private railway
-
రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్ సంస్థలకే..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ సంస్థలు దేశంలో రైల్వే సేవలను ప్రారంభించిన తర్వాత ప్రయాణీకులను ఛార్జీలను నిర్ణయించడానికి ప్రైవేట్ వ్యక్తులకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అయితే అదే మార్గాల్లో ఎయిర్ కండిషన్డ్ బస్సులు, విమానాలు ఆయా మార్గాల్లో నడుస్తాయి. ఛార్జీలను నిర్ణయించే ముందు వారు వీటన్నింటినీ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో రాజకీయంగా రైల్వే ఛార్జీలు సున్నితమైన అంశంగా ఉంటాయి. ఇక్కడ రైళ్లు ప్రతిరోజూ ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకువెళుతున్నాయి. దేశంలో కొంత మంది రవాణా కోసం విస్తృతమైన నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటారు. (2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు) దశాబ్దాల నిర్లక్ష్యం, అసమర్థ బ్యూరోక్రసీ ఈ నెట్‌వర్క్‌ను చుట్టుముట్టింది. పీఎం మోడీ పరిపాలన స్టేషన్లను ఆధునికీకరించడం నుంచి ఆపరేటింగ్ రైళ్ల వరకు ప్రతిదానిలో పాల్గొనమని ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది' అని వీకే యాదవ్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టులపై ఆల్స్టోమ్ ఎస్ఐ, బొంబార్డియర్ ఇంక్, జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తున్న సంస్థలలో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులపై 7.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా. 2023 నాటికి జపాన్ సాయంతో దేశంలో తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని ధృడ సంకల్పంతో ఉన్న మోదీకి రైల్వేలను ఆధునికీకరించడం చాలా ముఖ్యం. అయితే.. దేశంలో ప్రైవేట్ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి 151 ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. 151 ప్రైవేట్ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. -
ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి
న్యూఢిల్లీ : ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా లిమిటెడ్, బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇండియా లిమిటెడ్, సిమెన్స్ లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ కంపెనీలు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లలో, 109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు మొదలైన సన్నాహాల్లో భాగంగా మొదటి దశగా భావించే ప్రీ–అప్లికేషన్ సమావేశానికి ఆసక్తి చూపుతున్న ఈ కంపెనీలు హాజరైనట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ సమావేశంలో కంపెనీలు క్లస్టర్ల ఆవశ్యత, అర్హత ప్రమాణాలు, బిడ్డింగ్ ప్రక్రియ, రైళ్ల సేకరణ, ఛార్జీలు, కార్యకలాపాలు నిర్వహణ, రైళ్ల సమయం, రాకపోకలు వంటి అనేక ప్రశ్నలను రైల్వేశాఖ ముందుంచారు. రైల్వే, నీతిఆయోగ్ అధికారులు ఈ ప్రశ్నలకు వివరణలు ఇచ్చినట్లు జాతీయ రవాణశాఖ తెలిపింది. -
భారత్‌లో ఏకైక ప్రైవేట్ రైల్వే ‘శకుంతల’
మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ సంస్కృత నాటకం గురించి, అందులోని శకుంతల పాత్ర గురించి బహూశ భారతీయులందరికీ తెలిసే ఉంటుంది. కానీ శకుంతల పేరిట ఓ రైల్వే లైనుందని, అది భారతీయ రైల్వేలో భాగం కాదని, ఆ రైల్వే లైన్‌పై శకుంతల ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పటికీ నడుస్తోందని, అది ఓ బ్రిటిష్ కంపెనీకి సొంతమని ఎంతమందికి తెలుసో తెలియదు. బ్రిటిష్ పాలకుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని బ్రేక్ చేసి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ శకుంతల రైల్వేలైన్‌ను కూడా భారతీయ రైల్వేలో కలిపేందుకు చర్యలు తీసుకుంటే బాగుండేదేమో. మహారాష్ట్రలోని ముర్తాజాపూర్, యవత్మల్ మధ్య 190 కిలోమీటరు దూరం మధ్య శకుంతల ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ నడుస్తోంది. ఈ రైలు గ్రామీణ ప్రాంతాలకు జీవనాధారం. కిల్లిక్ నిక్సన్ అనే బ్రిటిష్ కంపెనీ భారత్‌లోని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంతో కలసి 1910లో ‘సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే లైన్ కంపెనీ’ (సీపీఆర్ఎల్)ని ఏర్పాటు చేసి విదర్భ నుంచి పత్తిని రవాణా చేసేందుకు శకుంతల రైల్వే లైన్‌ను ఏర్పాటుచేసింది. 1916 నుంచి ఈ లైన్‌పై పత్తి రవాణాకు రైళ్లు నడిచాయి. ఆ తర్వాత ప్రయాణికుల రైళ్లు నడిచాయి. ఆ తర్వాత భారతీయ రైల్వే లైన్‌కు ఈ లైన్ అనుసంధానమైంది. దీంతో అప్పటి సెంట్రల్ ఇండియా ఆధ్వర్యంలోని గ్రేట్ ఇండియాలోని పెనిన్సులార్ రైల్వే (జీఐపీఆర్)కు చెందిన పలు రైళ్లు కూడా ఈ రైల్వేలైన్ మీదుగా నడిచేవి. దేశ స్వాతంత్య్రం అనంతరం 1952లో భారత ప్రభుత్వం జీఐపీఆర్ సహా దేశంలోని అన్ని రైల్వేలైన్లను జాతీయం చేసింది. ఒక్క కిల్లిక్ నిక్సన్ కంపెనీ ఆధ్వర్యంలోని సీపీఆర్ మాత్రం అలా కాలేదు. ఈ కంపెనీని జాతీయం చేయకుండా ఎందుకు భారత ప్రభుత్వం మరచిపోయిందో తెలియదు. ఆ తర్వాత కిల్లిక్ నిక్సన్ కంపెనీ బ్రిటన్ నుంచి భారత్‌కు తరలివచ్చినా దానినుంచి శకుంతల రైల్వేలైన్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత్ ఎందుకు ప్రయత్నించలేదో కూడా అర్థం కాదు. భారతీయ రైల్వే ఈ ప్రైవేటు శకుంతల రైల్వే లైన్‌ను వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లిస్తూ వస్తోంది. పదేళ్లకోసారి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తోంది. అలా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆరుసార్లు ఒప్పందాన్ని పునరుద్ధరించింది. ఈ లైన్‌పై 1921లో మాంచెస్టర్‌లో తయారైన ఇంజన్‌తో శకుంతల ఎక్స్‌ప్రెస్ నడిచేది. దీన్ని 1994, ఏప్రిల్ 15వ తేదీన పాత ఇంజన్‌ను తీసేసి డీజిల్ ఇంజన్‌ను ఏర్పాటుచేశారు. న్యారోలైన్పై నడిచే ఈ రైలు ప్రయాణికులు ఎక్కడుంటే అక్కడ ఆగి వారిని ఎక్కించుకుంటుంది. టిక్కెట్ ధర కూడా భారతీయ రైళ్లకన్నా ఎంతో చౌక. అందుకని ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు ఈ రైలు ఎక్కేందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఈ న్యారో రైల్వేలైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చాలని గత బడ్జెట్లోనే రైల్వేశాఖ ప్రతిపాదించింది. అది పూర్తయితే శకుంతల ఎక్స్‌ప్రెస్ కూడా బ్రాడ్‌గేజ్‌కు మారుతుందా, ఈ లోగా భారతీయ రైల్వేలో విలీనం అవుతుందా.. చూడాలి!