Professional Educationcourse
-
సెట్స్ కన్వీనర్లు ఖరారు
పకడ్బందీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ: పాపిరెడ్డి ఆన్లైన్లో పీజీఈసెట్,ఈసెట్‌ల నిర్వహణ ఒకే యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీసెట్ డిగ్రీ ప్రవేశాల్లో లోపాలు,వాటి పరిష్కారంపై కమిటీ కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షల తేదీలను ఇప్పటికే ఖరారు చేసినా.. వాటిని నిర్వహించే సమయాన్ని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వివరాలను వెల్లడించారు. ఎంసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ యాదయ్య, ఈసెట్‌కు ప్రొఫెసర్ గోవర్దన్, పీఈసెట్‌కు ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, ఐసెట్‌కు ప్రొఫెసర్ కె.ఓంప్రకాష్, లాసెట్, పీజీలాసెట్లకు ప్రొఫెసర్ ఎంవీ రంగారావు, పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ సయిదా సమీన్ ఫాతిమాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక 2016 ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ అంశంపై కోర్టులో కేసు ఉందని, అందువల్ల 2017 ఎడ్‌సెట్ కన్వీనర్‌పై ప్రభుత్వ స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక పీజీఈసెట్, ఈసెట్‌లను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పీజీలో ప్రవేశాలకు కామన్ సెట్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలను (పీజీసెట్) నిర్వహిస్తున్నాయి. ఇకపై ఒక సబ్జెక్టుకు ప్రవేశపరీక్షను ఒక వర్సిటీ ఆధ్వర్యం లోనే నిర్వహించాలని నిర్ణయించామని పాపిరెడ్డి తెలిపారు. కొన్ని సబ్జెక్టులకు ఉస్మానియా వర్సిటీ, మరికొన్ని సబ్జెక్టులకు కాకతీయ వర్సిటీ పీజీసెట్ నిర్వహిస్తాయన్నారు. ఆయా వర్సిటీల ఆధ్వర్యంలోనే ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు రాష్ట్రం లోని ఏ యూనివర్సిటీలోనైనా ప్రవేశం కోసం ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని.. ఆప్షన్లు, ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. కొత్త డిగ్రీ కాలేజీలు ఇచ్చేది లేదు వచ్చే విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మంజూరు చేసేది లేదని పాపిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష నుంచి లక్షన్నర వరకు సీట్లు మిగిలిపోతున్న నేపథ్యంలో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని భావిస్తున్నామన్నారు. అయితే ఒకటీ రెండు కోర్సులు, బ్రాంచీలు మాత్రమే ఉన్న కాలేజీలు అదనపు బ్రాంచీల కోసం దరఖాస్తు చేసుకున్నాయని.. వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో లోపాలు, ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజుల విధానంపైనా దృష్టి పెడతామని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంలోనూ ప్రభుత్వం ఒకే యాక్ట్ ఉండేలా చర్యలు చేపట్టిందని, అది పూర్తయితే రాష్ట్రంలో తేవడం మరింత సులభం అవుతుందని పేర్కొన్నారు. ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాల తరువాత వర్సిటీల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
దశలవారీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
♦ మొదట పీజీ ఈసెట్,ఈసెట్ ఆన్లైన్ పరీక్షలు ♦ ఉన్నత విద్యా మండలి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)ను దశలవారీగా ఆన్లైన్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో పీజీ ఈసెట్, ఈసెట్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ చాన్స్లర్ల సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం పీజీ ఈసెట్, ఈసెట్ ఆన్లైన్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించాలని నిర్ణయించారు. వాటి ఫలితాలను చూశాక ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఆన్లైన్లో డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనం ఖర్చుతో కూడుకున్నదని, ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించారు. పీజీలో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కొన్ని సబ్జెక్టులను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, మరికొన్ని సబ్జెక్టులకు కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయే సబ్జెక్టుల్లో ఎవరెవరు ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న అంశాలను తేల్చేందుకు రెండు యూనివర్సిటీల వీసీల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో సమస్యలు తలెత్తకుండా 2017–18 విద్యా సంవత్సరంలో పక్కా చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రతి యూనివర్సిటీలో హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేయడంతోపాటు ఒక కోఆర్డినేటర్‌ను నియమించాలని నిర్ణయించారు. గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతి యూనివర్సిటీలో నోడల్ ఆఫీసర్‌ను నియమించి ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. -
అన్నీ పాత ఫీజులే
- ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంటెక్, ఎంఫార్మసీ, లా ఫీజులు ఖరారు - 2013-2015 నాటి ఫీజులే 2016 నుంచి 2018-19 వరకు అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్ మినహా మిగతా సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు గతంలో అమలు చేసిన ఫీజులనే కొనసాగిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఈడీ, లా, ఫార్మ్-డీ, ఎం-ఆర్క్, ఎం-ప్లానింగ్ కోర్సులన్నింటికి పాత ఫీజుల ఆధారంగానే ప్రవేశాలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14, 2014-15, 2015-16 విద్యా సం వత్సరాల్లో ఆయా కోర్సులకు వివిధ కాలేజీల్లో ఎంత ఫీజు ఉందో, వచ్చే మూడేళ్లపాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) దానినే అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రవేశాల కమిటీ లు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపునకు రంగం సిద్ధం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఫీజు విషయంలో ఉపశమనం లభిం చింది. ప్రభుత్వంపైనా ఫీజు రీయింబర్స్మెంట్ భారం భారీగా తగ్గనుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) నాలుగైదు నెలలపాటు కాలేజీల యాజమాన్యాలతో పలు దఫాలు చర్చించి, కాలేజీల ఆదాయ వ్యయాలనుబట్టి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వామోదం కోసం పంపింది. ఈ ప్రతిపాదనలను 3 నెలలుగా పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం పాత ఫీజుల విధానాన్నే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించింది. ఇన్నాళ్లూ ఫీజుల జీవోలు రాకపోవడం వల్ల ఆయా కోర్సుల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. కొత్త కాలేజీలకు కనీస ఫీజు... ఈసారి కొత్తగా ప్రవేశాలకు అనుమతి, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలకు కనీస ఫీజునే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టే అటువంటి కాలేజీల న్నింటినీ ఆయా కోర్సులకు సంబంధించిన కనీస ఫీజునే తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాత, కొత్త కాలేజీల్లో కనీస, గరిష్ట ఫీజులకు అదనంగా స్పెషల్ ఫీజులు ఉ న్నాయి (ఉదాహరణకు బీఈడీలో రూ. 3 వేల స్పెషల్ ఫీజు). కోర్సునుబట్టి స్పెషల్ ఫీజుకు గతంలో నిర్ణయించిన దానినే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్సైట్లలో పొందొచ్చు. 2016-17 నుంచి 2018-19 వరకు ఫీజులివీ... నోట్: ఎంటెక్కు సంబంధించి యూనివర్సిటీ కాలేజీల్లో ఫీజు రూ. 30 వేలుగా ఉంది. ఎంఫార్మసీ కోర్సుకు ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా ఫీజును నిర్ణయించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఫార్మసీ ఫీజు రూ. 30 వేలుగా ఉంది.