Private Polytechnic College
-
గందరగోళంలో తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్ : మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుమును ఒకేసారి చెల్లించాలని తెలంగాణ సాంకేతిక విద్యామండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తిరస్కరించడంతో తెలంగాణ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో గందరగోళం నెలకొంది. మంగళవారమే కౌన్సిలింగ్ ఉండడంతో విద్యార్థులు అందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 187 కాలేజీల్లో 162 కాలేజీలకు మాత్రమే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. కాగా ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన 162 కళాశాలలో 100పైగా కాలేజీలకు తెలంగాణ సాంకేతిక విద్యామండలి అనుమతి నిరాకరించింది. చదవండి : ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలపై సర్కార్ కొరడా ప్రతీ కాలేజీలో ఉన్న సీట్ల అన్నింటికి మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుమును ఒకేసారి చెల్లించాలని సాంకేతిక విద్యామండలి తేల్చిచెప్పింది. సాంకేతిక విద్యామండలి చేసిన ప్రతిపాదనను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి మూడేళ్ల అనుబంధ గుర్తింపు ఫీజు చెల్లించమనడం సరికాదన్నారు. దీంతో తెలంగాణ సాంకేతిక విద్యామండలి మూడేళ్ల సంబంధించిన గుర్తుంపు రుసుము చెల్లించాల్సిందే అంటూ 100కు పైగా కాలేజీలకు అనుబంధ గుర్తింపును తిరస్కరించింది. విద్యామండలి విధించిన నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. మంగళవారం నుంచే కౌన్సిలింగ్ ఉండటం తో గుర్తింపు వస్తుందా లేదా, కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా అన్న టెన్షన్ లో అటు విద్యార్థులకు, ఇటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి నెలకొంది. -
ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలపై సర్కార్ కొరడా
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ఫెనాల్టీ విధిస్తోంది. రాష్ట్రంలో 150 కాలేజీలపై చర్యలకు ప్రభుత్వం సిద్దమైంది. హాజరుకాని ఫ్యాకల్టీల నుండి జీతాలు రికవరీ చేసి బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఒక్కో కాలేజ్ కి లక్షల్లో జమ చేయాలని నోటీసులు జారీ చేసింది. వెంటనే స్పందించకపోతే 2019-20 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు ఇవ్వమని ఎస్బీ టెట్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్ కళాశాలల యజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌ని కలిసి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. -
పాలీసెట్ ప్రశాంతం
97 శాతం మంది హాజరు నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు సిటీబ్యూరో: ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గురువారం నిర్వహించిన పాలీసెట్-2016 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జంట నగరాల్లో 30,444 మందికి గాను 30,010 (97 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 65 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభ సమయం ఉదయం 11 గంటలకు ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ముందే చెప్పినా... పలుచోట్ల అభ్యర్థులు ఆలస్యంగా వెళ్లారు. ఫలితంగా వారిని అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతూ ఇంటి దారి పట్టారు. నిరాశ.. కంటోన్మెంట్: నిమిషం ఆలస్యం నిబంధన ఓ విద్యార్థి పరీక్ష రాసే అవకాశం కోల్పోయేలా చేసింది. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్షా కేంద్రానికి అఖిల్ అనే విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. అఖిల్ ఎంత వేడుకున్నా నిబంధనలకు విరుద్ధంగా తాము పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. -
నయవంచకుడు
చెన్నై, సాక్షి ప్రతినిధి: అందంతో అమ్మాయిలకు ఎరవేయడం, ప్రేమ పేరుతో వంచించడం, మత్తుమందిచ్చి లోబరుచుకోవడం అతని వృత్తి, ప్రవృత్తి. పాపం బట్టబయలు కావడంతో జైలుపాలయ్యాడు. సహకరించిన నేరానికి తల్లి, బంధువు కూడా కటకటాల వెనక్కు వెళ్లిపోయారు. నిందితుని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. దిండుగల్లు మాసిలమణిపురం శ్రీనగర్‌కు చెందినపొన్‌సిబీ (21) ప్లస్‌టూ పాసై, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు. తన తల్లి నెల ఖర్చుకు పంపే రూ.50వేలతో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే పొన్‌సిబీ కాలేజీకి వెళ్లకుండా మోటార్ బైక్‌లో అమ్మాయిల వెంట జులాయిగా తిరిగేవాడు. మధురై జిల్లా ఆనయూర్ ముడకత్తాన్ రోడ్డుకు చెందిన బీకాం పట్టభద్రురాలైన రెజినా (24) దిండుగల్లులోని తన అక్క ఇంటికి తరచూ వస్తూండేది. ఈ క్రమంలో నిందితుడు ప్రేమిస్తున్నానంటూ ఆ యువతి వెంటపడ్డాడు. కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్లేడుతో చేయి కోసుకున్నాడు. మనసు కరిగిన రెజినా అతనిపై ప్రేమను పెంచుకుంది. కాబోయే భార్యను తల్లికి పరిచయం చేస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందిచ్చి స్పృహకోల్పోయిన తరువాత అత్యాచారం చేసి అశ్లీల చిత్రాలను చిత్రీకరించాడు. స్పృహవచ్చిన తరువాత రెజినా నిలదీయగా పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చాడు. తాను తీసిన ఫొటోలను స్నేహితులతో పంచుకున్నాడు. కొన్నాళ్ల తరువాత మరోసారి ఇంటికి రమ్మని పిలవడంతో ఆ యువతి నిరాకరించింది. అంతేగాక పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి పెంచింది. దీంతో స్నేహితుల సమక్షంలో గత ఏడాది మే 30 వ తేదీన గుళ్లో పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. కుమారుని పెళ్లి సంగతి తెలుసుకున్న తల్లి హేమమాలిని రెజినాను గెంటివేయాలని చెప్పింది. దీంతో ఆమెకు వేధింపులు మొదలయ్యూయి. మూడునెలల గర్భిణిపై భర్త పొన్‌సిబీ క్రికెట్ బ్యాట్‌తో దాడిచేయడంతో ఆమెకు గర్భస్రావమైంది. 17 సవర్ల బంగారు నగలు, రూ.20వేల నగదును ఆమె నుంచి లాక్కున్నారు. ప్రాణాపాయం తప్పదని గ్రహించిన రెజీనా స్థానిక పోలీసులను అశ్రయించింది. నిందితునికి రాజకీయ పలుకుబడి ఉండడంతో ఫిర్యాదు స్వీకరించలేదు. జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో ఈనెల 13వ తేదీన మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. సంగతి తెలుసుకున్న నిందితులు పరారై కరూర్ రైల్వేస్టేషన్లో పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పొన్‌సిబీతోపాటూ సహకరించిన తల్లి హేమమాలిని, రాజా అనే బంధువును అరెస్ట్ చేశారు. అమ్మకానికి అమ్మాయిల చిత్రాలు అరెస్టయిన నిందితుడి నుంచి సేకరించిన వివరాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. చూడ్డానికి కొంత అందంగా కనిపించే పొన్‌సిబీ పాఠశాల, కళాశాల విద్యార్థినుల వెంటబ డి యథాప్రకారం లోబర్చుకునేవాడు. స్పృహకోల్పోయిన స్థితిలో ఉన్న అమ్మాయిలపై అత్యాచారం చేసి, వాటిని చూపి బెదిరించేవాడు. ఇలా ఇతని చేతిలో 27 మంది యువతులు బలయ్యూరు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని భయపడి మిన్నకుండిపోయారు. దీనిని అవకాశంగా తీసుకున్న పొన్‌సిబీ మరింత రెచ్చిపోయాడు. నిందితుడిని పెళ్లి వరకూ తీసుకొచ్చిన రెజినా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బట్టబయలైంది.