property documents
-
ఆధార్‌తో ఆస్తుల అనుసంధానం.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, ఢిల్లీ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయంపై పరిశీలించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. వివరాల ప్రకారం.. దేశంలో ప్రతీ ఒక్కరి ఆస్తులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. కాగా, విచారణ సందర్బంగా ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించి మూడు నెల్లలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఇదే సమయంలో పిటిషనర్ లేవనెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. అయితే, అవినీతి, నల్లధనం ఉత్పత్తి, బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల చర, స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీంతో, జస్టిస్ రాజీవ్ శక్ధేర్, జస్టిస్ గిరీష్ కత్పాలియాలతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పైవిధంగా ఆదేశించింది. [Linking property with #Aadhar] Delhi High Court says it is a policy decision, asks Centre and Delhi governments to take decision on the issue within three months. Court asks the authorities to treat BJP leader Ashwini Upadhyay's plea as a representation. — Lawstreet Journal (@LawstreetJ) December 21, 2023 -
ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు!
లోన్ కోసం బ్యాంకుల వద్ద ఉంచిన రుణ గ్రహీతల ఒరిజినల్ ఆస్తి పత్రాలను పోగొడితే బ్యాంకులు రుణగ్రహీతలకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలలో కస్టమర్ సేవా ప్రమాణాలను సమీక్షించడానికి గత ఏడాది మేలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంగీకరిస్తే ఇది త్వరలో అమల్లోకి రానుంది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో నేతృత్వంలోని ప్యానెల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యాంక్‌కు తన నివేదికను సమర్పించింది. ప్యానెల సిఫార్సులలో ఈ సూచన కూడా ఉంది. కమిటీ సిఫార్సులపై వాటాదారుల అభిప్రాయాలను ఆర్బీఐ కోరింది. జూలై 7లోగా తమ అభిప్రాయాలను వాటాదారులు తెలియజేయాల్సి ఉంటుంది. లోన్ అకౌంట్‌ను మూసివేసిన అనంతరం రుణగ్రహీతకు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి బ్యాంకులకు కాల పరిమితిని నిర్దేశించడాన్ని ఆర్బీఐ పరిగణించవచ్చని ప్యానెల్ సూచించింది. లేని పక్షంలో ఆలస్యమైన మేరకు జరిమానా లేదా పరిహారం చెల్లించేలా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించింది. పరిహారం చెల్లించాల్సిందే! ఆస్తి పత్రాలు బ్యాంకులు పోగొట్టిన సందర్భంలో పత్రాల సర్టిఫైడ్ రిజిస్టర్డ్ కాపీలను తమ ఖర్చుతో అందించడమే కాకుండా, ఈ క్రమంలో కస్టమర్లు కోల్పోయిన విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా పరిహారం చెల్లించడానికి బ్యాంక్ బాధ్యత వహించాలని ప్యానెల్ సూచించింది. సాధారణంగా లోన్లు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఒరిజినల్ ఆస్తి పత్రాలను తమ వద్ద ఉంచుకుంటాయి. రుణాలు పూర్తిగా తిరిగి చెల్లించాక వాటని కస్టమర్లకు ఇస్తాయి. అయితే, రుణాన్ని సకాలంలో చెల్లించినప్పటికీ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు చాలా సమయం తీసుకుంటున్నాయని ఆర్బీఐకి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సిఫార్సులు వచ్చాయి. ఇదీ చదవండి: Aadhaar-based UPI: ఆధార్‌తో యూపీఐ పేమెంట్: గూగుల్‌పేలో కొత్త ఫీచర్ -
