తెలుగు 'పద్మాలు' వీరే..
హైదరాబాద్/ న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి పద్మ పురస్కారాలను కేంద్రం బుధవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణకు ఆరు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. చింతకింది మల్లేశం (చేనేత రంగం), మహ్మద్ అబ్దుల్ వాహిద్ (వైద్య రంగం), చంద్రకాంత్ పితావా (సైన్స్ అండ్ టెక్నాలజీ), వనజీవి రామయ్య (సామాజిక సేవ), మోహన్ రెడ్డి వెంకట్రామ బోదనపు (పారిశ్రామిక రంగం) లకు పద్మశ్రీ వచ్చింది. ఏపీ నుంచి త్రిపురనేని హనుమాన్ చౌదరి, వి. కోటేశ్వరమ్మ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
1. ప్రొఫెసర్ డా. ఎక్కా యాదగిరి రావు (శిల్పకళ), తెలంగాణ
అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కులో ఉన్న 1969నాటి తెలంగాణ అమర వీరుల తాగ్యాలకు గుర్తుగా ఉన్న స్థూపాన్ని ఈయన రూపొందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ‘బంగారు తెలంగాణ సాధిద్దాం’ నినాదంతో వీణను వాయుస్తున్న సంగీత కళాకారిణి శిల్పాన్ని రూపొందించారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో శిల్పకళల డిపార్ట్మెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు.
2. దరిపల్లి రామయ్య(సామాజిక సేవ), తెలంగాణ
కోటి మొక్కలు నాటిన వనజీవి దరిపల్లి రామయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య(వనజీవి రామయ్య) ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి. 1995లో కేంద్రం నుంచి వనసేవా అవార్డు అందుకున్నారు.
3. చింతకింది మల్లేశం(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), తెలంగాణ
చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనుగొన్నందుకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన చింతకింది మల్లేశం ఓ చేనేత కార్మికుడు. 2000ల సంవత్సరంలో కేవలం గంటల్లోనే చీర నేసే యంత్రం కనిపెట్టారు. 2011లో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. 2011లో ఈ యంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు రావడం విశేషం.
4. త్రిపురనేని హనుమాన్ చౌదరి (సివిల్ సర్వీస్), ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా ఈయన వ్యవహరించారు.
5. వి. కోటేశ్వరమ్మ (సాహిత్యం మరియు విద్య), ఆంధ్రప్రదేశ్
విజయవాడలో మాంటిసోరి మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. మహిళల విద్యకు ఎన్నో ఎళ్ల నుంచి ఎంతో విశేష సేవ చేశారు.
6. డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్(మెడిసిన్), తెలంగాణ
7. చంద్రకాంత్ పితావ(సైన్స్ అండ్ ఇంజినీరింగ్), తెలంగాణ
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్‌గా, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి రిటైరయ్యారు. బార్క్ ట్రాంబే, ముంబై, ఈసీఐఎల్ హైదరాబాద్‌లో సేవలు అందించారు.
8. మోహన్‌రెడ్డి వెంకటరామ బోదనపు(వాణిజ్యం, పరిశ్రమలు), తెలంగాణ