Probationary IAS
-
సబ్‌కలెక్టర్లుగా 12 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు
సాక్షి, అమరావతి : 2018 బ్యాచ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్‌కలెక్టర్లుగా నియమిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కడప సబ్‌కలెక్టర్‌గా పృథ్వీతేజ్, నూజివీడు సబ్‌కలెక్టర్‌గా ప్రతిస్త, అమలాపురం సబ్‌కలెక్టర్‌గా హిమాన్షు, కందుకూరు సబ్‌కలెక్టర్‌గా భార్గవ్‌తేజ, పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా విధేకర్, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌గా మౌర్య, నరసరావుపేట సబ్‌కలెక్టర్‌గా అజయ్‌కుమార్, రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా అంజలి, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా ధనుంజయ్, మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా జాహ్నవి, నంద్యాల సబ్‌కలెక్టర్‌గా కల్పన, రాజంపేట సబ్‌కలెక్టర్‌గా కేతన్, చిత్తూరు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎంఎస్ మురళి ఉన్నారు. -
ఏపీకి 10 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు
హైదరాబాద్: శిక్షణలో ఉన్న(ప్రొబేషనరీ) 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు 10 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన ఈ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇటీవల కేటాయించింది. అద్వైత్ కుమార్‌సింగ్‌ను శ్రీకాకుళం, హిమాన్షు శుక్లాను విశాఖపట్నం, శశాంకను తూర్పుగోదావరి, పి.రవి సుభాష్‌ను పశ్చిమగోదావరి, ఎస్.ఎస్. మోహన్‌ను ప్రకాశం, శ్రుతి ఓజాను చిత్తూరు, ఎల్. శివశంకర్‌ను గుంటూరు, సృజనను కృష్ణా, విజయను అనంతపురం, లక్ష్మీప్రియను కర్నూలు సహాయ కలెక్టర్లు(శిక్షణ)గా నియమించారు.