Private parking
-
హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్!
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పార్కింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రైవేటు వ్యక్తుల ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సదుపాయానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్య పార్కింగ్ అని, షాపింగ్ ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్‌కు అవకాశాలు పరిశీలించాలని పౌరుడొకరు మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. అందుకు స్పందిస్తూ మంత్రి దేశంలోని అన్ని నగరాల్లోనూ పార్కింగ్ సమస్య పరిష్కారం ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. నగరంలో రెండు మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవని ఇంకా చాలా అవసరమని పేర్కొన్నారు. అందుకోసం కొత్తగా రానున్న మెట్రో మార్గాల్లో విశాలమైన పార్కింగ్ ప్రదేశాలతో ‘పార్క్ అండ్ రైడ్’ పద్ధతికి ప్రయత్నిస్తామని తెలిపారు. అంతే కాకుండా ఖాళీ స్థలాలు, ఖాళీ ప్లాట్ల యజమానులు స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి తమ స్థలాలను పార్కింగ్ లాట్లుగా మార్చుకుంటే వారికి ఆదాయం కూడా లభిస్తుందని, ఈ దిశగానూ ఆలోచిస్తున్నామని తెలిపారు. I agree that providing parking solutions has been a challenge in all cities of India We are building a couple of MLPs in Hyderabad but need many many more In the newly proposed Metro routes, we will try and provision for “Park & Ride” mode with large parking areas Also had… https://t.co/YOd9dTRSSd — KTR (@KTRBRS) August 1, 2023 అప్పట్లో కొరవడిన స్పందన.. ► గతంలోనూ దాదాపు అయిదేళ్ల క్రితం నగరంలోని ఖాళీ ప్లాట్లు, స్థలాల యజమానులు వాటిని పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాలుగా మార్చుకుంటే వారికి ఆదాయంతో పాటు ప్రజలకు పార్కింగ్ సమస్యలు తగ్గుతాయని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ అందుకు పిలుపునిచ్చినా ప్రైవేటు యజమానుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దాదాపు 15 మంది మాత్రం స్పందించి, అధికారులను సంప్రదించినప్పటికీ, ఇద్దరు మాత్రం ముందుకొచ్చారు. వారిలో ఒకరికి స్థలంపై యాజమాన్య హక్కులు లేవని అధికారులు గుర్తించారు. స్థలాలపై తగిన హక్కులు లేకపోవడం.. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అదే తమ స్థలంగా చెబుతూ కొందరు ముందుకు రావడం తదితర కారణాలతో ప్రైవేట్ పార్కింగ్ సదుపాయాలపై జీహెచ్ఎంసీ శ్రద్ధ చూపలేదు. ► తాజాగా మంత్రి కేటీఆర్ మళ్లీ ఈ ఆలోచన చేయడంతో, జీహెచ్ఎంసీ తిరిగి ప్రయత్నాలు చేస్తే ఈసారైనా ఆశించిన ఫలితం కనిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. తగినన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు వినియోగంలోకి వస్తే వాటిని జియోట్యాగింగ్ చేయడంతో పాటు మొబైల్ యాప్ ద్వారా ఎన్ని వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ఉందో తెలుసుకోవడంతోపాటు అడ్వాన్సుగా కూడా పార్కింగ్ స్థలాన్ని రిజర్వు చేసుకునే సదుపాయం కూడా కల్పించవచ్చునని అప్పట్లో భావించారు. వాహనాల పార్కింగ్ ఫీజులను సైతం జీహెచ్ఎంసీయే ఖరారు చేసింది. కార్లు తదితర నాలుగుచక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 20, తర్వాత ప్రతీ గంటకు రూ.5గా నిర్ణయించారు. ద్విచక్రవాహనాలకు మొదటి రెండు గంటలకు రూ.10, తర్వాత ప్రతి రెండు గంటలకు రూ.5గా నిర్ణయించారు. -
ప్రైవేట్ పార్కింగ్లు!
సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు రానున్నాయి. నగరంలో కనీసం 100 గజాల ఖాళీ స్థలం ఉన్న వ్యక్తులెవరైనా ఆ స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్‌గా మార్చుకోవచ్చని జీహెచ్ఎంసీ తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ నుంచి వ్యాపార అనుమతులను పొందాల్సి ఉంటుంది. ముందుగా తొలి మూడు నెలలకు మాత్రమే ఈ అనుమతులు ఇస్తారు. తర్వాత వాటిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పార్కింగ్‌కు ఇచ్చిన స్థలాలను జియో ట్యాగింగ్ చేస్తారు. ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసే బోర్డులో ఫీజుల వివరాలు ఉంటాయి. నిర్ణీత ఫీజుకంటే అధికంగా వసూలు చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు అధికారుల ఫోన్ నంబర్లను కూడా అందులో పేర్కొంటారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, ఇతరత్రా భూముల్లో మాత్రం పార్కింగ్ ఏర్పాట్లకు అనుమతులివ్వరు. తమ స్థలాలను పార్కింగ్‌కు ఇవ్వాలనుకునేవారు 99495 46622, 040–21 11 11 11 నంబర్లకు ఫోన్ లేదా ్చఛ్ఛిట్ట్చ్ట్ఛటజిౌuటజీnజఃజఝ్చజీ .ఛిౌఝ కు మెయిల్‌చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు. పార్కింగ్ ఫీజులు ఇలా ⇒ కార్లు, తదితర 4 చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు:రూ.20 ⇒ ఆ తర్వాత ప్రతి గంటకు :రూ.5 ⇒ బైక్‌లు, తదితర ద్విచక్ర వాహనాలకు మొదటి రెండు గంటలకు: రూ.10 ⇒ ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు: రూ.5 యాప్ ద్వారా రిజర్వేషన్ ప్రైవేట్ పార్కింగ్‌కు అనుమతించిన ప్రదేశాలు, తదితర వివరాలతో ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనున్నారు.ఈ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ కూడా చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. మలిదశలో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే లారీలు, టిప్పర్లు, తదితర వాహనాలకు రాత్రివేళల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దందాగా మారే అవకాశం? పార్కింగ్ దందాతో అక్రమాలు పెరిగిపోవడంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న 54 పార్కింగ్ స్లాట్లలో ఉచిత పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. త్వరలో అందుబాటులోకి రానున్న ప్రైవేట్ పార్కింగ్ ప్రదేశాలతో తిరిగి పార్కింగ్ దందాలుగా మారకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే అవి కూడా అక్రమార్కుల కేంద్రాలుగా మారే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మాల్ మాయ!
కళ్యాణలక్ష్మి ప్రైవేట్ పార్కింగ్ ఇష్టారాజ్యంగా నాలా ఆక్రమణ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు వరంగల్ :రాష్ర్ట ప్రభుత్వం వరంగల్ నగర అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. విశాలమైన రహదారులను ఏర్పాటు చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే నివాసగృహాలను, కట్టడాలను కూల్చి వేస్తోంది. సాధారణ ప్రజల విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తున్న నగరపాలక సంస్థ అధికారులు.. కొందరి విషయంలో నిబంధనలు పక్కన బెడుతున్నారు. రహదారుల విస్తరణ కోసం ప్రైవేటు స్థలాల్లోని కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు.. ప్రముఖులు, ప్రముఖ సంస్థలు పార్కింగ్ పేరిట రోడ్లను ఆక్రమించినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. హన్మకొండ నగరంలోని వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే బస్‌స్టేషన్ రోడ్డులో కళ్యాణలక్ష్మీ షాపింగ్ మాల్ ఏకంగా ప్రభుత్వ నాలాపైనే స్లాబ్ వేసి వాహనాలను పార్కింగ్ చేస్తోంది. విమర్శలను పక్కన బెట్టి స్లాబ్ వేసేందుకు అనుమతి ఇచ్చిన అధికారులు.. అక్రమ పార్కింగ్ విషయంలోనూ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రహదారిని, నాలాను కబ్జా చేసి అక్రమంగా పెయిడ్ పార్కింగ్‌కు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపు కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ ఉంది. నిబంధనల ప్రకారం కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ సెల్లార్లో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉండాలి. ఇవేవి లేకుండానే షాపింగ్‌మాల్ నడుస్తోంది. ఈ మాల్‌కు వచ్చే వారి వాహనాలను పార్కింగ్ చేసేందుకు స్థలం లేదు. వరంగల్ నగరపాలక సంస్థ అధికారుల సహకారంతో షాపింగ్‌మాల్ నిర్వాహకులు ఏకంగా ప్రధాన రహదారిని కబ్జా చేశారు. సామాజిక సేవ ముసుగులో నాలాపై స్లాబ్ వేసి భారీ వాహనాలను నిలిపేలా పార్కింగ్ జోన్‌గా మార్చారు. స్లాబ్ వేసిన స్థలం తమదేనని ఇప్పుడు దబాయిస్తున్నారు. కేవలం తమ షాపింగ్ మాల్‌కు వచ్చేవారు మాత్రమే అక్కడ వాహనాలు నిలపాలని బెదిరిస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలం కదా అని ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డు కావడం, షాపింగ్ మాల్ వాహనాలు దీనికి తోడుకావడంతో సాయంత్రం సమయాల్లో ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు బాగా ఉంటున్నాయి. పోలీసు ఎస్కార్టు వాహనతో వెళ్తే జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఇది తెలియడంలేదని.. నగర అభివృద్ధి అంటే ఇదేనా అని వాహనదారులు విసుగ్గుకుంటున్నారు. పదేపదే అలాగే.. కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రారంభమైన కొత్తలోనూ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాలాను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అక్రమ నిర్మాణం చేపట్టారు. అప్పటి వరంగల్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రాహుల్‌బొజ్జా కఠినంగా వ్యవహరించి కూల్చి వేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. పార్కింగ్ కోసం సెల్లార్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూసుకోవాలని కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చారు. రెండు నెలల క్రితం కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ మళ్లీ ఇదే పని చేసింది. పలువురు అప్పటి కలెక్టర్ జి.కిషన్‌కు ఫిర్యాదు చేశారు. అప్పుడు నిర్మాణం ఆగింది. తర్వాత షాపింగ్ మాల్ కథ మార్చింది. కార్పొరేషన్‌లోని ఓ అధికారి సహకారంతో.. సామాజిక సేవ(ఫండ్ యువర్ సిటీ) పేరుతో నాలాపై నిర్మాణం చేపట్టింది. షాపింగ్ మాల్ సమీపంలోని ప్రజల అభిప్రాయంతో సంబంధంలేకుండానే అప్పటి కమిషనర్ స్లాబ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. స్లాబ్ వేసి ఊరుకోకుండా ఇప్పుడు అక్రమంగా పార్కింగ్ కోసం వినియోగిస్తోంది. ‘‘వరంగల్ నగరంలో ప్రస్తుతం ఎక్కడా పెయిడ్ పార్కింగ్‌కు అనుమతి లేదు. డ్రెరుునేజీపై స్లాబ్ నిర్మాణం ఎలా ఉన్నా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు పార్కింగ్ కోసం వినియోగించడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - సర్ఫరాజ్ అహ్మద్, వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్