Professional Education
-
పిడికెడు మెతుకులు...గుప్పెడు అక్షరాలు.
మానవ సేవ కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే. సాటి మానవునికి చేతనైన సేవ చేయడం దివ్యత్వానికి చేరువ కావడమే. గుంటూరులోని శారదా పీఠం చేస్తున్న సేవ చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వారిలో సంచారజాతి బాలలు ఉన్నారు. నిమ్నవర్గాల స్త్రీలు ఉన్నారు. విద్య, వృత్తివిద్య అందిస్తూ ఇక్కడ సాగుతున్న సేవ ప్రశంసనీయమైనది. గుంటూరు నగరంపాలెంలోని విశాలమైన జిల్లాపరిషత్ ప్రాంగణంలో ప్రశాంతంగా కనిపించే ‘శారదాపీఠం’లో సాగుతున్న మానవసేవ ప్రశంసనీయమైనది. సంచారజాతుల పిల్లలను చేరదీసి, వారికి విద్యాబుద్ధులు చెప్పడం ఒక పని. పేదబాలికలకు స్కూల్ నడపడం మరో పని. పేద వర్గాల మహిళలకు, యువతులకు స్వయంసమృద్ధి కోసం వృత్తి విద్యలు నేర్పడం మరో పని. ఇన్ని పనులు శారదామఠం కార్యదర్శి భవానీ ప్రాణ మాతాజీ ఆధ్వార్యంలో దాదాపు 15 ఇరవై మంది మాతాజీలు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో, అంకితభావంతో, ఆధ్యాత్మికసేవగా ఎంచి చేస్తున్నారు. శ్రీశారదామఠం అంటే? సంపూర్ణ సాధికార ఆధ్యాత్మిక సంస్థ ఒకటి స్త్రీలకు స్థాపించాలి అన్న స్వామి వివేకానంద స్వప్నానికి రూపమే శ్రీ శారదామఠం. కలకత్తాలోని దక్షిణేశ్వరం ముఖ్యకేంద్రంగా దేశ విదేశాల్లో 40 ఉపసంస్థలతో జాతి, కులమతాలకు అతీతంగా ఈ మఠం సేవలందిస్తోంది. శ్రీరామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదామాత జయంతి సందర్భంగా 1954లో దక్షిణేశ్వరంలో స్థాపించబడిన ఈ సంస్థ బాలిక, యువతి, స్త్రీ అభ్యున్నతికి విశేష సేవలందిస్తుంన్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం గుంటూరులోనే శ్రీశారదామఠం ఉంది. 2001లో నెలకొల్పిన ఈ మఠం గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా పని చేస్తోంది. శ్రీరామకృష్ణ శారదా విద్యాలయం ఈ మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ ఇది. విశాలమైన ప్రాంగణంలో 350 మంది పేద, మధ్యతరగతి విద్యార్థినులకు విలువలతో కూడిన విద్య అందిస్తున్నారు. వీరిలో 150 మంది విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, భోజన వసతితో సహా ఉచిత విద్యను అందిస్తున్నారు. మిగిలిన వారివద్ద నామమాత్రపు ఫీజులే వసూలు చేస్తున్నారు. పాఠశాలను పూర్తిస్థాయి ఉచిత విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చే స్తున్నారు. వివేకా విహార్ ఇది వీధి బాలల కోసం, సంచార తెగల బాలల కోసం ప్రత్యేకంగా నిర్వహించే స్కూల్. గతంలో మఠ ప్రాంగణం చుట్టుపక్కల సంచార కుటుంబాలు చెట్ల కింద నివసించేవారు. తోలుబొమ్మలాట కళాకారులైన వీరు అనంతర కాలంలో ఆ కళకు ఆదరణ తగ్గడంతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకపడ్డారు. యాచకవృత్తి, చెత్త సేకరించి విక్రయించుకోవడం తదితర పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి మఠంలోని మాతాజీలు ఎంత ప్రయత్నించినా వారి తల్లిదండ్రులు సహకరించలేదు. చివరకు పెద్దలకు నచ్చచెప్పి వారి పిల్లలకు మఠంలో వివేకా విహార్ అనియత విద్యాకేంద్రం ప్రారంభించారు. వివిధ వయస్సుల్లో ఉన్న 30 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు వారికి చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస æశిక్షణ ఇచ్చారు. మఠంలోని పిల్లలు 5వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువులకోసం విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్ పాఠశాలలను సంప్రదించి అక్కడ ఉచితంగా విద్య అభ్యసించేలా చేర్పించారు. ఇది కాకుండా ‘శిశు వికాస్’ పేరుతో పాఠశాల అనంతరం పేద విద్యార్దినీ విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్, యోగాసనాలు, సంగీతం, నృత్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. నివేదిత