privet school teacher
-
సున్నా విద్యార్థులున్న స్కూల్స్126
నల్లగొండ : ఒకనాడు చదువులకు నిలయాలుగా ఉన్న సర్కారు పాఠశాలలు నేడు ఆదరణ కోల్పోయి మూత పడే పరిస్థితికి వచ్చాయి. నిత్యం విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు కరువై కళావిహీనంగా మారుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టడం, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనల ప్రభావం తెలుగుమీడియం సర్కారు బడులపై పడుతోంది. జిల్లాల్లో చాలా పాఠశాలలు ఇప్పటికే మూత పడిపోగా ఈ సంవత్సరం కూడా మరికొన్నింటికి తాళం వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1 నుంచి 10వ తరగతి వరకు 1,483 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాల్లో బోధన సాగుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడంలేదు. కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు జిల్లా, డివిజన్. మండల కేంద్రాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. ఆయా గ్రామాలకు స్కూళ్లకు సంబంధించిన బస్సులను కూడా పంపిస్తున్నారు. దీంతో వ్యవసాయదారులతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో కూలి చేసుకునే వారు కూడా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేర్పిస్తూ వస్తున్నారు. దీంతో కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై పక్క పాఠశాలలకు పంపిన సంఘటనలు ఉన్నాయి. గురుకులాల వైపు మొగ్గు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు కేజీ టు పీజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ప్రవేశపెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఆయా వర్గాల వారితోపాటు ఓసీల్లోని పేదలు కూడా గురుకులాల్లోనే చేరుతున్నారు. ఒక్కో విద్యార్థిపై తెలంగాణ ప్రభుత్వం రూ.1.20లక్షల పై చిలుకే ఖర్చు చేస్తుంది. మంచి పోషకాహారంతోపాటు నాణ్యమైన విద్యను కూడా ఆంగ్లంలోనే అందిస్తుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంతా గురుకుల పాఠశాలల్లో చేరారు. దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంతంత మాత్రంగా కొనసాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా మూతపడిపోతున్నాయి. తిరిగి కొనసాగిస్తామంటున్న అధికారులు జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అం దులో 126 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ పాఠశాలలన్నీ మూతపడుతుండగా 10 మందిలోపు ఉన్న పాఠశాలలు 97 ఉన్నా యి. 20 మంది పిల్లల లోపు ఉన్నటువంటి యూ పీఎస్ పాఠశాలలు 88 ఉన్నాయి. ఈ పాఠశాలల ను ఆయా గ్రామ సమీప పాఠశాలల్లో విలీనం చే సేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ వివరించారు. పిల్లలు లే ని పాఠశాలలను పూర్తిగా మూసివేయడం జరగద ని, తిరిగి పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు తక్కువ విద్యార్థులున్న పాఠశాలలనుంచి పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ. 600 చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలల్లో పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం ప్రస్తుతం జిల్లాలో 126 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. ఆ పాఠశాలల్లో తిరిగి విద్యార్థులు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం. ఎప్పుడు విద్యార్థులు వచ్చినా పాఠశాలలు కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. పక్క గ్రామాల పాఠశాలలకు పంపిస్తే వారికి ప్రభుత్వమే ప్రతినెలా రూ.600 రవాణా ఖర్చులను చెల్లిస్తుంది. – డీఈఓ సరోజినీదేవి -
తప్పని భారం!
కొత్తకోట: జూన్ మాసం వచ్చిందంటే తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేసి వెళ్తుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నెల కావడంతో మామూలు రోజులకంటే సామాన్యులకు ఖర్చులు రెట్టింపవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 మండలాల పరిధిలో మొత్తం 852 పాఠశాలలు ఉండగా ఇందులో ఉన్నత పాఠశాలలు 101 , ప్రాథమికోన్నత పాఠశాలలు 58 , ప్రాథమిక పాఠశాలలు 61, కేజీబీవీలు 15, మోడల్ స్కూళ్లు 3, రెసిడెన్సియల్ స్కూళ్లు 13, మూడు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 55,644 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తమ పాఠశాలల్లో అడ్మిషన్లు పరిమితంగా ఉన్నాయంటూ విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మభ్య పెడుతున్నారు. టెక్నో, ఈ–టెక్నో, మోడల్, డీజీ స్కూల్ అనే వివిధ రకాల తోక పేర్లతో తల్లిదండ్రులను ఆకర్షితులను చేస్తున్నారు. పాఠశాలల్లో సాధించే ర్యాంకులు, ఉత్తమ మార్కులను వివిధ మాద్యమాల్లో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారు. ఏ పాఠశాలలో చేర్పించాలి? ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చేస్తున్న ప్రచారం చూసి తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందో తేల్చుకోలేక తల్లిదండ్రులు తికమక పడుతున్నారు. కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు తాము నియమించుకున్న పీఆర్ఓల ద్వారా అడ్మిషన్లు పెంచుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మాయమాటలు నమ్మి డొనేషన్లు ఇచ్చిన తల్లిదండ్రులను అయోమయానికి గురవుతున్నారు. అడ్మిషన్లు పెంచుకునేందుకు ఇతర పాఠశాలలపై కుట్రలు చేసేందుకు సైతం వెనకాడడం లేదు. ఇప్పటికే తల్లిదండ్రుల సెల్ నంబర్లను సేకరించిన యజమాన్యాలు అడ్మిషన్ల కోసం తరచూ ఫోన్లకు మేసేజ్‌లు చేయడంతోపాటు తరచూ ఫోన్లు చేస్తూ విసుగెత్తిస్తున్నారు. ఏటేటా పెరిగిపోతున్న భారం ఏటేటా ఫీజుల భారం భారీగా పెరుగుతూనే ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజులను మరింతగా పెంచేసి తల్లిదండ్రులు ఆలోచించే సమయం కూడా లేకుండా ప్రవేశాలు ఇచ్చేస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకే రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు ఫీజలు లాగుతున్నారు. దాంతోపాటు అడ్మిషన్ ఫీజు, బస్సు ఫీజులు, స్పెషల్ ఫీజులను ఇష్టారాజ్యాంగా పెంచేస్తున్నారు. దీనికితోడు పాఠశాలల్లోనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రేట్లు పెరిగిపోయాయి. అధికారుల కళ్లముందే ఈ తతంగమంతా జరుగుతున్నా విద్యా హక్కు చట్టం నిబంధనలు పాటించకపోయినా పట్టించుకోకపోగా ఫీజుల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణను చేపట్టాల్సి ఉండగా ఏ పాఠశాలలో అలాంటి చర్యలు కనిపించడం లేదు. నామ్కేవాస్తెగా బడిబాట ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం యేటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. అయినా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. ఎన్నో కోట్ల రూపాయాలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడం లేదు. విద్యాశాఖా«ధికారులు ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ నివేదికలు జిల్లాలో డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతుందుని స్పష్టం చేసిన అధికారులకు కనువిప్పు కలగడంలేదు. -
సబ్జెక్టు చెప్పేవారేరీ ?
ఒంగోలు టౌన్: గత ఏడాది సాధించిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు అనేక మంది తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సమయంలో సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే మోకాలొడ్డింది. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేసేలా వ్యవహరించింది. ఎంతో ఆశతో తమ పిల్లలను ప్రభుత్వ రెండు నెలలు దాటడంతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే అవకాశం లేక విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం సందిగ్ధంలో పడేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల షార్ట్, పాఠ్య పుస్తకాలు లేట్‌గా రావడంతో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులకే అసలైన పరీక్షా కాలం వచ్చినట్లయింది. మరికొన్ని రోజుల్లో సమ్మెటివ్–1 పరీక్షలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సగం సిలబస్‌తో ఆ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు సమ్మెటివ్–1కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం విశేషం. డీఎస్సీ డ్రామా.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులన్నీ భర్తీ చేస్తానంటూ నిరుద్యోగ అభ్యర్థులకు వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. డీఎస్సీకి సంబంధిత మంత్రితో ప్రకటన చేయించడం, నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఏదో ఒక కొర్రీ వేసి దానికి బ్రేక్‌లు వేయడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది డీఈడీ, బీఈడీ అభ్యర్థులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు ఏడాదికేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, ల్యాంగ్వేజి పండిట్, పీఈటీలకు సంబంధించి మొత్తం 12,655 పోస్టులు ఉన్నాయి. వీటిలో 810కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 291 పోస్టులు, హిందీ సబ్జెక్టులో 220 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీలకు సంబంధించి తెలుగు సబ్జెక్టులో 184 