printing cost
-
ఇండియన్ కరెన్సీని ముద్రించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా!
డబ్బు.. గల్లీ నుంచి ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరితో దీనితో అమితమైన సంబంధం ఉంటుంది. ఎన్ని చేతులు మారిన విలువ మారనిది డబ్బు ఒకటే. సంపాదిస్తే కానీ డబ్బు విలువ తెలీసిరాదంటారు. చాలామంది డబ్బు ద్వారానే విలువస్తుందని భావిస్తుంటారు. ఏ పని చేసినా దాని కోసమే. మనిషి జీవితాన్ని శాసించేది కూడా డబ్బే. డబ్బు సంపాదించడం కంటే దాన్ని పొదుపు చేయడం చాలా కష్టం. చూడటానికి కాగితం ముక్కే కావచ్చు కానీ ఓ వ్యక్తి జీవితాన్నే మార్చేయగలదు. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎన్నో విషయాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి.మరి అలాంటి డబ్బులను ప్రింట్ చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా.. ఒక సాధారణ కాగితానికి 10,100.. నుంచి 2000 రూపాయల విలువ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది. భారతీయ కరన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ► 2018 నాటి డేటా ప్రకారం.. 10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►20 రూపాయల నోటును ముంద్రించడానికి 1 రూపాయి ఖర్చు అవుతుంది. అంటే దీనికి 10 రూపాయల నోటు కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ► 50 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది. ►100 రూపాయల నోటును ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది. ►200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ►500 రూపాయల నోటును ముద్రించడానికి 2.57 పైసలు ఖర్చవుతుంది. ►2000 రపాయల నోటును ముద్రించడానికి 4.18 పైసలు ఖర్చు అవుతుంది. వీటితో పాటు ప్రభుత్వం రద్దు చేసిన పాత 500, 1000 రూపాయల నోట్ల ఖర్చు కూడా చూసుకుంటే.. ►పాత 500 రూపాయల నోటును ముద్రించడానికి 3.09 పైసలు ఖర్చు అవుతుంది. అంటే కొత్త 500 రూపాయల కంటే 52పైసలు అధికం. ►పాత 1000 రూపాయల నోటును ముంద్రించడానికి 3.54 పైసలు ఖర్చు అవుతుంది. అంతే కొత్త 2000 రూపాయల కంటే 64 పైసలు తక్కువ. -
కొత్త నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా 2000, మళ్లీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తోంది. అయితే.. వీటి ముద్రణకు ఎంత ఖర్చవుతుందో అనే విషయం కూడా ఆసక్తికరమే. కొత్త 500 నోటు ముద్రించాలంటే రూ. 3.09, 2వేల రూపాయల నోటు ముద్రించాలంటే రూ. 3.54 చొప్పున ఖర్చవుతుందట. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు తరఫున నోట్లు ముద్రించే భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంపీఎల్) సంస్థ తెలిపింది. ఇది రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ. ఈ సంస్థను ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు అడిగారు. దానికి సమాధానంగానే పై వివరాలను వెల్లడించింది. 500 రూపాయల నోట్లు వెయ్యి ముద్రించాలంటే మొత్తం రూ. 3090 ఖర్చవుతుందని, అదే రెండువేల నోట్లకైతే వెయ్యి నోట్లకు తాము రూ. 3540 వసూలు చేస్తామని బీఆర్బీఎన్ఎంపీఎల్ చెప్పింది. మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్‌ని రెండు నంబర్ ప్యానళ్లలోను 'ఆర్' అనే అక్షరంతో విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు సోమవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త 50 రూపాయల నోట్లను కూడా విడుదల చేస్తామని, అయితే అంతమాత్రాన పాత 50 రూపాయల నోట్లను మాత్రం రద్దు చేసేది లేదని కూడా రిజర్వు బ్యాంకు చెప్పిన విషయం తెలిసిందే.