
సిర్పూర్(యూ): జైలు తప్పించుకున్న ఖైదీని వెదుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ఖైదీతోపాటు గంజాయి దొరికింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఖైదీ మూడు రోజుల క్రితం పోలీసుల నుంచి తప్పించుకుని కుమ్రుంభీం జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని రాఘవాపూర్ ప్రాంతంలోని ఓ పొలం వద్ద తలదాచుకున్నాడు. ఖైదీ వద్ద ఉన్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని వెదుక్కుంటూ వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందానికి శనివారం ఓ పొలం వద్ద 20 గంజాయి మొక్కలతో పట్టుబడ్డాడు.
గంజాయి మొక్కల గురించి ఖైదీని ఆరా తీయగా... ఇక్కడే తాను ఓ పొలం నుంచి వీటిని సేకరించినట్లు వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆదివారం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఖైదీనుంచి గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా... సిర్పూర్(యు) మండలంలోని మత్తూరతండా ప్రాంతంలో కూడా గంజాయి సాగవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా..అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment