హైదరాబాద్: శిక్షణలో ఉన్న(ప్రొబేషనరీ) 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు 10 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించిన ఈ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇటీవల కేటాయించింది.
అద్వైత్ కుమార్‌సింగ్‌ను శ్రీకాకుళం, హిమాన్షు శుక్లాను విశాఖపట్నం, శశాంకను తూర్పుగోదావరి, పి.రవి సుభాష్‌ను పశ్చిమగోదావరి, ఎస్.ఎస్. మోహన్‌ను ప్రకాశం, శ్రుతి ఓజాను చిత్తూరు, ఎల్. శివశంకర్‌ను గుంటూరు, సృజనను కృష్ణా, విజయను అనంతపురం, లక్ష్మీప్రియను కర్నూలు సహాయ కలెక్టర్లు(శిక్షణ)గా నియమించారు.
ఏపీకి 10 మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌లు
Published Mon, Jun 16 2014 8:33 PM | Last Updated on Sat, Jun 2 2018 7:19 PM
Advertisement
Advertisement