prohibition law
-
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: సీఎం
పట్నా: మద్యనిషేద చట్టాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నరన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చట్టంలో కొన్నిసవరణలు చేయనున్నామని పేర్కొన్నారు. ‘ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్’ సందర్భంగా మంగళవారం పట్నాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యనిషేధ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చట్టంలో మరిన్ని సవరణలు చేయనున్నామని తెలిపారు. ‘మద్య నిషేధం వల్ల ప్రభుత్వం ఏడాదికి 5000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుందని, అయినప్పకి ప్రజల క్షేమం కోసం నిషేధ చట్టాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మద్యనిషేధ నిర్ణయంతో రాష్ట్రంలోని పలు గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు. ‘ఈ చట్టాన్ని తేవడం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతుందని కొంతమంది నాకు సూచించారు అయినప్పకి నేను తగ్గలేదు. నిషేధం తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. నిషేధనంతరం ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రూ.10,000 అధిక ఆదాయం సమకూరుంది. ఇది ప్రభుత్వం, ప్రజలు సాధించిన విజయమ’ని నితీష్ పేర్కొన్నారు. కాగా, నిషేధం కారణంగా మరణించిన వారి గురించి మాట్లాడుతూ.. వారు మందుకు బానిసలై చనిపోయాన్నారు. రోజూ మద్యం సేవించడం వల్ల వారి ఊపరితిత్తులు, కిడ్నీలు పాడై చనిపోయారన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు మద్యానికి దూరమైన తర్వాత గ్రామాలు అభివృద్ధి దిశగా సాగుతున్నాయన్నారు. మద్యానికి పెట్టే డబ్బులను ఇతర మార్గాలలో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యనిషేధ చట్టాన్ని కొంతమంది దుర్వినియోగపరుస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. హోం శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు సూచనల మేరకు చట్టంలో కొన్ని మార్పులు చేయనున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని సవరణలు చేసి మద్యనిషేధ చట్టాన్ని కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 2016 నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉండగా, ఆపై ఏడాది పాటు మత్తుకు బానిసలైన వారు తీవ్ర ఇబ్బందులు, మానసిక రుగ్మతలతో బాధపడినా, ఆపై మారారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు మద్యానికి దూరమైన తరువాత అభివృద్ధి దిశగా సాగుతున్నారు. మద్యానికి పెట్టే డబ్బును ఇతర మార్గాల్లో ఖర్చు చేస్తున్నారు. పాలు, మజ్జిగ, పెరుగు వంటి అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. -
విదేశీయులకు కిక్కిచ్చి స్థానికులను జైలుకి..
ఆరు దశాబ్దాలుగా మద్య నిషేధ చట్టాన్ని అమలు చేస్తున్న గుజరాత్ రాష్ట్రం ఆ నిషేధ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. మద్యం నిషేధ చట్టాలను కఠినతరం చేసేందుకు తాజాగా గుజరాత్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను కూడా ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ కింద ఎవరైనా స్థానికులు లిక్కర్ బాటిళ్లతో దొరికినా, అమ్మినట్టు తెలిసినా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు సిద్ధమైంది. అయితే ఈ కఠినమైన నిబంధనలు కేవలం స్థానికులకు మాత్రమేనట. విదేశీయులకు, సందర్శకులకు మాత్రం ఫుల్ కిక్కిచ్చేలా ఆల్కాహాల్‌ను అందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ను ప్రస్తుతం గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతమున్న నిషేధ చట్టంలో ఆల్కాహాల్ అమ్మినా, కొనుగోలు చేసినా కేవలం మూడేళ్ల జైలు శిక్ష విధించేవారు. ఆల్కాహాల్ సేవించి ఏదైనా గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తే వారికి ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షపడేది. కానీ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి మరింత కఠినంగా శిక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విజయ్ రూపాణి ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. ఓబీసీలు, పటేదార్లు రెండు కమ్యూనిటీ డిమాండ్ల నేపథ్యంలో తలమునకలవుతున్న అధికార పార్టీ ఎన్నికల్లో నెగ్గేందుకు ఎలాగైనా పట్టుసాధించాలని దృష్టిసారిస్తోంది. మహిళల ఓట్లు తమ బ్యాలెట్‌లోనే పడేలా చూసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకుంటోంది. ఓబీసీ కమ్యూనిటీ నేత అల్పేష్ థాకోర్ సైతం ఎస్సీ, ఎస్టీలకు మద్దతిస్తూ కఠినతరమైన నిషేధ చట్టాన్ని మంచిగా అమలుచేయాలని పిలుపునిచ్చారు. అయితే వరల్డ్ క్లాస్ బిజినెస్ ఈవెంట్లకు మాత్రం సౌలభ్యమిచ్చేలా ఈ నిషేధ చట్ట ఆర్డినెన్స్‌ను తీసుకొస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే విదేశీయులకు సౌకర్యవంతంగా ఉండేలా మద్య నిషేధ పాలసీ అమలుచేయాలని ఆ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ సూచించింది. ఈ మేరకు విదేశీయులకు కిక్కిచ్చేలా, స్థానికులకు మాత్రమే నిషేధ చట్టాన్ని కఠినతరం చేశారు.