ఇంటి దస్తావేజులు బ్యాంకులో పోతే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంక్ రుణంతో ఇల్లు కొనడం తెలిసిందే. ఇంటి దస్తావేజులు తనఖాగా పెట్టి రుణం తీసుకోవటమూ సహజమే! కాకపోతే ప్రతినెలా క్రమం తప్పకుండా ఈఎంఐ కట్టేసి... చివరికి బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటారు. అన్నీ చేశాక... తనఖా పెట్టిన ఇంటి దస్తావేజులు ఎక్కడో పోయాయని బ్యాంక్ చెబితే? బ్యాంక్ అధికారులతో గొడవ పెట్టుకుంటాం. లేకపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీ కోసం దరఖాస్తు చేస్తాం. కానీ, మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ శెట్టి అలా చేయలేదు. 2004లో ప్రదీప్ మహారాష్ట్ర పరెల్‌లోని స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్‌లో రూ.9 లక్షల గృహ రుణం తీసుకున్నాడు. ఈఎంఐలన్నీ కట్టేశాక, బ్యాంక్ నుంచి నో– డ్యూస్ సర్టిఫికెట్ కూడా పొందాడు. ఆ తర్వాత బ్యాంక్ అందించాల్సిన సేల్‌డీడ్ కాపీలను ఇవ్వకుండా అవెక్కడో మిస్సయ్యాయని చెప్పింది. దీంతో ప్రదీప్ ‘‘తనఖా పెట్టిన దస్తావేజులను బ్యాంక్ ఎక్కడో పోగొట్టింది. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సేల్‌డీడ్ కాపీలు లేకపోవటంతో ఇంటిని విక్రయించలేకపోతున్నా. పైగా ఈ సంఘటనతో మానసిక వేదనకు గురయ్యా. విలువైన సమయం వృథా అయింది. అందుకు నాకు బ్యాంక్ నష్ట పరిహారాన్ని చెల్లించాలి’’ అంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. నష్టపరిహారం సరిపోలేదు.. వివరాలన్నీ చూసిన మీదట ప్రదీప్‌కు బ్యాంకు రూ.60 వేల నష్ట పరిహారాన్ని చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేలు దస్తావేజులు పోగొట్టినందుకు... రూ.5 వేలు మానసిక వేదనకు గురి చేసినందుకు... మరో రూ.5 వేలు ఫిర్యాదు దాఖలు ఖర్చులకు అని తెలియజేసింది. అయితే ఈ పరిహారంతో సంతృప్తి చెందని ప్రదీప్ శెట్టి.. మహారాష్ట్రలోని రాష్ట్రస్థాయి వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్ తలుపు తట్టాడు. దీంతో స్టేట్ ఫోరం.. నష్ట పరిహార మొత్తాన్ని రూ.60 వేల నుంచి రూ.1.15 లక్షలకు పెంచింది. పైగా 3 నెలల్లోపు కస్టమర్‌కు సర్టిఫైడ్ సేల్‌డీడ్ కాపీని అందించాలని.. లేని పక్షంలో ప్రతి నెలా రూ.50 వేల జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పు కేవలం ప్రదీప్ శెట్టికే కాదు. మనలో ఎవరి ప్రాపర్టీ దస్తావేజులైనా సరే బ్యాంక్‌లు పోగొడితే.. కస్టమర్‌కు నష్ట పరిహారంతో పాటూ తిరిగి సర్టిఫైడ్ సేల్ డీడ్ కాపీని కూడా అందించాల్సిన బాధ్యత బ్యాంక్‌లదే! ఇందుకోసం స్థానిక వినియోగదారుల ఫోరాన్ని సంప్రతిస్తే చాలు! ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రాపర్టీ దస్తావేజులు దొంగలు పడో లేక ఇతరత్రా కారణాల వల్లనో మిస్ అయితే..? ♦ దస్తావేజులు పోయాయని కంగారు పడకండి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫైడ్ దస్తావేజులను పొందొచ్చు. కాకపోతే కొంత శ్రమించాల్సి ఉంటుంది. ♦ ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో సేల్ డీడ్ పోయిందని ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత దస్తావేజులు పోయినట్టుగా స్థానిక వార్తా పత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఎవరికైనా దొరికితే సమాచారం అందించాలని కోరుతూ నోటీసు ఇవ్వాలి. ♦ గతంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించారో మళ్లీ అదే కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ సేల్‌డీడ్ దస్తావేజులు పోయినట్లు సంబంధిత అధికారికి వివరించి సర్టిఫైడ్ కాపీని ఇవ్వాలని కోరుతూ స్వీయ దస్తూరితో లెటర్ రాసివ్వాలి. ♦ ఫామ్–22లో పేరు, చిరునామా వంటి వివరాలన్నీ నమోదు చే సి.. ప్రాపర్టీ జిరాక్స్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ప్రాపర్టీ పేరు మీద ఉన్న ఆధార్, పాన్, రేషన్ కార్డ్, కరెంట్ బిల్లు వంటివి జత చేయాలి. వీటన్నింటికీ పోలీసు ఫిర్యాదు కాపీ, పత్రికా ప్రకటన జత చేసి సబ్ రిజిస్ట్రార్‌కు అందించాలి. నిర్ణీత ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. -
రూపాయి వడ్డీకే రుణమంటూ తోడేస్తారు...
► ప్రాసెసింగ్ ఫీజుల పేరుతోనే రూ.వేలల్లో స్వాహా ► కర్నూలు కేంద్రంగా కథ నడిపిన ఘరానా గ్యాంగ్ ► నిందితుడిని అరెస్టుచేసిన టాస్క్‌ఫోర్స్ బృందం సాక్షి, సిటీబ్యూరో: రూపాయి వడ్డీకి రుణాలంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వడం... అప్లికేషన్ ఫీజ్ నుంచి ఎన్ఓసీ వరకు పది రకాల చార్జీల పేరుతో దండుకోవడం... చివరకు రుణం ఇవ్వకపోవడం. కర్నూలు కేంద్రంగా ఇలా మోసం చేస్తున్న ముఠా గుట్టును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం ముఠాలోని ఒకరి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా నంది కొట్కూరుకు చెందిన ఎస్.శేషుఫణి, సత్య నరసయ్య, గాయత్రి, శారద స్నేహితులు. వీరంతా కలిసి అదే జిల్లా తుమ్మలూరులో బాలాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇందులోనే లక్ష్మీ నర్సింహ చిట్స్ పేరుతో మరో కంపెనీ నడుపుతున్నారు. వీరికి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌తో పాటు నగరంలోని నామాలగుండు, చిలకలగూడల్లోనూ బ్రాంచ్‌లు ఉన్నాయి. స్థిరాస్తులపై ప్రభుత్వ ఉద్యోగుల హామీతో రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తామంటూ పత్రికల్లో ప్రకటన ఇస్తున్నారు. ఆకర్షితులై తమ కార్యాలయాలకు వచ్చిన వారికి 43 షరతులతో కూడిన పత్రాలు అందిస్తారు. అక్కడ నుంచి దండుకోవడం ప్రారంభించి అందినకాడికి వసూలు చేస్తారు. చివరకు ఒక్క పైసా కూడా రుణం ఇవ్వకుండా మోసం చేస్తారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకట రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి బృందం చిలకలగూడలోని కార్యాలయంపై శుక్రవారం దాడి చేశారు. నిందితుడు శేషుఫణిని అరెస్టు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే ఎస్సై ఎం.ప్రభాకర్‌రెడ్డిని 9490616667 నెంబర్లో సంప్రదించాలని డీసీపీ కోరారు. గ్యాంగ్ ‘వసూళ్ల మెనూ’ ఇదీ... దరఖాస్తు రుసుం: రూ.1000 నోటరీ సర్టిఫికెట్ ఇచ్చే లాయర్ ఫీజు : రూ.2 వేలు ఇంటికి వెరిఫికేషన్‌కు వచ్చేందుకు: రూ.12 వేలు అందుకు రవాణా, ఇతర చార్జీలు: రూ.8 వేలు ఆస్తిపై అభ్యంతరాలు కోరుతూ రెండు పేపర్ ప్రకటనలకు: రూ.24 వేలు వాల్యూయేషన్ సర్టిఫికెట్, రవాణా చార్జీలు: రూ.7 వేలు ప్రాసెసింగ్ ఫీజ్: రూ.5 వేలు నకిలీ శాలరీ, వాల్యూ, ఎన్ఓసీ పత్రాలకు: రూ.25 వేలు -
విడాకులు తప్పకుంటే... ఆ తప్పులు చేయొద్దు
స్థూలంగా గుర్తుంచుకోతగినవి.. ♦ కుటుంబం ఆస్తులు, అప్పులను విశ్లేషించుకోవాలి. ♦ అన్ని ఆర్థిక, ఆస్తి పత్రాలు దగ్గర ఉంచుకోవాలి. ♦ ఉమ్మడివైనా, వ్యక్తిగతమైనవైనా అన్ని అప్పులను మదింపు చేసుకోవాలి. ♦ కట్టాల్సిన పన్నులు, బకాయిలు వంటి వాటి గురించి అవగాహన ఉండాలి. మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్.. అన్నది చాలా ప్రాచుర్యం పొందిన నానుడి. నిజమే. కానీ స్వర్గంలో రాసిపెట్టిన వైవాహిక బంధం .. దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని సందర్భాల్లో కలకాలం సాగకపోవచ్చు. అనేకానేక కారణాలు.. విడాకులకు దారి తీయొచ్చు. ఇలాంటప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది. మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఆర్థికాంశాల విషయానికొస్తే.. ఆస్తుల పంపకాలు, ఉమ్మడిగా నెరవేర్చాల్సిన బాధ్యతలు, తీర్చాల్సిన అప్పులు చాలా ఉంటాయి. దీర్ఘకాలంలో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తకుండా ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించేదే ఈ కథనం. విడాకుల పరిస్థితి తలెత్తినప్పుడు అన్నింటికన్నా ముందుగా.. కుటుంబం ఆస్తులు, అప్పుల గురించి అవగాహన ఉండాలి. వ్యక్తిగతంగా మీ ఆదాయం, మీతో పాటు మీ జీవిత భాగస్వామి ఆదాయాలు (ఒకవేళ వారు కూడా ఆర్జిస్తున్న పక్షంలో), మొత్తం అప్పుల గురించి తెలిసి ఉండాలి. దీనివల్ల విడాకుల తర్వాత మీ చేతికి వచ్చేదేమిటీ అన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆ తర్వాత మీరు అలవాటుపడిన జీవనవిధానాన్ని ఇకపై కూడా యథాప్రకారం కొనసాగించేందుకు ఎంత మేర నగదు అధికంగా అవసరమవుతుందో లెక్కించుకోవాలి. విడాకుల ద్వారా వచ్చేది (ఆస్తుల పంపకం), మీ ఆదాయం.. వీటన్నింటినీ లెక్కవే సుకున్నాక, నగదు అవసరాల్లో వాటికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి. భవిష్యత్‌లో ఇతరత్రా సమస్యేమీ తలెత్తకుండా ఆస్తులు మొదలైన వాటికి సంబంధించి జాయింట్‌గా ఉన్నవైనా, సింగిల్‌గా ఉన్నవైనా... అన్ని ఆర్థిక పత్రాలు దగ్గర ఉంచుకోవాలి. ఇవన్నీ తర్వాతెప్పుడైనా కూడా అవసరం పడొచ్చు గనుక వీటిని సురక్షితమైన చోట భద్రంగా ఉంచాలి. వివాహం ద్వారా వచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చే ఆస్తి సంబంధిత చట్టాల గురించి కూడా అవ గాహన ఉండాలి. ఆస్తి పత్రాలు దగ్గర ఉంటే యాజమాన్య హక్కులను గురించి చింతించనక్కర్లేదు. న్యాయపరమైన అడ్డంకులేమైనా ఉన్నా అధిగమించవచ్చు. ఇక్కడో విషయం. డైవర్స్ ద్వారా వచ్చే ఆస్తులు, ప్రాపర్టీలు అన్నీ కూడా ఉపయోగకరమేనని భావించడానికి లేదు. ఉదాహరణకు, మీ వాటా కింద పెద్ద ఇల్లు వచ్చిన పక్షంలో చూడటానికి బాగానే ఉంటుంది. కానీ భారీ భవంతికి.. మెయింటెనెన్స్ ఖర్చులూ భారీగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి. అంతే గాదు దానిపై రుణ బకాయిలేమైనా ఉన్నా కూడా సమస్యే. ఎవరి బకాయిలెంత.. కొన్నిసార్లు జీవిత భాగస్వాములిద్దరూ కట్టాల్సిన రుణాలు ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ కలసి తీసుకున్న గృహ రుణం లాంటివి ఈ కోవకి వస్తాయి. ఒకోసారి వ్యక్తిగత రుణాలు లాంటివి ఉండొచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై కట్టాల్సిన బాకీల్లాంటివి. ఇవన్నింటి గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎవరెవరికి ఎవరు ఎంతెంత కట్టాల్సి ఉంటుందన్నది లెక్క వేసుకోవాలి. ఇవి గాకుండా, పన్నుపరమైన బాధ్యతలు కొన్ని ఉంటాయి. మీ భాగస్వామి ఆర్థిక స్థితిగతులు, పన్నుల రికార్డులు మొదలైనవన్నీ మదింపు చేసేందుకు సమర్థులైన ఆడిటర్ సహకారం తీసుకోవడం మంచిది. దీనివల్ల భవిష్యత్‌లో పన్ను బకాయిల్లాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు సదరు భాగాలపై వర్తించే పన్నులు, ఎవరు ఎంత కట్టాల్సి ఉంటుందనేది కూడా ముందుగానే నిర్ధారించుకోవాలి. ఒకవేళ జాయింట్ బ్యాంకు అకౌంటు ఉండి, ఇతరత్రా ఆస్తులు, క్రెడిట్ కార్డులు మొదలైనవి దానికే అనుసంధానమై ఉంటే మరికొన్ని అంశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఖాతాను వేరు చేసి, ఆస్తులను పంచుకున్నప్పుడు క్రెడిట్ స్కోర్లు, క్రెడిట్ కార్డుల పరిమితులు మొదలైనవన్నీ కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, జాయింట్ అకౌంటుతో పాటు ఎవరికి వారికి తమ ప్రత్యేక బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డుల్లాంటివి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు. -
రూ.200 కోట్ల ఆస్తి పత్రాల చోరీ కేసులో పోలీసులు సక్సెస్
హైదరాబాద్‌సిటీ (సుల్తాన్‌బజార్): ఇటీవల సంచలనం సృష్టించిన రూ. 200 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, ఇతర వస్తువులు చోరీకి గురైన సంఘటనలో సుల్తాన్‌బజార్ పోలీసులు శుక్రవారం పురోగతి సాధించారు. ఈ నెల 23వతేదీ తన ఆస్తులకు చెందిన రూ. 200 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు చోరికి గురైయ్యాయని వ్యాపారీ సుశీల్ కాపాడియా సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఉన్నతాధికారులతోపాటు కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో పోలీసులు కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. చోరీకి గురైన వస్తువులను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వ్యాపారి సుశీల్‌కుమార్ కాపాడియా ఛారిటబుల్ ట్రస్ట్‌తో పాటు 45 సంస్థలకు చెందిన ఆస్తుల పత్రాలు, ఇతర ఫిక్స్ డ్ డిపాజిట్లు, బాండ్లను సుల్తాన్‌బజార్ గుజరాతీ గల్లీలోని తన కార్యాలయంలో భధ్రపరిచారు. ఇదేసమయంలో కార్యాలయం అద్దె విషయంలో యజమాని చైతన్యకుమార్‌కు, సుశీల్‌కుమార్‌లకు విభేదాలు తలెత్తాయి. సుశీల్‌కుమార్ ఆ కార్యాలయం తెరవకపోవడంతో 21వ తేదీన యాజమాని చైతన్యకుమార్ కాపాడియా చారిటబుల్ ట్రస్ట్‌లో ఉన్న 12 బీరువాలు, 3 లాకర్లు, ఇతర ఫర్నీచర్‌ను ఖాళీ చేయించి మొయినాబాద్ లోని తన ఫాంహౌస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో తన ఆస్తులకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, నగదు, ఫర్నిచర్ చోరీకి గురయ్యాయని సుశీల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం రూ. 200 విలువైన డాక్యుమెంట్లు, 12 బీరువాలు, 3 లాకర్లు, ఇతర ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు.