prosecuted
-
చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కర్ణాటక ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొనున్నారు. ముడా కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ఈ స్కామ్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త స్నేహమయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని, ఆయనపై ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలని ఆదేశిస్తూ గవర్నర్ గత నెలలో ముఖ్యమంత్రికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీతో ప్రాసిక్యూషన్‌ను అనుమతించవద్దని గవర్నర్‌ను కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. నోటీసును ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సూచించింది. గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.అయితే తనపై వచ్చిన ఆరోపణలను సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తనపై, కర్ణాటక సర్కారుపై బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమ కుటుంబానికి ఎవరు, ఎలా ఆ భూములను కేటాయించారో తనకు తెలియదని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఈ కేటాయింపులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. భూముల కేటాయింపుల్లో 50:50 ఫార్ములాను బీజేపీనే ప్రతిపాదించిందని పేర్కొన్నారు.ముడా కుంభకోణం ప్రకంపనలు..ఇదిలా ఉండగా సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.మరోవైపు, 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ గత వారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. కేసరే గ్రామంలో మూడెకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూమి తమదే అని నిరూపించడంతో ఆయన విఫలమయ్యాయడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే, పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జు్న్పై మరో ఫిర్యాదు దాఖలైంది. ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారుల సహకారంతో 2004లో మల్లికార్జున్ అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అందులో పేర్కొన్నాడు. దీంతో, కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపించాడు. -
అక్బరుద్దీన్ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి
హైదరాబాద్: మత విద్వేషాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రసంగం చేసినందుకు 2004లో చాంద్రాయణగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వు జారీ చేశారు. 2004 ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధి గ్రాండ్ సర్కిల్ హోటల్ వద్ద జరిగిన సభలో అక్బరుద్దీన్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు 2.4.2004న ఐపీసీ సెక్షన్ 153-ఎ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అక్బరుద్దీన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు పోలీసులు ప్రభుత్వ అనుమతిని కోరారు. ఈ కేసుకు సంబంధించిన రికార్డులను పరిశీలించిన ప్రభుత్వం, ఆయున ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. -
వక్ఫ్ బోర్డు ఆస్తులపై విచారణ చేస్తాం
తాడిపత్రి, న్యూస్‌లైన్: స్థానిక వక్ఫ్‌బోర్డు ఆస్తుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు మున్నా చేస్తున్న నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. తహశీల్దార్ రామకృష్ణారెడ్డి శిబిరం వద్దకు చేరుకుని ఆయనతో మాట్లాడారు. జరిగిన అక్రమాలపై కలెక్టర్, ఆర్డీవోలకు నివేదిక పంపుతామన్నారు. పూర్తి విచారణ చేపడతామని హామీ ఇస్తూ మున్నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపు చేశారు. అంతకు ముందు మున్నా మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల్లో రూ.కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆధారాలతోసహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు విచారణకు ఆదేశించినా అమలుకాలేదన్నారు. కమిటీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, తాడిపత్రి నియోజర వర్గ సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలానరసింహయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరంనాగిరెడ్డి, తదితర నాయకులు మున్నాను పరామర్శించిన వారిలో ఉన్నారు. శిబిరంలో వైఎస్సార్సీపీ కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు వెంకటేశ్, బండామసీదు ముత వల్లీ జిలాన్‌బాషా, మైనార్టీ నాయకులు రహాంతుల్లా, ఆయాబ్, ముష్కిన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ‘వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడండి’ తాడిపత్రి టౌన్: పట్టణంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని బీజేపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో అధికార పార్టీ నాయకుల అండతో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను కాపాడాలన్నారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను కోరనున్నామన్నారు.