చేవెళ్ల జిల్లా కోరుతూ ఆందోళనలు
రంగారెడ్డి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
చేవేళ్లను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్ష నేతలు చేపట్టిన బంద్ ఏడు రోజు కొనసాగుతోంది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేతల ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం రాత్రి వారిని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలకు నేతలు నిరాకరిస్తున్నారు. చేవెళ్ల రహదారులను నేతలు దిగ్భంధించడంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బంద్ కారణంగా పరిగి, తాండూరు మీదుగా హైదరాబాద్ వచ్చే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ఉదయం రోడ్లపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు తమ ఆందోళనలు విరమించేదిలేదని నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వికారాబాద్ లో మాజీ మంత్రి చంద్రశేఖర్ నేతృత్వంలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.