చేవేళ్లను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్ష నేతలు చేపట్టిన బంద్ ఏడు రోజు కొనసాగుతోంది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేతల ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం రాత్రి వారిని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలకు నేతలు నిరాకరిస్తున్నారు. చేవెళ్ల రహదారులను నేతలు దిగ్భంధించడంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బంద్ కారణంగా పరిగి, తాండూరు మీదుగా హైదరాబాద్ వచ్చే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం ఉదయం రోడ్లపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛందంగా వ్యాపార, విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు తమ ఆందోళనలు విరమించేదిలేదని నేతలు హెచ్చరిస్తున్నారు.
Published Fri, Sep 23 2016 8:15 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement