protectionism
-
G20 Summit: వృద్ధి విధానాలకు మద్దతు
న్యూఢిల్లీ: అందరికీ వృద్ధి, శ్రేయస్సు కారకాలుగా పనిచేయడానికి వాణిజ్యం, పెట్టుబడిని అనుమతించే విధానాలకు మద్దతు ఇవ్వాలని జీ–20 సభ్య దేశాలు అంగీకరించాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కేంద్రంగా ఉన్న నిబంధనల ఆధారంగా వివక్షత లేని, న్యాయ, బహిరంగ, కలుపుకొని, సమాన, స్థిర, పారదర్శక బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ అనివార్యం’ అని జీ–20 వేదికగా నాయకులు ప్రకటించారు. రక్షణవాదం, మార్కెట్‌ను వక్రీకరించే పద్ధతులను నిరుత్సాహపరచడం ద్వారా అందరికీ అనుకూల వాణిజ్యం, పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించడానికి న్యాయమైన పోటీ వాతావరణాన్ని సృష్టించాలన్న నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. 2024 నాటికి సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా పూర్తి, మెరుగ్గా పనిచేసే వివాద పరిష్కార వ్యవస్థను కలిగి ఉండాలనే ఉద్దేశంతో చర్చలు నిర్వహించడానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. వాణిజ్యం, పర్యావరణ విధానాలు ప్రపంచ వాణిజ్య సంస్థ, పర్యావరణ ఒప్పందాలకు అనుగుణంగా పరస్పరం మద్దతునిచ్చేవిగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
దేశీయ ఐటీరంగానికి ట్రంప్ ఒక వరం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భారత ఐటీ పరిశ్రమపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఐటీ పరిశ్రమ హానికరమైనవిగా అందరూ భావిస్తోంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మరోలా స్పందించారు. వాస్తవానికి ట్రంప్ విధానాలు, చేపడుతున్న రక్షణాత్మక ఆర్థిక విధానాలే దేశీయ ఐటీ పరిశ్రమకు వరం లాంటివని వ్యాఖ్యానించారు. ఆందోళల్ని పక్కనపెట్టి దేశీయ ఐటీ వృద్ధికి కృషిచేయాలని ఆయన ఐటీ పరిశ్రమను కోరారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల ప్రారంభం సందర్భంగా ముకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాలు మరో రూపంలో ఐటీ పరిశ్రమకు సాయం చేస్తున్నట్టే అని చెప్పారు. దేశీయ ఐటీ మార్కెట్ కూడా భారీగా ఉన్న నేపథ్యంలో దేశంలోని ఐటీ సమస్యలను పరిష్కరించడంలో భారత ఐటి పరిశ్రమ దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ఆలోచనలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచం గోడలు నిర్మించాలని ఆలోచిస్తుండొచ్చు..కానీ దానికి ఇండియా ప్రభావితం కావాల్సిన అవసరం లేదన్నారు. భారతదేశం ద్వారాలు తెరిచే ఉండాలన్నారు.