అన్షుల్... ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.బ్యాటర్ల జోరు సాగిన ఆ టెస్టు మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన కంబోజ్... అవకాశం వచ్చిన ప్రతి చోట తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ప్రధాన పేసర్లు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో... చెన్నై బౌలింగ్ భారాన్ని భూజలకెత్తుకున్న అన్షుల్ చక్కటి ప్రదర్శనతో తన విలువ పెంచుకున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 18.70 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్లో బ్యాటర్ల వీర విధ్వంసం సాగుతున్న సమయంలోనూ... అన్షుల్ ఎకానమీ రేటు కూడా 9కి లోపే (8.91) ఉండటం విశేషం. వేగం కంటే... వైవిధ్యం, కచ్చితత్వంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్న 25 ఏళ్ల అన్షుల్ ఇదే జోష్ కనబరిస్తే భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు రావడం తధ్యం!పదును తగ్గలే! స్టార్ బౌలర్లే వికెట్లు పడగొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐపీఎల్లో... వెటరన్ బౌలర్లు తమ పదును తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. ఇటీవల ఐసీసీ టి20 వరల్డ్‌కప్ టోర్నిలో చక్కటి బౌలింగ్‌తో టీమిండియా వరసగా రెండోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో తేలిపోతుండగా... నాలుగేళ్లుగా టీమిండియా దరిదాపుల్లో కనిపించని భువనేశ్వర్ కుమార్ వరుస వికెట్లతో సత్తా చాటుతున్నాడు.జాతీయ జట్టు తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టి20 మ్యాచ్‌లాడిన 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్... తాజా సీజన్లో తన స్వింగ్‌తో కట్టిపడేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున 294 వికెట్లు తీసిన భువీ... ఐపీఎల్ 19వ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 17.52 సగటుతో 17 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా కేవలం 7.64 ఎకానమీతో కావడం గమనార్హం. ‘స్వింగ్ సుల్తాన్’ అనే పేరుకు న్యాయం చేస్తూ... ‘పవర్ ప్లే’లో వికెట్లు పడగొడుతున్న భువనేశ్వర్... బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన భువీ ఇంకా తనలో పదును తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్... ఈ ఘనత సాధించిన తొలి పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు ఫిట్నెస్ విషయంలోనూ ఎంతో మెరుగ్గా ఉన్న భువీ... ఐపీఎల్లో 200 మ్యాచ్‌లాడిన తొలి పేస్ బౌలర్‌గానూ నిలిచాడు.చదవండి: ఐపీఎల్లో పరుగుల వరద.. కారణం ఇదే!మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున షమీ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. చాన్నాళ్లుగా భారత జట్టుకు దూరమైన షమీ... దేశవాళీల్లో నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసే తన అలవాటు ఈ సీజన్లోనూ కొనసాగిస్తున్న షమీ... తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటుతున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తాడనే ముద్ర పడ్డ హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తాజా ఐపీఎల్లో 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. గతంతో పోలిస్తే ఎంతో నియంత్రణతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్... పొదుపైన బౌలింగ్‌తోనూ ఆకట్టుకుంటున్నాడు. అంతర్జాతీయ స్టార్లు రబాడ, ఇషాన్ మలింగ, ఆర్చర్ సైతం వికెట్ల వేటలో ముందున్నారు. సీనియర్ పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజిల్‌వుడ్ గాయాలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవడంతో వారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.–సాక్షి, క్రీడావిభాగం