వృత్తి విద్యా కేంద్రం మహిళలలో ఆర్థికస్వాలంబన తీసుకువచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ధ్యేయంగా వృత్తివిద్యాకేంద్రం పనిచేస్తోంది. ఈ కేంద్రం ద్వారా రోజుకు 200 మంది మహిళలు, యువతులకు ఎంబ్రాయిడరి, రంగుల అద్దకం, బ్యాగుల తయారి, కంప్యూటర్లలో బ్యాచ్‌ల వారీగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పేదమహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించడంతోపాటు శిక్షణ పూర్తయిన వారికి పలు సంస్థలను సంప్రదించి ఉద్యోగాల కల్పనలోనూ కీలకపాత్ర పోషిస్తున్నది శారదామఠం. ఇక ప్రతిరోజూ మఠంలోని మందిరంలో పూజలు, భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆదివారాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాలు మఠకార్యక్రమాల్లో ఒక భాగం. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ ఫోటోలు: మిరియాల వీరాంజనేయులు ►తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబానికి చెందిన మేము ఆ కళకు ఆదరణ లేకపోవడంతో సోఫాలు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాము. మఠ మాతాజీ 6 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి మా పిల్లలకు చదువు చెప్పించమని చెప్పడంతో మా ఇద్దరు పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్చాము. నెలకు ఒకసారి పాఠశాలకు వచ్చి పిల్లల్ని చూసుకుని వెళతాము. ఈ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన మా అబ్బాయిని విజయవాడలోని హీల్ సంస్థలో పై చదువులు చదివిస్తున్నాం. మా పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం చూపిన మాతాజీలకు జీవితాంతం రుణపడి ఉంటాం. – వనపర్తి బాలాజి, మీనాక్షి దంపతులు, నరసరావుపేట మండలం, ఎక్కల వారిపాలెం ►2008 సంవత్సరంలో మఠంలో కుట్టు, ఎంబ్రాయిడరి, బ్యాగులు తయారి శిక్షణ పొందాను. కొన్ని సంవత్సరాలుగా నేను ఇంటివద్ద మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ షాపు నిర్వహిస్తున్నాను. గతంలో కూలి పనులకు వెళ్ళే నేను, నా భర్త ఈ ఆదాయం కారణంగా పిల్లలు ఇద్దర్ని మంచి కళాశాలలో ఉన్నత చదువులు చదివిస్తున్నాం. – టి.పరమగీత, గుంటూరు రూరల్ మండలం, దాసరిపాలెం ►ప్రపంచంలో ఎవరూ పరాయివారు కారు. అందరు నీవారే అన్న దివ్యజనని శ్రీ శారదాదే బోధనల స్ఫూర్తితో మఠాన్ని నిర్వహిస్తున్నాము. ఈ భావం అందరిలో వ్యాప్తి కావాలన్నదేమా ఆకాంక్ష. ఇందుకోసం అంకితభావంతో పని చేస్తున్నాము. – భవాని ప్రాణ మాతాజీ, మఠ కార్యదర్శి -
న్యాకు వద్దు!
స్మార్ట్ ఫోన్.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చింది.ఎన్నో ఉపయోగాలను మోసుకొచ్చింది.కానీ ఇప్పుడు అనర్థాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.యువత దానికి బానిసై అందమైన భవిష్యత్తును అంధకారంగా చేసుకుంటోంది. తాజాగా ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)’పరిశీలనలోనూ ఇదే తేలింది. భవన నిర్మాణ రంగానికి అవసరమైన అన్ని రకాల విభాగాల్లో అద్భుత శిక్షణ ఇచ్చే సంస్థగా న్యాక్‌కు పేరుంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. భూటాన్, నేపాల్‌లాంటి చిన్న దేశాలు న్యాక్‌తో ఒప్పందం చేసుకుంటుండగా, మధ్య ఆసియా దేశాలు అది ఇచ్చే సర్టిఫికెట్లకు ఎంతో ప్రాధాన్యమిస్తూ, అందులో శిక్షణ పొందిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడి యువత మాత్రం దానిపై అంతగా దృష్టి సారించట్లేదు. పదో తరగతి, అంతకంటే తక్కువ స్థాయిలోనే చదువు మానేసిన వారు గతంలో వృత్తి విద్యల్లో శిక్షణకు ఎంతో ఆసక్తి చూపే వారు. కానీ గత నాలుగైదేళ్లుగా యువత ఆలోచనలో మార్పు వచ్చింది. ఫోన్ ప్రపంచంలో మునిగితేలుతున్న వారు న్యాక్ అంటే బాబోయ్ అంటున్నారు. ప్రపంచం న్యాక్ వైపు చూస్తుంటే, స్థానిక యువత వద్దనుకుంటోంది. మన పురోగతికి గొడ్డలిపెట్టుగా మారిన సామాజిక సమస్యలో ఇది మరో కోణం అని చెప్పుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్ కష్టపడటమా..? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం భవన నిర్మాణ రంగం ఉజ్వలంగా ఉంది. భవన నిర్మాణంలో భాగమైన ప్లంబింగ్, కార్పెంటరీ, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, సీలింగ్, వైరింగ్, సైట్ ల్యాండ్ సర్వే, సైట్ సూపర్వైజింగ్, పెయింటింగ్.. ఇలాంటి విభాగాల్లో ఉపాధికి విస్తృత అవకాశాలున్నాయి. కానీ ఇవన్నీ శ్రమతో కూడుకున్న పనులు. స్మార్ట్‌ఫోన్‌లో ముగిని తేలుతున్నవారు శ్రమతో కూడుకున్న పనులంటే దూరంగా ఉంటున్నారని తేలింది. ఆ పనుల్లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాల్సి రావటం, పని చేస్తూ ఫోన్ వినియోగం సాధ్యం కాకపోవటం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విశేషాలను చూస్తూ ‘నేనేంటి కష్టపడే పని చేయటమేంటి’అనే భావనకు రావడం తదితర కారణాలతో ఇలాంటి ఉద్యోగాలకు యువత దూరమవుతోందని న్యాక్ తాజాగా గుర్తించింది. స్పందన కరువు.. న్యాక్‌కు భవన నిర్మాణ రంగంలోని వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చే టాప్ సంస్థగా పేరుంది. 1998లో ప్రారంభమైన న్యాక్.. యువత నుంచి ఆదరణ పెరుగుతుండటంతో తన శాఖల సంఖ్య పెంచుకోవాలని నిర్ణయించింది. తొలుత మాదాపూర్‌లో ప్రధాన కేంద్రం ఉండేది. ఇక్కడ రెసిడెన్షియల్ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉంది. శిక్షణ కోసం దరఖాస్తుల సంఖ్య పెరుగుతుండటంతో జగిత్యాలలో రెండో రెసిడెన్షియల్ కేంద్రాన్ని, పాతజిల్లా కేంద్రాల్లో సాధారణ శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. రెసిడెన్షియల్‌కు కేంద్రాలకు సంబంధించి రెండు చోట్లా కలిపి శిక్షణ కాలానికి 600 మందిని ఎంపిక చేసుకునే వీలుంది. గతంలో అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చేవి. కానీ ప్రస్తుతం అతి కష్టమ్మీద 400 మంది వరకే చేరుతున్నారు. - రాష్ట్రవ్యాప్తంగా డీఆర్డీఏలాంటి సంస్థలు చిరుద్యోగాలకు సంబంధించి జాబ్ మేళాలు నిర్వహిస్తుంటాయి. వీటిల్లో న్యాక్ కూడా పాల్గొంటోంది. కానీ అక్కడికి వచ్చే యువత న్యాక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. కేటరింగ్ సంస్థలు, రిటేల్స్, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రుల్లో బాయ్స్ వంటి ఉద్యోగాలకే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో న్యాక్‌కు ఐదారుకు మించి రిజిస్ట్రేషన్స్ రావటం లేదు. - శిక్షణ లేకుండా వ్యక్తుల వద్ద పని నేర్చుకుని భవన నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం గల్ఫ్‌కు వెళ్లే తెలంగాణ యువతకు అక్కడ చుక్కెదురవుతోంది. శిక్షణ సర్టిఫికెట్లు లేవన్న కారణంతో అసలు పని కాకుండా కూలీ పని ఇస్తున్నారు. చివరకు అది వెట్టిచాకిరీకి దారి తీస్తోంది. - మాల్స్, దుకాణాలు, ఆసుపత్రి బాయ్స్.. ఇలాంటి వాటిల్లో నెలకు 10, 12 వేల వరకు ఇస్తారు. కానీ న్యాక్‌లో శిక్షణ పొందిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిపితే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చిన శిక్షణార్థులను ఎంపిక చేసుకుంటాయి. వాటిల్లో జీతాలు నెలకు రూ.30 వేల వరకు ఉంటున్నాయి. అయితే దీన్ని కాదని తక్కువ జీతమొచ్చే బాయ్స్ ఉద్యోగాలకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు పదో తరగతి, ఆ స్థాయిలో చదువు మానేసిన వారు న్యాక్‌లో చేరితే మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. కానీ శ్రమ ఉంటుందని ఇలాంటి మంచి ఉద్యోగాలు వద్దనుకుంటున్నారు. జీతం తక్కువైనా చిల్లర ఉద్యోగాలనే ఇష్టపడుతున్నారు. ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. వారిలో మార్పు కోసం యత్నిస్తున్నాం -
వృత్తివిద్యకు పెద్దపీట!
