Private financial institution
-
చిట్ఫండ్ మోసగాళ్లకు శిక్ష పడాల్సిందే
సాక్షి, అమరావతి: చిట్ఫండ్ వంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు చేసే మోసాల కేసుల్లో అధికారులు సకాలంలో స్పందించి ఆర్థిక మోసగాళ్లకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో 17వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిట్ఫండ్ కంపెనీలు లేదా బ్యాంకింగ్ సేవల పేరిట ప్రజల నుంచి నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలను మోసం చేసేలా ఆయా సంస్థలు వివిధ మాధ్యమాల ద్వారా ఇస్తున్న ప్రకటనలపై నిఘా పెట్టాలన్నారు. అలాంటి ప్రకటనలను నిరంతరం పరిశీలించి చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. బ్యాంకులు, చిట్ఫండ్ కంపెనీలు, తదితర ఆరి్థక సంస్థల్లో ప్రజలు మదుపు చేసే సొమ్ముకు పూర్తి భరోసాను కలి్పంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి ఆర్థిక మోసాలను పూర్తిగా నివారించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ మాట్లాడుతూ ఆర్థిక మోసాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు ఆర్బీఐకి సహకారం అందించాలన్నారు. రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చాలి రహదారి భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎనిమిదో తరగతి నుంచి రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం సీఎస్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రహదారి భద్రత సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత పరికరాల కోసం పోలీసులకు రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రహదారి భద్రత నిధి కింద రూ.50 కోట్లను కేంద్రం ఈ ఏడాది కేటాయించిందని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. రవాణాశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రహదారి భద్రతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
ఆపత్కాలంలో బీమా భరోసా
మన ఆర్థిక అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. హఠాత్పరిణామాల వల్ల ఆదాయ మార్గాలు మూసుకుపోయినప్పుడు కుటుంబం కుదేలయ్యే ఘటనలు ప్రాంతాలకు అతీతంగా నగరాల్లోనూ, గ్రామాల్లోనూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే, ఇలాంటి రిస్కులు ఉన్నాయని తెలిసినా సరే.. చాలా మంది వాటిని ధైర్యంగా ఎదుర్కొనే సాధనాలను సమకూర్చుకోరు. వీటిని ఎదుర్కొనడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, ఇందుకోసం కొంత ప్లానింగ్, కొన్ని క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, మరికొంత క్రమశిక్షణ అవసర మవుతాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నంత కాలం ఇంట్లో ఎవరికి ఆర్థిక కష్టాలు వచ్చినా కుటుంబసభ్యులు బాసటగా నిల్చేవారు. ప్రస్తుతం న్యూక్లియర్ కుటుంబాలు పెరుగుతున్న కొద్దీ అటువంటి పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి భరోసా కల్పించేది జీవిత బీమా. ఇది కూడా ఒక్కరి కష్టాన్ని అందరూ కలిసి పంచుకునేవంటిదే. అందుకే, ప్రస్తుతం బీమా కవరేజి ప్రాముఖ్యత పెరుగుతోంది. జీవిత బీమా, వైద్య బీమాతో పాటు రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు ప్లానింగ్ ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంగొత్త పొదుపు సాధనాలు వస్తున్నప్పటికీ .. భారతీయులకు వీటిపై అంతగా అవగాహన ఉండటం లేదు. బ్యాంక్ డిపాజిట్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులకే ఇప్పటికీ ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రైవేట్ ఆర్థిక సంస్థలపై అపనమ్మకం ఇందుకు కారణం కావొచ్చు. ఇలాంటి అపోహల వల్లే వారు ఇన్వెస్ట్మెంట్ పరంగాను, భద్రతపరంగా ధీమానిచ్చే బీమా వంటి సరైన సాధనాలను ఎంపిక చేసుకోలేకపోతున్నారు. నిజానికి జీవిత బీమా కవరేజిలో రెండిందాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ కుటుంబ పెద్దకి అనుకోనిది ఏమైనా జరిగినా.. కుటుంబ సభ్యుల అవసరాలకు కావాల్సిన నిధి అందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా, అంతా సవ్యంగానే సాగితే కనీసం రిటైర్మెంట్ అవసరాలకైనా బీమా సొమ్ము ఉపయోగపడగలదు. అందుకే దీర్ఘకాలంలో ఇటు క్రమం తప్పకుండా పొదుపు, అటు చక్రవడ్డీ తరహా రాబడిలనుసాధనాల్లో బీమా ఒకటని చెప్పవచ్చు. ఇక, చివరిగా.. పాలసీలు తీసుకున్న వారిలో చాలా మంది.. తాము వీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతుంటారు. ఇది మంచిదే. కానీ ఏదో ఒక పాలసీ..ఎంతో కొంతకు తీసుకోవడం సరికాదు. జీవితంలో వివిధ దశలకు అనుగుణంగా సరిపడినంత కవరేజి ఉండేలా తీసుకుంటేనే పాలసీ ప్రయోజనాలు పొందగలమని గుర్తుంచుకోవాలి.