Printed cloth
-
పర్ఫెక్ట్ కాంబినేషన్.. కట్టిపడేస్తోన్న ప్రింటెడ్ లెహంగా
వేడుక ఏదైనా లెహంగా నేటికీ కొత్తగా మెరుస్తూనే ఉంది. అమ్మాయిల మనసు లెహంగా చుట్టూ అల్లుకుంటూనే ఉంది. ఎంబ్రాయిడరీతో మెరిపించినా, ప్యాచ్‌లు జత చేర్చినా పువ్వులు సింగారించినా, ప్రింట్లు సందడి చేసినా వెస్ట్రన్ టాప్ చేరాల్సిందే లెహంగా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే! మెహందీ వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టైల్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. అందుకే, ప్లెయిన్ బెల్ స్లీవ్స్ టాప్, ప్రింటెడ్ లెహంగా పర్ఫెక్ట్ కాంబినేషన్‌గా కట్టిపడేస్తోంది. ఫ్లోరల్: రంగురంగుల పువ్వులన్నీ లెహంగా డ్రెస్ మీద వచ్చి చేరినట్టు చేసిన డిజైన్ మెహిందీ వేడుకలకు మరిన్ని సొబగులను అద్దుతుతుంది. వేడుకను మరింత వైబ్రెంట్‌గా మార్చేస్తుంది. వెస్ట్రన్ కేప్‌కి ఇండియన్ స్టైల్ ఎబ్రాయిడరీతో ప్రింటెడ్ లెహంగాకు కొత్త రూపు తీసుకువచ్చి వేడుకలో హైలైట్‌గా వెలిగిపోవచ్చు అని చూపుతోంది ఈ డిజైన్. జాకెట్ స్టైల్ టాప్ కాంబినేషన్‌తో పూర్తిగా వెస్ట్రన్ లుక్ అనిపిస్తున్న లెహంగా డ్రెస్. సంప్రదాయ వేడుకలనూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తోంది. ఇండియన్ ఆర్కిటెక్చర్ థీమ్‌తో ఆకట్టుకునే డిజైన్స్ తీసుకువచ్చే పంజాబీ డిజైనర్ పరమ్సాహిబ్ రూపొందించిన లెహంగా. పూర్తి జరీ ఎంబ్రాయిడరీతో లెహంగా, వెస్ట్రన్ పెప్లమ్ టాప్‌తో జత చేసిన వేడుకలకు ఆకట్టుకునే లుక్ తీసుకువచ్చారు. -
రాబోయే వింటర్‌కి ఓ కొత్త స్వెటర్...
న్యూలుక్ చలికాలం రాబోతోంది. ఎక్కడో షెల్ఫ్‌లో అడుగున చేరిన స్వెటర్స్, స్వెట్ షర్ట్స్‌ను శుభ్రపరచాలని బయటకు తీసుంటారు. కిందటేడాది వేసుకున్నవాటిని ఇప్పుడూ ధరించాలంటే బోర్‌గా ఉంటుంది. స్వెటర్స్‌కి, స్వెట్ షర్ట్స్‌కి ఓ కొత్త లుక్ తీసుకురావాలంటే.. ఇదో మంచి ఎంపిక. ట్రై చేయండి. ముందుగా స్వెట్ షర్ట్, స్వెటర్‌కి ఉన్న లోపాలను సవరించాలి. తర్వాత రంగు వెలిసిపోవడం, ఎంత తొలగించాలి అనేవి చాక్‌స్టిక్‌తో మార్క్ చేసుకోవాలి. ఇది కూడా ఒక డిజైన్‌లాగా ఉండాలి. అప్పుడు ఎంపిక చేసుకున్న క్లాత్‌ని జత చేయడం సులువు అవుతుంది.ప్లెయిన్ స్వెట్‌షర్ట్‌కి ప్రింటెడ్ క్లాత్‌ను తీసుకొని నెక్ నుంచి నడుము వరకు నిలువు పట్టీ వేయచ్చు. అలాగే జేబు భాగం, ముంజేతుల వద్ద క్లాత్‌ను జత చేసి కుట్టాలి. గౌను అయితే బ్లౌజ్ భాగం వరకు సెటర్ వచ్చేలా కట్ చేసుకొని కుట్టాలి. కుచ్చులను వేరే కాంబినేషన్ క్లాత్ తీసుకొని కుట్టాలి. ఈ రెండింటినీ జత చేయాలి. స్వెట్ షర్ట్‌కి లేసు డి జైన్స్‌ను జత చేస్తే మరో కొత్త డిజైనర్ స్వెటర్ మీ ముందు రెడీ.స్వెట్ షర్ట్‌ను ముందు భాగంలో కత్తిరించి నెక్ భాగం అంతా మరో ప్రింటెడ్ క్లాత్ జత చేస్తే ఓవర్‌కోట్‌ని తలపించే డ్రెస్ రెడీ.స్వెటర్‌కి పూర్తి కాంట్రాస్ట్ కలర్ దారాలను ఎంచుకొని డిజైన్ మార్క్ చేసుకొని హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయాలి.. ఇలా అందమైన స్వెటర్ ఓ కొత్త లుక్‌తో ఆకట్టుకుంటుంది.పాత స్వెటర్‌ని మఫ్లర్, సాక్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, బ్యాగ్‌గా కూడా మార్చుకోవచ్చు.