నేడు ఢిల్లీలో విద్యాశాఖ మంత్రుల సమావేశం సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో కేంద్రం రూపొందిస్తున్న నూతన విద్యావిధానంలో వృత్తివిద్యకు పెద్దపీట వేయబోతోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశాన్ని నిర్విహ స్తోంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య హాజరుకానున్నారు. రాష్ట్రంలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో వృత్తివిద్యను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేంద్రం రూపొందించిన నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్) ప్రకారం 9వ తరగతి నుంచే వృత్తి విద్యను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ అంశంతోపాటు ఎలిమెంటరీ విద్యలో నైపుణ్యాల పెంపు, పాఠశాల పరీక్ష విధానాల్లో సంస్కరణలు, ఉపాధ్యాయ విద్య పునర్వ్యవస్థీకరణ, పిల్లల ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం సమావేశం తీసుకోనుంది. -
సారూ.. సర్టిఫికెట్!
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ రాకపోవడంతో వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసిన వేలాదిమంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు మెలిక పెడుతున్నాయి. ఫీజులు చెల్లించే శక్తిలేక విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. రీరుుంబర్స్‌మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు విధించిన నిబంధనలు సైతం హడలెత్తిస్తున్నాయి. * ఫీజులకు, పట్టాలకు లంకె * విడుదల కాని రీయింబర్స్మెంట్ నిధులు * వృత్తి విద్యా కోర్సులు పూర్తయినా విద్యార్థులకు దక్కని ఫలితం * రూ.కోట్లలో బకాయిలు యూనివర్సిటీ క్యాంపస్: జిల్లాలో వృత్తివిద్యా, సంప్రదాయ కోర్సులు పూర్తిచేసిన వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కోర్సు పూర్తి చేసినా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఫలితం దక్కడం లేదు. జిల్లాలో 32 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అన్ని కళాశాలలు బీటెక్ కోర్సులు అందిస్తున్నాయి. 20 కళాశాలలు ఎంటెక్ కోర్సులు అందిస్తున్నాయి. 25 ఫార్మసీ, 20 నర్సింగ్, 42 డిగ్రీ, 35 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. మూడు మెడికల్ కళాశాలలున్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఏటా కోర్సు పూర్తిచేసి బయటకు వెళ్లేవారి సంఖ్య 30వేలకు పైమాటే. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. ఫీజు చెల్లించలేని కారణంగా ఏ ఒక్కవిద్యార్థీ ఉన్నత చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోగలిగారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శీతకన్ను వేశారు. అరకొర నిధులను మాత్రమే విడుదల చేస్తున్నారు. తద్వారా విద్యార్థులు కోర్సులు పూర్తి చేసినా ఫలితం దక్కడం లేదు. కోర్సు పూర్తయినా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో, ఫీజులు చెల్లిస్తే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమంటూ కళాశాలల యాజమాన్యాలు కచ్చితం గా వ్యవహరిస్తున్నారుు. ఫీజులు చెల్లించే శక్తిలేక విద్యార్థులు తీవ్ర ఆవేదన, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మహిళా వర్సిటీకే రూ.2 కోట్ల బకాయిలు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలకు 2013-14 విద్యాసంవత్సరానికి రూ.1.8 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. అలాగే 2010-11లో ఏ ఒక్కరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఎస్వీయూనివర్సిటీలో సుమారు 50 శాతం మందికిపైగా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. కొందరికి వచ్చినా పూర్తి శాతం రాలేదు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, పద్మావతి మహిళా డిగ్రీకళాశాలల్లో నూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకే 1.8 కోట్ల నిధులు అందాలి. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సంబంధించి బకాయిలు ఏ మాత్రం ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ని‘బంధన’లు కఠినతరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రెన్యూవల్ చేసుకోడానికి 2014-15 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 10వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్న నిబంధన పెట్టారు. దరఖాస్తు చేయాలంటే పదిరకాల డాక్యుమెంట్లు జతపరచాలని మడ త పేచీ పెట్టారు. దరఖాస్తు నమూనాతోపాటు, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, తల్లిదండ్రుల ఆధార్‌కార్డు, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, జూన్ 2 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలను జత పరచాలని నిబంధన విధించారు. దీంతో విద్యార్థులు హడలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలను విడుదల చేయాల ని కోరుతున్నారు.