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సోషల్ స్టడీస్‌లో 37 పోస్టులు, బయోలాజికల్ సైన్స్‌లో 21 పోస్టులు, మ్యాథ్స్‌కు 14 పోస్టులు, ఇంగ్లిష్‌కు 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పదుల సంఖ్యలో ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయలు ఉద్యోగ విరమణ చేశారు. దాంతో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు భారం పడింది. ప్రహసనంగా పాఠ్య పుస్తకాలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రహసనంగా మారింది. ఏటా వేసవి సెలవుల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించి జిల్లాలోని డిపోలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏనాడూ సకాలంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించిన దాఖలాలు లేవు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభించిన రెండున్నర నెలల తరువాతే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందించగలిగారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 4 లక్షల 68 వేల మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 56,541 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 2 లక్షల 18 వేల 128 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు 18 లక్షల 42 వేల 462 పాఠ్య పుస్తకాలు అవసరం అవుతాయని జిల్లా విద్యాశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గత ఏడాదికి సంబంధించి లక్షా 39 వేల 596 పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రింటర్ల నుంచి జిల్లాకు 16 లక్షల 74 వేల 200 పాఠ్య పుస్తకాలను జిల్లాలోని డిపోకు తరలించారు. ప్రైవేట్, కాన్వెంట్ స్కూల్స్‌లోని విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభించిన వారంలోపు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలతో తరగతులకు హాజరై పాఠాలు నేర్చుకుంటుంటే, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మాత్రం పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు వచ్చేసరికి రెండున్నర నెలలు పట్టింది. దీంతో కొన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులు వెనుకబడిపోయారు. ఇది వచ్చే మార్జిన్లో జరిగే పరీక్షలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ‘యాప్’సోపాలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ‘యాప్’సోపాలు పడుతున్నారు. ప్రతి దానికి ఓ యాప్ పెట్టి దాని ద్వారానే కార్యకలాపాలు తెలియజేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అనేక మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం కంటే యాప్‌లకు సమాధానాలు చెప్పే సరికే పాఠశాల సమయం ముగిసిపోతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు ప్రతిదానికి ఒక యాప్ పెట్టడంతో ఉపాధ్యాయులు ఎక్కువ సమయం యాప్‌ల ద్వారా వివరాలు పంపించడానికే సరిపోతోంది. ప్రతిరోజూ పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య, ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారో ఆ వివరాలను యాప్ ద్వారా అధికారులకు పంపించాలి. స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ విద్యాలయ యాప్‌లకు వివరాలు అందించాలి. యూనిఫారాలు అందించే ప్రతిసారీ విద్యార్థి బయోమెట్రిక్ తీసుకొని ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షల ఫలితాలు యాప్‌లో నమోదు చేయాలి. విద్యార్థుల స్కాలర్షిప్, గ్రీన్ కోర్ కమిటీల వివరాలు, మొక్కలకు జియోట్యాగింగ్ యాప్ ద్వారా పంపాలి. సిగ్నల్ సమస్య తలెత్తితే అది కలిసే వరకు ఉపాధ్యాయులు సిగ్నల్ కోసం చూస్తుండటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం తగ్గిపోతోంది. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల కంటే సెల్ఫోన్లు చూసుకునేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఒకవైపు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు యాప్‌ల గోలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కుంటుపడుతోంది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు కూడా అంగీకరిస్తుండటం గమనార్హం. -
నాలుగేళ్ల చిన్నారిపై టీచర్ ప్రతాపం!
ఎల్లారెడ్డి: అమ్మ ఒడి నుంచి బుడిబుడి అడుగులు వేస్తూ బడికి వచ్చే చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అమ్మ ఒడిలాగా చదువుల గుడి అయిన బడి కూడా భద్రంగా ఉంటుందన్న భరోసా.. లోకం తెలియని ఆ చిన్నారులకివ్వాల్సి ఉంటుంది. కానీ ఓ ప్రైవేటు పాఠశాల టీచర్ అల్లరి చేస్తున్నాడన్న నెపంతో నాలుగేళ్ల చిన్నారిపై ప్రతాపం చూపించాడు. వంటిపై వాతలు వచ్చేలా చితకబాదాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం జరిగింది. స్థానిక బ్రిలియంట్ మోడల్ స్కూల్లో శ్రీనిధికేతన్ ఎల్కేజీ చదువుతున్నాడు. శనివారం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన శ్రీనిధికేతన్ వంటిపై వాతలు ఉండడంతో.. తల్లి తులసి స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులను నిలదీసింది. అయితే, స్కూల్లో ఎవరూ కొట్టలేదని.. బయట ఆడుకుంటున్నప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని వారు చెప్పారు. దీంతో చిన్నారిని ఆస్పత్రికి వెళ్లగా.. ఇవి కర్రతో కొట్టిన దెబ్బలేనని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ నక్క గంగాధర్, ఎంపీటీసీ సభ్యుడు షెఖావత్, ఎంఈవో వెంకటేశం బాలుడి ఇంటికి వెళ్లి దెబ్బలు పరిశీలించారు. వారు సైతం పాఠశాల ప్రతినిధులను అడిగినా.. అదే సమాధానం చెప్తున్నారు.