Promising
-
టాప్ 100 స్టార్టప్‌లలో భారత్ సంస్థలు.. దిగ్గజాల సరసన చోటు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్‌మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్‌క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిస్కులను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్‌కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషించే సాంకేతికతను జాక్‌మాజ్ రూపొందిస్తోంది. నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్‌క్యూ సంస్థ .. క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్‌సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్‌లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
పోలీసులమంటూ రూ.50లక్షలు ఎత్తుకెళ్లారు..
-
కష్టపడి పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు
పాడేరు, న్యూస్‌లైన్: కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని గిరిజ న సంక్షేమ శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా లో రక్ష సెక్యూరిటీ సంస్థలో జూన్ నెల నుంచి సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందుతున్న గిరిజన యువకులు సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వినూత్నంగా ఆ యువకుల తల్లిదండ్రులతో ఆదివా రం ఫోన్లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన పాడేరు ఐటీడీఏకు ఫోన్ చేసి శిక్షణ పొందిన యువకుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తాను ఇటీవల రక్ష సెక్యూరిటీ శిక్షణ సంస్థను సందర్శించానని, మీ పిల్లలంతా క్షేమంగా ఉన్నారని, ఉత్సాహంగా శిక్షణ పొందుతున్నారని చెప్పారు. అన్ని వసతి సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సంస్థలో ఉద్యోగాలు చేయడం ద్వారా మంచి జీతభత్యాలు లభిస్తాయని, చక్కని భవిష్యత్ ఏర్పడుతుందని భరోశా ఇచ్చారు. విశాఖ ఏజెన్సీలోని గిరిజన యువకులపై మంచి అభిప్రాయం ఉందని, అందుకే వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేసినట్టు తెలి పారు. తమ బిడ్డలకు ఇతర రాష్ట్రాల్లో కాకుండా మన రాష్ర్టంలోనే ఉద్యోగావకాశాలు కల్పించాలని పలువురు తల్లిదండ్రులు కమిషనర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఉద్యోగాలు ఎక్కడ వచ్చిన పనిచేయాలన్నారు. తాను బీహార్‌కు చెందిన వాడనని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే సూపర్వైజర్ స్థాయికి ఎదిగి మరింత ఎక్కువ జీతభత్యాలు పొందుతారని తెలిపారు. అనంతరం రక్ష సంస్థలో శిక్షణ పొందుతున్న జీకే వీధి మండలం సంకాడ గ్రామానికి చెందిన సాగిన రాజుపడాల్, డుంబ్రిగుడ మండలం సంతవలస, కండ్రుం గ్రామాలకు చెందిన కుమిడి రామరాజ్యం, మఠం శంకరరావు తదితరులు తమ తల్లిదండ్రులతో ఈ ఫోన్లో మాట్లాడారు. శిక్షణ బాగుందని, అన్ని సౌకర్యాలు కల్పించారని, సోమవారం ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నామని సంతోషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ కాఫీ సీనియర్ సహాయకులు ఎం.వెంకటేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం జాబ్స్ ఎం.కరుణానిధి, జేడీఏంలు సత్తిరాజు, సతీష్, డీసీసీబీ డెరైక్టర్ బి.నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విశాఖకు ఉజ్వల భవిష్యత్తు
చోడవరం,న్యూస్‌లైన్ : విశాఖ జిల్లాకు ఉజ్వల భవి ష్యత్ ఉందని, అనతికాలంలోనే దేశంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఆవిర్భవిస్తుందని పీఎంఓ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ వి.శేషాద్రి చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని వనరులు విశాఖ జిల్లాలో ఉన్నాయన్నారు. చోడవరంలో ఆయనకు గురువారం పౌరసన్మానం చేశారు. రాజకీయ నాయకులు, విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజలను ఆయనను ఘనం గా సత్కరించారు. నీలం తుపాను సమయంలోను, ఎన్నికల్లోనూ, ఇతర అభివృద్ధి పనులు అమలులోనూ కలెక్టర్ సేవలు మరువ రానివని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లాలో పని చేయడం తన అదృష్టమని చెప్పారు. ప్రతి ఐఏ ఎస్ అధికారి జిల్లా కలెక్టర్‌గా చేయాలని, విశాఖలాంటి జిల్లాలో పని చేయాలని కోరుకుంటారన్నా రు. అలాంటి అవకాశం తనకు వచ్చినా 11 నెలలు మాత్రమే పని చేయడం బాధగా ఉందని, ఇం కొంతకాలం పనిచేస్తే బాగుండుననిపిస్తోందన్నారు. అయితే ప్రతిష్టాత్మకమైన పిఎం కార్యాలయంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, ఈ జిల్లా ప్రజలకు పిఎం కార్యాలయం నుంచి ఏ పనినైనా వెంటనే చేయడానికి తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా ప్రజలు చాలా సౌమ్యులని, బాధల్లో ఉన్నా ఎదుటి వారితో గౌరవంగానే మాట్లాడతారని ప్రజావాణి ద్వారా స్పష్టమయిందన్నారు. విద్యార్ధులు క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో లక్ష్యం చేరే దిశగా చదవాలని సూచిం చారు. అంతకు ముందు చోడవరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ స్వయం భూ విఘ్నేశ్వర, స్వయంభూ గౌరీశ్వరాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డి.వి.రెడ్డి, అదనపు పోలీసు సూపరింటెండెంట్ కిషోర్, డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ, చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు, సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, ఎమ్డీ మజ్జి సూర్యభగవాన్, అనకాపల్లి డీఎస్పీ విఎస్ఎన్ మూర్తి, ఆర్డీవో సుబ్బరాజు, కురచానర్సింహనాయుడు, న్యాయవాధి చీపురపల్లి సూర్యనారాయణ, పట్టణ కాలేజీల అసోషియేషన్ ప్రతినిధులు నాగిరెడ్డి స్వామినాయుడు, జె.రమణాజీ, సిఐ విశ్వేశ్వరరావు, త హసీల్దార్లు శేషశైలజ, పి.అప్పలనాయుడు, ఎస్. భాస్కరరావు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.