Prisoner escaped
-
ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది
సిర్పూర్(యూ): జైలు తప్పించుకున్న ఖైదీని వెదుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ఖైదీతోపాటు గంజాయి దొరికింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఖైదీ మూడు రోజుల క్రితం పోలీసుల నుంచి తప్పించుకుని కుమ్రుంభీం జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని రాఘవాపూర్ ప్రాంతంలోని ఓ పొలం వద్ద తలదాచుకున్నాడు. ఖైదీ వద్ద ఉన్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని వెదుక్కుంటూ వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందానికి శనివారం ఓ పొలం వద్ద 20 గంజాయి మొక్కలతో పట్టుబడ్డాడు. గంజాయి మొక్కల గురించి ఖైదీని ఆరా తీయగా... ఇక్కడే తాను ఓ పొలం నుంచి వీటిని సేకరించినట్లు వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆదివారం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఖైదీనుంచి గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా... సిర్పూర్(యు) మండలంలోని మత్తూరతండా ప్రాంతంలో కూడా గంజాయి సాగవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా..అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. -
పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడి పరార్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ టౌన్ పోలీసులు ఇటీవల రాత్రి సమయంలో గస్తీ తిరుగుతుండగా మానుకోట శివారు సాలార్ తండావాసి ఇస్లావత్ మహేష్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న అతడు గురువారం మధ్యాహ్నం మూత్రవిసర్జనకని వెళ్లి మహిళల టాయిలెట్‌లోని వెంటిలేటర్ అద్దాలు పగులగొట్టి అందులో నుంచి బయటికి దూకాడు. అనంతరం పోలీస్ స్టేషన్ భవనం వెనుక వైపు నుంచి బయటికి వచ్చి పరారయ్యాడు. ఈ విషయం రాత్రి వరకు టౌన్ పోలీస్ వర్గాలు బయటకు తెలియనీయకుండా దాచిపెట్టాయి. విషయం కాస్తా ఆ నోటా ఈనోటా పడి అందరికి తెలియడంతో దావానంలా వ్యాపించింది. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల అదుపులో ఉన్న యువకుడు పరారయ్యాడనే విషయంపై టౌన్ సీఐ జబ్బార్‌ను వివరణ కోరగా అలాంటిదేమి లేదని సమాధానమిచ్చారు. పరారైన మహేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై డీఎస్పీ అంగోత్ నరేష్కుమార్ రాత్రి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన సంఘటనపై టౌన్ సీఐ జబ్బార్, ఎస్సై రమేష్‌బాబుతో మాట్లాడారు. -
సత్తుపల్లి సబ్ జైలు ఖైదీ పరారీ
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి సబ్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఊకే ఏసురాజు అనే ఖైదీ శుక్రవారం సాయంత్రం గోడదూకి తప్పించుకున్నాడు. రాత్రి వరకూ వెతికినా ఖైదీ ఆచూకీ తెలియకపోవడంతో జైలు అధికారులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దమ్మపేటకు చెందిన ఊకె ఏసురాజు పలు చోరీ కేసుల్లో నిందితుడు. రెండు నెలల నుంచి సత్తుపల్లి సబ్ జైలులో ఉన్నాడు. -
చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ఖైదీ పరార్
హైదరాబాద్ : చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నర్సింహులు(32) అనే ఖైదీ గురువారం పరారయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్నగర్ మండలం రంగంపల్లికి చెందిన నర్సింహులు ఓ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇంకో ఏడాదిలో శిక్ష పూర్తి అవుతుండగా ఇంతలోనే జైలు నుంచి పరారయ్యాడు. పోలీసులు నర్సింహులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.