promice
-
నాడు కసబ్‌ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది?
అది 2008.. నవంబర్ 26.. ముంబైలోని శివాజీ టెర్మినస్ స్టేషన్.. పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు జనం మధ్య విధ్వంసం సృష్టించారు. రైల్వేస్టేషన్లో ఉగ్రవాదులు దాదాపు 50 మందిని హతమార్చారు. ఈ ఘటనలో 100 మంది గాయపడ్డారు. ఈ దారుణ మారణకాండ ముగిశాక.. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఓ తొమ్మిదేళ్ల బాలిక దేశంలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆ బాలిక పేరు దేవిక రోత్వాన్. దాడి జరుగుతున్న సమయంలో ఆమె శివాజీ టెర్మినస్‌లో ఉంది. నాటి దాడిలో ఆమె కాలికి గాయమైంది. కోర్టులో కసబ్‌ను గుర్తించిన అతి పిన్న వయస్కురాలు దేవిక. ఆ సమయంలో ఆ చిన్నారికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫొటోలో ఆ చిన్నారి ఊత కర్రల సాయంతో కోర్టుకు చేరుకున్న ఫొటో ఉంది. అయితే దేవిక జీవితం ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకుంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం ఆమెకు ఇప్పుడు 24 ఏళ్లు. జనం ఆమెను గుర్తుంచుకుని, కలుసుకునేందుకు వస్తుంటారు. దేవిక కుటుంబానికి గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం నుంచి రూ.13 లక్షల పరిహారం అందింది. ప్రస్తుతం దేవిక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఆమె తండ్రికి కూడా ఎక్కడా ఉద్యోగం లభించడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న ఇల్లు కోసం ఆమె ఎదురుచూస్తోంది. గతంలో దేవిక కుటుంబం ముంబైలోని చాల్లో ఉండేది. అయితే ఆమెకు పునరావాసం కల్పించడంలో భాగంగా వారి కుటుంబానికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆమె రూ.19 వేలు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దేవిక తాను పోలీసు అధికారిని కావాలని ఆశపడుతోంది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమె గత కొంత కాలంగా ఉద్యోగం కోసం వెతుకుతోంది. తాను ఐపీఎస్ అధికారిగా మారాక ఉగ్రవాదాన్ని అంతం చేస్తానని దేవిక మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు! -
గోపాల మిత్రలకు అండగా ఉంటాం
ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం రూరల్ : కరువు జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న గోపాలమిత్రలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ ఎదుట 15 రోజులుగా గోపాల మిత్రలు చేస్తున్న దీక్షలకు సోమవారం ఆయన మద్దతు తెలిపారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఈ రెండేళ్ల టీడీపీ పాలనలో 1.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా.. ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగాలలో పని చేస్తున్న 40 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వ్యాక్సినేటర్లు, పశుమిత్రుల నియామకాల పేరుతో 16ఏళ్లుగా నిస్వార్థంగా పాడిరైతులకు సేవలు అందిస్తున్న గోపాల మిత్రలను తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించే విధంగా ఒక్కో పాడి రైతుకు రూ.2లక్షల చొప్పున రుణాలు అందజేయాలన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాల మిత్రులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పెద్ద ఎత్తున రైతులు గోపాల మిత్రలు పాల్గొన్నారు. అంధుల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : 2014 డీఎస్సీ నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న అంధుల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట విభిన్న ప్రతిభావంతులు చేపట్టిన ధర్నాకు మద్దతు ప్రకటించారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 2014 నోటిఫికేషన్లో జిల్లా వ్యాప్తంగా 30 అంధ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా క్వాలిఫై మార్కుల పేరిట కేవలం 9పోస్టులను మాత్రమే భర్తీ చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు.